breaking news
AirAsia plane
-
కబాలి విమానం సీక్రెట్ ఇదే..
విడుదలకు ముందే సంచలనం సృష్టించిన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా కబాలికి సంబంధించి ఎన్నో విశేషాలున్నాయి. బాక్సాఫీసు వద్ద రికార్డు కలెక్షన్లు సాధిస్తున్న కబాలిని రిలీజ్‌కు ముందు ప్రమోట్ చేయడానికి, రజనీ క్రేజ్‌ను ఉపయోగించుకోవడానికి కార్పొరేట్ కంపెనీలు పోటీపడ్డ సంగతి తెలిసిందే. రజనీ అభిమానులను ఎక్కువగా ఆకర్షించింది మాత్రం కబాలి విమానం. మలేసియాకు చెందిన ఎయిర్ఏషియా సంస్థ కబాలి పేరుతో ఓ విమానాన్ని నడిపింది. ఆ విమానంపై సూపర్ స్టార్ రజనీ పేరును ఇంగ్లీషులో రాయించడంతో పాటు కబాలి సినిమాలోని రజనీ పోస్టర్లను భారీ సైజులో వేయించింది. గతంలో ఏ భారతీయ హీరోకు కూడా ఇంతటి గౌరవం దక్కలేదు. ఇలా రజనీ ఖ్యాతి ఆకాశమంత ఎత్తుకు ఎదిగింది. ఇంతకీ కబాలి విమానంపై ఎలా పెయింట్ వేశారు, ఇందుకోసం ఎంతమంది పనిచేశారనే విషయాన్ని ఎయిర్ఏషియా వెల్లడించింది. దీనికి సంబంధించి విడుదల చేసిన వీడియో యూ ట్యూబ్‌లో హల్ చల్ చేస్తోంది. కబాలి బ్రాండ్ విమానం కోసం 300కు మందికిపైగా టెక్నిషియన్లు పనిచేశారు. రజనీ ఫొటోలు, పేరుతో రంగుల్లో కబాలి విమానం కనిపించేలా చేయడానికి దాదాపు 200 గంటలు పనిచేశారు. కబాలి విమానం వెనుక ఇంతమంది శ్రమ దాగుంది. -
కబాలి విమానం సీక్రెట్ ఇదే..
-
ఎయిర్ ఏషియా బ్లాక్ బాక్స్ గుర్తింపు
జకర్తా: ఎయిర్ ఏషియా విమాన ప్రమాద ఘటనపై అధికారులు కీలక పురోగతి సాధించారు. విమాన బ్లాక్ బాక్స్‌ను ఇండోనేసియా అధికారులు గుర్తించారు. జావా సముద్రంలో బ్లాక్ బాక్స్‌ను కనుగొన్నారు. బుధవారం విమాన తోక శకలాన్ని గుర్తించిన అన్వేషణ బృందం.. బ్లాక్ బ్లాక్ కూడా అదే ప్రాంతంలో ఉంటుందని గాలింపు చర్యలు చేపట్టారు. రెండు వారాల క్రితం ఇండోనేసియా నుంచి సింగపూర్ వెళ్తున్న ఎయిర్ ఏషియా విమానం జావా సముద్రంలో కూలిపోయిన సంగతి తెలిసిందే. విమానంలో ఉన్న 162 మంది మరణించారు. ఇప్పటివరకు 40 మృతదేహాలను మాత్రమే వెలికితీశారు. -
ఎయిర్ ఏషియా బ్లాక్ బాక్స్ నుంచి సంకేతాలు
ఇండోనేసియా : జావా సముద్రంలో కూలిన ఎయిర్ ఏషియా 8501 విమానానికి చెందిన బ్లాక్ బాక్స్ నుంచి సంకేతాలు వస్తున్నట్లు ఇండోనేసియా ఉన్నతాధికారులు శుక్రవారం వెల్లడించారు. బ్లాక్ బాక్స్ కోసం అన్వేషిస్తున్న బృందాలు తమ చర్యలను ముమ్మరం చేసింది. ఆ క్రమంలో శుక్రవారం ఉదయం సముద్రం అడుగు నుంచి భాగం నుంచి సంకేతాలు వస్తున్నట్లు అన్వేషణ బృందాలు గుర్తించాయి. బుధవారం విమాన తోక శకలాన్ని అన్వేషణ బృందం గుర్తించిన సంగతి తెలిసిందే. బ్లాక్ బ్లాక్ కూడా అదే ప్రాంతంలో ఉన్నట్లు బృందాలు గర్తించాయి. ఆదే విషయాన్ని వారు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.దాంతో బ్లాక్ బాక్స్‌ను వెలికితీసేందుకు అధికారులు చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. సాధ్యమైనంత త్వరగా బ్లాక్ బాక్స్‌ను బయటకు తీస్తామని ఉన్నతాధికారులు వెల్లడించారు. -
‘విమానం’.. విషాదాంతం
-
‘విమానం’.. విషాదాంతం
* సముద్రంలో కూలిన ఎయిర్ ఆసియా విమానం * తేలుతూ కనిపించిన మృతదేహాలు, విమాన శకలాలు * మూడు మృతదేహాల వెలికితీత * అలలతో గాలింపునకు ఆటంకం జకర్తా/సింగపూర్: ఎయిర్ ఆసియా విమాన అదృశ్య ఉదంతం విషాదాంతమైంది. అందులో ప్రయాణిస్తున్నవారి కుటుంబ సభ్యులు, బంధువుల ప్రార్థనలు ఫలించలేదు. ఆ విమానం జావా సముద్రంలో కూలిపోయినట్లు మంగళవారం నిర్ధారణ అయింది. గాలింపు సిబ్బందికి జావా సముద్రజలాలపై బోర్నియోకు దగ్గరలో ఆ విమాన శకలాలు, ఉబ్బిపోయిన కొన్ని మృతదేహాలు కనిపించాయి. ఆదివారం ఉదయం ఇండోనేసియా నుంచి సింగపూర్‌కు వెళ్తున్న ఎయిర్‌బస్ సురబయ విమానాశ్రయం నుంచి బయల్దేరిన కాసేపటికే ఏటీసీతో సంబంధాలు తెగిపోయి అదృశ్యవడం తెలిసిందే. ఏడుగురు సిబ్బంది సహా మొత్తం 162 మంది ఆ విమానంలో ఉన్నారు. వారిలో 149 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఇండోనేసియా వారే. అప్పటినుంచి మలేసియా, సింగపూర్, ఆస్ట్రేలియాల సహకారంతో ఇండోనేసియా పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టింది. గాలింపులో 30 నౌకలు, 15 విమానాలు, 7 హెలికాప్టర్లు పాలు పంచుకున్నాయి. అయితే, ఇప్పటికీ ప్రమాద కారణం మిస్టరీగానే ఉంది. ఇప్పటివరకు 3 మృతదేహాలను(ఇద్దరు పురుషులు, ఒక మహిళ) మాత్రమే వెలికితీశామని, అంతకుముందు ఇండోనేసియా నేవీ ప్రకటించినట్లుగా 40 మృతదేహాలను కాదని గాలింపు, సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్న ఇండోనేసియా గాలింపు, సహాయక సంస్థ చీఫ్ బాంబంగ్ సొలిస్టో తెలిపారు. మరిన్ని మృతదేహాల కోసం గాలింపు కొనసాగిస్తున్నామన్నారు. ప్రతికూల వాతావరణంతో పాటు 2, 3 మీటర్ల ఎత్తున ఎగుస్తున్న అలలు గాలింపు చర్యలకు ఆటంకం కలిగిస్తున్నాయన్నారు. మృతదేహాల వెలికితీత కోసం ఘటనాస్థలంలోకి ఇండోనేసియా యుద్ధనౌక, అమెరికాకు చెందిన మరో విమాన విధ్వంసక నౌకలు వెళ్తున్నాయి.అంతకుముందు, ఇండోనేసియా వైమానిక దళ విమానం సెంట్రల్ కాళిమంథన్ సమీపంలోని కరిమట సంధి వద్ద జావా సముద్ర అడుగుభాగంలో విమాన ఆకారంలో ఉన్న ఒక నీడను గుర్తించింది. అక్కడే విమాన శకలాలనూ గుర్తించడంతో దాంతో ఆ ప్రాంతంలో గాలింపును కేంద్రీకృతం చేశామని తెలిపారు. అదే ప్రాంతంలో ఆదివారం ఉదయం భారీ శబ్దాన్ని, కొన్ని పేలుళ్లను విన్నామని స్థానిక జాలర్లు కూడా చెప్పారన్నారు. విషాదంలో కుటుంబ సభ్యులు ఏటీసీతో సంబంధాలు తెగిన సమయంలో విమానం ఉన్న ప్రాంతానికి దగ్గరలోని సముద్ర జలాల్లోనే విమాన శకలాలు కనిపించాయి. వాటిలో విమాన అత్యవసర ద్వారం, కార్గో డోర్, లగేజ్ బ్యాగ్ ఉన్నాయి. ఈ సమాచారం తెలియగానే మృతుల బంధువులు విషాదంలో మునిగిపోయారు. సాగరంపై తేలుతున్న మృతదేహాలను టీవీల్లో చూస్తూ కన్నీటిపర్యంతమయ్యారు. వారికి ఇండోనేసియా అధ్యక్షుడు విడొడో, ఎయిర్ ఆసియా గ్రూప్ సీఈఓ ఫెర్నాండెజ్ సానుభూతిని వ్యక్తం చేశారు. మరో విమానానికి తప్పిన ముప్పు కాగా, మనీలా నుంచి 159 మంది ప్రయాణికులతో ఫిలిప్పీన్స్‌లోని సెంట్రల్ ప్రావిన్స్‌కు వచ్చిన ఎయిర్ఆసియా జెస్ట్ విమానం మంగళవారం బలమైన గాలుల వల్ల రన్ వే నుంచి పక్కకు వెళ్లింది. అయితే ఎలాంటి ప్రమాద ప్రమాదం జరగలేదు. సోమవారం ఆస్ట్రేలియాలోని సిడ్నీ నుంచి హొబ్బర్ట్కు వెళ్తున్న ఓ చిన్న ఓ విమానం సముద్రంలో కూలిన ఘటనలో గల్లంతైన ఇద్దరి జాడ తెలియరాలేదు. యుద్ధవిమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ జైపూర్: భారత వాయుసేన చెందిన ఓ యుద్ధవిమానం అత్యవసర పరిస్థితుల్లో మంగళవారం రాజస్థాన్‌లోని జైపూర్‌లో సంగానర్ విమానాశ్రయంలో దిగింది. ఆగ్రా నుంచి జోధ్‌పూర్‌కు వెళుతున్న ఐఎల్-76 విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో పైలట్ ఏటీసీ అనుమతితో విమానాన్ని సంగానర్ విమానాశ్రయంలో సురక్షితంగా దించేశారు.