breaking news
ambaiah
-
వ్యక్తి అనుమానాస్పద మృతి
కల్హేర్(నారాయణఖేడ్): మెడలో ఉరితాడుతో అనుమానస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుడిని ఎవరైన హత్య చేశారా? ఆత్మహత్య చేసకున్నాడా అనే విషయం ప్రశ్నర్థకంగా మారింది. మంగళవారం సిర్గాపూర్ మండలం కడ్పల్ శివారులో ఈ సంఘటన జరిగింది. కడ్పల్ గ్రామనికి చెందిన జువ్వి అంబయ్య(40) చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు శవమై కనిపించాడు. అంబయ్య మృతి పట్ల కుటుంబీకులు, గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేశారు. అంబయ్య మృతి పట్ల భార్య జువ్వి భవానీ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో అనుమానం వ్యక్తం చేసింది. కంగ్టి సీఐ వెంకటేశ్వర్రావు, సిర్గాపూర్ ఎస్ఐ మొగులయ్య, ఎఎస్ఐ నారాయణ సంఘటన స్థలాన్ని సందర్శించారు. అంబయ్య మృతి పట్ల విచారణ జరిపారు. మిస్టరీ ఛేదించేందుకు డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంను రంగంలోకి దించారు. డాగ్ స్క్వాడ్ సంఘటన స్థలం నుంచి కొద్ది దూరంలో రోడ్డు వరకు వెళ్లి ఆగింది. దీంతో క్లూస్ టీం అధికారులు ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తామని ఎస్ఐ మొగులయ్య తెలిపారు. మృతదేహన్ని నారాయణఖేడ్ ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం జరిపారు. భార్య మందలించిందనిమరో అనుమానం.. మృతుడు జువ్వి అంయ్యకు గతంలో పెద్దపేగుకు సంబందించి శాస్త్ర చికిత్స జరిగింది. అనారోగ్యంతో బాధపడుతు మందులు వాడుతున్నాడు. మద్యం సేవించడంతో భార్య భవానీ మందలించడంతో మనస్థాపం చెందిన అంబయ్య ఇంటి నుంచి వెళ్లి ఉరేసుకుని ఆత్మహత్య చేసకున్నాడని గ్రామంలో వదంతులకు దారితీసింది. మెడలో ఉరితాడుతో కింద కూర్చుని ఆత్మహత్య చేసుకోవడం జరుగాదని, ఎవరైన హత్య చేశారా? అనే అనుమాననికి బలం చేకురుస్తుంది. పోలీసుల దర్యాప్తుతో మిస్టారీ వీడే అవకాశం ఉంది. -
వృద్ధ దంపతుల దారుణ హత్య
నారాయణఖేడ్ : మెదక్ జిల్లా నారాయణఖేడ్ మండలం సత్యగామ గ్రామంలో శనివారం వేకువజామున వృద్ధదంపతులను హత్యచేశారు. వివరాలు.. గ్రామానికి చెందిన అంబయ్య(75), సుశీలమ్మ(70) శుక్రవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు వారిని హత్య చేసి వారివద్ద ఉన్న నగలు, నగదు దోచుకెళ్లారు. శనివారం ఉదయం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
వ్యక్తి ఆత్మహత్య
బీర్కూర్: మానసిక స్థితి సరిగాలేని ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా బీర్కూర్ మండలంలో సోమవారం చోటు చేసుకుంది. వివరాలు.. మండల కేంద్రానికి చెందిన అంబయ్య (28) భార్య అనారోగ్యంతో కొద్ది రోజుల క్రితమే మృతి చెందింది. అప్పటి నుంచి అంబయ్య మానసిక స్థితి సరిగా లేదు. సోమవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా, అంబయ్యకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.