breaking news
Aaroghaya laxmi scheme
-
‘ఆరోగ్యలక్ష్మి’కి ఆదరణ కరువు!
సాక్షి, హైదరాబాద్: ఆరోగ్యలక్ష్మి పథకానికి ఆదరణ తగ్గుతోంది. ఈ పథకం కింద నమోదైన లబ్ధిదారుల సంఖ్య క్రమంగా పతనమవుతోంది. గర్భిణులు, పాలిచ్చే తల్లులకు అవసరమైన పౌష్టికాహారాన్ని అందిం చాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ‘ఆరో గ్యలక్ష్మి’ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఈ పథకాన్ని అమలు చేస్తోంది. క్షేత్రస్థాయిలో సిబ్బంది ఉదాసీనంగా వ్యవహరించడంతో పథకం అమలు గాడితప్పుతోంది. ఆరోగ్యలక్ష్మి పథకం అమలుపై క్షేత్రస్థాయి నుంచి వచ్చిన గణాంకాల ప్రకారం జనవరిలో గర్భిణులు, బాలింతల హాజరు 42.43 శాతం మాత్రమే నమోదవడం అధికార వర్గాలను ఆందోళనకు గురిచేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 35,700 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. వీటిలో ప్రధాన అంగన్వాడీ కేంద్రాలు 31,711, మినీ అంగన్వాడీ కేంద్రాలు 3,989 ఉన్నాయి. గర్భిణులు, పాలిచ్చే తల్లులకు ఆరోగ్యలక్ష్మి పథకం కింద ప్రతిరోజూ పాలు, ఉడికించిన కోడిగుడ్డుతో పాటు 150గ్రాముల బియ్యం, 30గ్రాముల పప్పు తదితరాలతో కూడిన పౌష్టిక ఆహారాన్ని భోజన రూపంలో అందించాలి. అంతేకాకుండా వారంలో ఒక రోజు 200 మిల్లీలీటర్ల పెరుగు, ఎగ్ కర్రీ పంపిణీ చేయాలి. గాడి తప్పిన పాలన.. సకాలంలో అంగన్వాడీ కేంద్రాలను తెరవకపోవడం.. కేంద్రాలు తెరిచినా పౌష్టికాహార పంపిణీలో జాప్యం జరుగుతుండటంతో లబ్ధిదారులు విసుగు చెందుతున్నారు. దీంతో లబ్ధిదారుల హాజరు గణనీయంగా పడిపోతోంది. మరోవైపు పాలు, పెరుగు, వండిన కూరగాయలకు బదులుగా సరుకులను పంపిణీ చేస్తున్నారు. వంటసామగ్రి లేదనే సాకుతో సరుకులు పంపిణీ చేస్తుండటంపై లబ్ధిదారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు ఇదే తరహాలో పంపిణీ ప్రక్రియ పునరావృతం కావడంతో లబ్ధిదారులు క్రమంగా కేంద్రాలకు వెళ్లడం మానుకుంటున్నారు. ఇటీవల రంగారెడ్డి, నల్లగొండ, మహబూబ్నగర్ జిల్లాల్లో జిల్లా సంక్షేమాధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా ఇలాంటి అంశాలు వెలుగు చూశాయి. ఫిబ్రవరిలో సచివాలయంలో జరిగిన ఉన్నతాధికారుల సమావేశంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సైతం అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ క్రమపద్ధతిలో ఉంటేనే పథకాల అమలు సంతృప్తికరంగా ఉంటుందని ఆయన హెచ్చరించారు. -
‘అనారోగ్య లక్ష్మి’!
* నిష్ఫలమవుతున్న ఆరోగ్యలక్ష్మి పథకం * అంగన్వాడీల్లో భోజనానికి లబ్ధిదారుల విముఖత * 30 శాతానికి మించని గర్భిణులు, బాలింతల హాజరు * మహిళా సంక్షేమ శాఖ కొత్త నిబంధనే కారణం * పాత విధానంలోనే అందించాలని కోరుతున్న లబ్ధిదారులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని గర్భిణులు, బాలింతలకు సమృద్ధిగా పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ఆరోగ్యలక్ష్మి’ పథకం సత్ఫలితాలను ఇవ్వడం లేదు. ఈ పథకం కింద సర్కారు ప్రకటించిన ఆహార పదార్థాలేవీ లబ్ధిదారులకు సంపూర్ణంగా చేరడం లేదు. పథకం అమలుకు సంబంధించి పెట్టిన కొత్త నిబంధనే దీనికి కారణమని తెలుస్తోంది. వాస్తవానికి గత జనవరి 1 నుంచి ఆరోగ్యలక్ష్మి పథకం కింద పౌష్టికాహార దినుసుల(పాలు, కందిపప్పు, బియ్యం.. తదితరాలు)ను ప్రతి బాలింతకు, గర్భిణికీ అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించేవారు. అయితే.. జూన్ 1 నుంచి బాలింతలు, గర్భిణులు తప్పనిసరిగా అంగన్వాడీ కేంద్రాల్లోనే పౌష్టికాహారాన్ని(భోజనం) తీసుకోవాలని మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులు కొత్త నిబంధన విధించారు. దీంతో నెలరోజులుగా పౌష్టికాహారం కోసం అంగన్వాడీలకు వచ్చే లబ్ధిదారుల సంఖ్య గణనీయంగా పడిపోయింది. ప్రస్తుతం అంగన్వాడీలకు వచ్చి, అక్కడ వండిన ఆహారాన్ని తినేందుకు కనీసం 30 శాతం మంది కూడా రావడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యలక్ష్మి పథకం కింద 5,18,215 మంది లబ్ధిదారులు ఉండగా.. ఇందులో గర్భిణులు 2,60,241 మంది, బాలింతలు 2,57,974 మంది ఉన్నారు. పౌష్టికాహారం ఎందుకంటే.. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం.. పౌష్టికాహారం అందని కారణంగా ఏటా ప్రసవ సమస్యలతో ప్రతి వెయ్యి మందిలో 110 మంది గర్భిణులు మరణిస్తున్నారు. 43 శాతం మంది ఐదేళ్లలోపు చిన్నారులు, 33.50 శాతం మంది మహిళలు తక్కువ బరువు కలిగి ఉంటున్నారు. రాష్ట్రంలోనూ గర్భిణులు, బాలింతలు తీసుకునే ఆహారం పట్ల శ్రద్ధ చూపని కారణంగా పోషకాహార లోపాలు, తద్వారా కలిగే దుష్ర్పరిణామాల బారిన పడుతున్నారు. వీరి ఆరోగ్య సంరక్షణ నిమిత్తం పోషణ స్థాయిలను మెరుగుపర్చేందుకు సమగ్ర శిశు సంరక్షణ సేవల(ఐసీడీఎస్) ద్వారా ఆరోగ్యలక్ష్మి పథకం అమలుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో మాతా, శిశు మరణాల రేటును తగ్గించడమే ఈ పథకం ప్రధాన లక్ష్యం. విలువ పెంచినా నిష్ఫలమే.. ఈ పథకం కింద గర్భిణులు, బాలింతలకు అందించే పోషకాహార పరిమాణాన్ని పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం జూన్ 1నఉత్తర్వులు జారీ చేసింది. గతంలో రోజుకు రూ.15 విలువైన పోషకాహారం మాత్రమే లబ్ధిదారులకు ఇస్తుండగా, తాజా ఉత్తర్వుల మేరకు ప్రతిరోజూ రూ.21 విలువైన ఆహారాన్ని అందించాలి. అయితే.. ఆహార పదార్థాలను ఇంటికి ఇచ్చే విధానానికి స్వస్తి పలికి, అంగన్వాడీల్లోనే ఒక పూట పోషకాహారాన్ని తప్పనిసరిగా తీసుకోవాలన్న నిబంధన పట్ల ఎక్కువ మంది గర్భిణులు, బాలింతలు విముఖత వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలవారీగా లబ్ధిదారులు


