Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Ysrcp Complaint To The President About Tdp Attacks In Ap
టీడీపీ కార్యకర్తలా.. గూండాలా.. ఇదేం అరాచకం: వైఎస్సార్‌సీపీ నేతలు

సాక్షి, న్యూఢిల్లీ: ఏపీలో టీడీపీ దాడులపై రాష్ట్రపతికి వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు చేసింది. అనంతరం ఆ పార్టీ నేతలు మీడియా సమావేశంలో మాట్లాడారు. ఏపీలో శాంతి భద్రతలను పరిరక్షించాలని రాష్ట్రపతిని కోరినట్లు వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. ఏపీలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. వారం రోజులుగా టీడీపీ శ్రేణులు దాడులకు తెగబడుతున్నాయి. వక్రీకరించే బుద్ధి చంద్రబాబు, ఆయన పార్టీ నాయకులకే ఉంది’’ అంటూ విజయసాయిరెడ్డి మండిపడ్డారు.బాధితుల ఆక్రందనలు చంద్రబాబుకు కనిపించడం లేదా?‘‘చట్టం లేదు, సేచ్ఛ లేదు, న్యాయం లేదు. అన్యాయమే రాజ్యమేలుతోంది. బాధితులు ఫిర్యాదు చేస్తామన్నా పోలీసులు స్వీకరించే పరిస్థితి లేదు. ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి. వెళ్లాయి.. కానీ ఎలాంటి పరిస్థితి ఎన్నడూ లేదు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, వాళ్ల ఆస్తులే లక్ష్యంగా చేసుకుని టీడీపీ శ్రేణులు స్వైర విహారం చేస్తున్నాయి. మీరు టీడీపీ కార్యకర్తలా.. గూండాలా?. ప్రమాణస్వీకారానికి ముందే చంద్రబాబు హింసను ప్రేరేపించారు. హింసకు గురైన బాధితులు ఆక్రందనలు చంద్రబాబుకు కనిపించడం లేదా?’’ అని విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ఏపీలో రాజ్యాంగం కుప్పకూలిపోయింది..‘‘ఇది చీకటి అధ్యాయంగా చర్రితలో మిగిలిపోతుంది. టీడీపీ దాడులు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయి. టీడీపీకి వ్యతిరేకంగా ఉన్నవాళ్లపై దాడి చేసి, సోషల్‌ మీడియాలో వీడియోలు పెడుతున్నారు. మంగళగిరిలో లోకేష్‌ మనుషులు సోషల్‌ మీడియా కార్యకర్తల పట్ల అమానుషంగా ప్రవర్తించారు. బంగారం లాంటి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని టీడీపీ తగలబెడుతోంది. ఈ హింస ఇలాగే కొనసాగితే బీజేపీ కూడా బాధ్యత వహించాల్సి వస్తుంది. ఇలా దాడులు చేయడం మంచి సంప్రదాయం కాదు. చివరకు మీడియా స్వేచ్ఛను కూడా అణచివేస్తున్నారు. ఏపీలో రాజ్యాంగం కుప్పకూలిపోయింది.’’అని విజయసాయి ధ్వజమెత్తారు.చంద్రబాబు రాక్షస పాలన చేస్తున్నారు: వైవీ సుబ్బారెడ్డికేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని హింసను అరికట్టాలి. రాష్ట్ర ప్రభుత్వంలో భాగంగా ఉన్న బిజెపి వెంటనే స్పందించాలి. ప్లాన్ ప్రకారమే ప్రమాణ స్వీకారానికి ముందే నాయకులు, ఆస్తుల పై దాడులు చేస్తున్నారు. పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. దాడుల వల్ల ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పీఎం, హోం మంత్రికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాం. స్పందన లేకపోతే న్యాయ పోరాటం చేస్తాం. ఈ దాడులకు బీజేపీ కూడా బాధ్యత వహించాలి. ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదు.

Major Fire Accident In Kuwait
Kuwait Fire: కువైట్‌లో భారీ అగ్నిప్రమాదం.. మృతుల్లో భారతీయులు

కువైట్‌ సిటీ: కువైట్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. బుధవారం (జూన్‌12) తెల్లవారుజామున 3 గంటలకు సదరన్‌ అహ్మదిలోని మంగాఫ్‌లో ఉన్న ఆరు ఫ్లోర్‌ల అపార్ట్‌మెంట్‌లో మంటలు చెలరేగాయి. అపార్ట్‌మెంట్‌లోని ఒక గదిలో ఉన్న కిచెన్‌ నుంచి ముందుగా మంటలు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మంటల్లో మొత్తం 53 మంది సజీవ దహనమయ్యారు. మృతుల్లో 40 మంది దాకా భారతీయులే. తీవ్రంగా గాయపడిన మరో 40కి పైగా మందిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగినపుడు అపార్ట్‌మెంట్‌లో 160 మంది దాకా ఉన్నట్లు సమాచారం. వీరంతా ఒక కన్‌స్ట్రక్షన్‌ కంపెనీలో పనిచేస్తున్న నిర్మాణ రంగ కార్మికులని సమాచారం. అగ్ని ప్రమాద ఘటనపై కువైట్‌ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. అగ్ని ప్రమాదం ఎలా జరిగిందన్నదానిపై దర్యాప్తు జరుగుతోంది. ఈ ఘటనపై భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్‌ విచారం వ్యక్తం చేశారు.

Indias Predicted XI Against USA,Rohit Sharma To Make 2 Changes
అమెరికాతో మ్యాచ్‌.. దూబేపై వేటు! శాంసన్‌కు ఛాన్స్‌

టీ20 వరల్డ్‌కప్‌-2024లో టీమిండియా మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. ఈ మెగా టోర్నీలో వరుస విజయాలతో దూసుకుపోతున్న ఆతిథ్య అమెరికాతో బుధవారం న్యూయర్క్‌ వేదికగా భారత్‌ తలపడనుంది. ఇరు జట్లు కూడా తమ చివరి మ్యాచ్‌లో పాకిస్తాన్‌నే ఓడించడం గమనార్హం. ఆదివారం(జూన్‌ 9)స్కోరింగ్ థ్రిల్లర్‌లో పాకిస్తాన్‌పై భారత్‌ సంచలన విజయం సాధించగా.. అమెరికా సూపర్‌ ఓవర్‌లో పాకిస్తాన్‌ను చిత్తు చేసింది. కాగా పాక్‌పై గెలిచి ‍మంచి జోష్‌లో ఉన్న టీమిండియా యూఎస్‌ఎపై కూడా అదే జోరును కొనసాగించాలని భావిస్తోంది. కానీ అమెరికా జట్టును ఏ మాత్రం తక్కువ అంచనా వేసినా భారత్‌ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.ఈ క్రమంలో టీమిండియా మెనెజ్‌మెంట్‌ తమ తుది జట్టులో పలు మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మెగా ఈవెంట్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో నిరాశపరిచిన ఆల్‌రౌండర్‌ శివమ్‌ దూబేపై వేటు వేయాలని మెన్‌జ్‌మె​ంట్‌ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఐపీఎల్‌లో అదరగొట్టి భారత వరల్డ్‌కప్‌ జట్టులో చోటు దక్కించుకున్న దూబే.. తన స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాడు. బౌలింగ్‌, బ్యాటింగ్‌, ఫీల్డింగ్‌ అన్ని విభాగాల్లో దూబే నిరాశపరుస్తున్నాడు. ఈ క్రమంలో అతడి స్ధానంలో వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ సంజూ శాంసన్‌కు ఛాన్స్‌ ఇవ్వాలని కెప్టెన్‌ రోహిత్‌ శర్మతో పాటు మెనెజ్‌మెంట్‌ భావిస్తున్నట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి.మరోవైపు ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజాకు కూడా విశ్రాంతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అతడి స్ధానంలో చైనామాన్‌ బౌలర్‌ కుల్దీప్‌ యాదవ్‌ తుది జట్టులోకి రానున్నట్లు వినికిడి. ఇప్పటివరకు జరిగిన ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ జడేజా పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు.భారత తుది జట్టు(అంచనా)రోహిత్ శర్మ (కెప్టెన్‌), విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ (వికెట్‌ కీపర్‌), సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్, హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్‌ సింగ్

Kommineni Srinivasa Rao Comments On Chandrababu
అమరావతిపై చంద్రబాబుకే అనుమానాలున్నాయా?

ఏపీ రాజధాని అమరావతి అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. టీడీపీ, జనసేన,బీజేపీ సభ్యులంతా కలిసి ఆయనను తమ నేతగా ఎన్నుకున్న సందర్భంగా మాట్లాడుతూ.. అమరావతిపై క్లారిటీ ఇచ్చారు. అలాగే విశాఖను ఆర్దిక రాజధానిగా అభివృద్ది చేస్తామని, కర్నూలును కూడా ప్రగతి పధంలోకి తీసుకు వెళతామని అన్నారు. ఆయన తాను ఇచ్చిన సూపర్ సిక్స్ వాగ్దానాల గురించి కాకుండా అమరావతిపైనే ప్రసంగించడం అందరి దృష్టిని ఆకర్షించింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మూడు రాజధానులు పెట్టడం ద్వారా ఏపీ అభివృద్దికి ప్రయోజనం జరుగుతుందని భావించారు. విశాఖ పట్నం అయితే రాష్ట్రం అంతటికి గ్రోత్ ఇంజన్ అవుతుందని ఆశించారు. అమరావతి మాదిరి లక్షల కోట్లు ఖర్చుపెట్టవలసిన అవసరం ఉండదని అనుకున్నారు. కాని దానిని తెలుగుదేశం,ఇతర విపక్షాలు ముందుకు సాగకుండా అడ్డుపడ్డాయి. దాంతో జగన్ ఇందుకు సంబంధించిన చట్టాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు అప్పట్లోనే ప్రకటించారు. కాకపోతే తమ విధానం మూడు రాజధానులు అని ఆయన అన్నారు. కాని ఆయన తిరిగి అదికారంలోకి రాలేకపోయారు.విశాఖ, కర్నూలులకు అడ్డుపడిన చంద్రబాబు నాయుడు, ఇప్పుడు జగన్ అక్కడి వారిని మోసం చేశారని అంటున్నారు. చంద్రబాబుతో వచ్చిన చిక్కే ఇది. ఎక్కడ ఏది అవసరమైతే అది మాట్లాడుతుంటారు. ఇందులో జగన్ మోసం చేసింది ఏముంది? ఆయన ఎన్నికల ప్రచారం సమయంలో గెలిచిన తర్వాత విశాఖ నుంచే పాలన చేస్తామని ప్రకటించారు. విశాఖను సుందరంగా తీర్చి దిద్దారు. రిషికొండపై ఆకర్షణీయమైన భవంతిని నిర్మించారు. అలాగే కర్నూలులో పలు న్యాయ రంగానికి సంబంధించిన పలు ఆఫీస్ లు ఏర్పాటు చేశారు. లోకాయుక్త ఆఫీస్ ను కూడా అక్కడే నెలకొల్పారు. హైకోర్టు ఏర్పాటు పూర్తిగా ఆయన చేతిలో లేనిది కనుక దానిపై ముందుకు వెళ్లలేకపోయారు. ఈ విషయాలలో జగన్ చిత్తశుద్దిని శంకించనవసరం లేదు.జగన్‌ ఒకటి తలిస్తే, ప్రజా తీర్పు మరో రకంగా రావడంతో చంద్రబాబుకు అది అడ్బాంటేజ్ అయింది. విశాఖ ప్రజలు కూడా తమకు రాజధాని వద్దని అనుకున్నారని చంద్రబాబు అభిప్రాయపడుతున్నారు. ఇంతవరకు తప్పు లేదు. ఎందుకంటే జగన్ ఆ ప్రాంతానికి అంత పెద్ద వరం ఇస్తే ,దానిని వారు ఆదరించలేదు.కర్నూలులో హైకోర్టు పెట్టాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం కర్నూలులో హైకోర్టు ఏర్పాటు కావవల్సి ఉంది. అక్కడ కూడా ఆశ్చర్యంగా వైఎస్సార్‌సీపీకి వ్యతిరేక తీర్పు వచ్చింది. తాజాగా చంద్రబాబు అక్కడ హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని కూడా చెప్పడం లేదు. ఈ నేపధ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా తన విధానాన్ని మార్చుకుంటేనే బెటర్ అనిపిస్తుంది. వచ్చే ఐదేళ్లు టీడీపీ కూటమి అధికారంలో ఉంటుంది కనుక వారు చేయదలచుకున్నది అంతా అమరావతిలోనే చేస్తారు. ఆ తర్వాత ఎన్నికలలో వైసిపి గెలిచినా, ఇందులో మార్పులు చేయడం కష్టం అవుతుంది. అప్పుడు మళ్లీ మూడు రాజధానులు అన్నా ఉపయోగం ఉండదు. నా వ్యక్తిగత అభిప్రాయం అయితే అమరావతిపై ఇక వివాదాన్ని ముగించడం మంచిది. వైఎస్సార్‌సీపీ దీనిపై ఎలా ముందుకు వెళుతుందో చూడాలి. అమరావతికి సంబంధించి కొన్ని చిక్కుముళ్లను చంద్రబాబు విడదీయవలసి ఉంటుంది. 2014 టరమ్ లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నప్పుడు కేవలం ప్రాధామిక సదుపాయాల కోసం లక్షతొమ్మిది వేల కోట్ల రూపాయలు అవసరం అవుతాయని , ఈ నిదులను మంజూరు చేయాలని కేంద్రానికి లేఖ రాశారు. ఇప్పుడు ఆ వ్యయం ఇంకా భారీగా పెరిగి ఉంటుంది.అంత మొత్తాన్ని ఎలా వెచ్చిస్తారో చెప్పగలగాలి. కేంద్రం ఇప్పుడు ఏమైనా ఆ ప్రకారం ఇస్తే ఇబ్బంది లేదు. అలా ఇవ్వకపోతే మళ్లీ సమస్య మొదటికి వస్తుంది. అప్పట్లో ప్రధాని మోదీ మట్టి,నీళ్లు ఇచ్చి వెళ్లారని చంద్రబాబు విమర్శించేవారు. ఈ విడత టీడీపీపై కేంద్రంలోని ప్రభుత్వం ఆధారపడే పరిస్థితి ఉంది కనుక లక్ష కోట్లను రాజధాని కోసం సాధించగలిగితే చంద్రబాబుకు మంచి పేరు వస్తుంది. గత ప్లాన్ ప్రకారం నవ నగరాలన్నింటిని ఇక్కడే నిర్మిస్తారా?లేక వాటిని వాయిదా వేస్తారా? అనేది చూడాలి. అంతేకాదు. అమరావతి భూముల విషయంలో పలు వివాదాలు ఉన్నాయి. కొంతమంది రైతులు తమ భూములను రాజధానికి ఇవ్వడానికి ఇష్టపడలేదు. వారిపై అప్పట్లో కేసులు కూడా పెట్టారు. జగన్ ప్రభుత్వం వచ్చాక వాటిని తొలగించింది. ఆ రోజుల్లో పంటలను దగ్దం చేసి భూములు లాక్కునే యత్నం చేశారన్న విమర్శలు వచ్చాయి. అలాంటి చోట్ల ఏ రకంగా ముందుకు వెళతారో తెలియదు. ప్లాట్ల కేటాయింపుపై కూడా రకరకాల వ్యాఖ్యలు ఉన్నాయి. వాటన్నిటిని పరిష్కరించుకోవల్సి ఉంటుంది. వారికి రోడ్లు,డ్రైనేజ్, రక్షిత నీరు మొదలైనవాటిని సమకూర్చుకోవాలి. అమరావతిలో పది డిగ్రీల ఉష్ణాగ్రత తగ్గించాలని అప్పట్లో చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఇంటింటికి ఏసీ కూడా ఇచ్చే ఏర్పాటు చేస్తామని అన్నారు. ఇవన్ని చేయగలిగితే తెలుగుదేశంకి ఖ్యాతి వస్తుంది. ప్రభుత్వ కార్యాలయాల వసతుల కోసం ఏభై అంతస్తుల టవర్ లు నిర్మించాలని తలపెట్టారు. అదే ఆలోచనను మళ్లీ చేస్తారో?లేదో తెలియవలసి ఉంది. కృష్ణానది పక్కన ఉండడంతో నేల స్వభావం భారీ భవంతులకు అనువైనది కాదని నిపుణులు చెబుతారు. అందువల్లే రాఫ్ట్ టెక్నాలజీకి వెళుతున్నామని అనేవారు. అది బాగా ఖరీదైనది. అయినా ఖర్చు భరించక తప్పదు. మరో కీలక అంశం సింగపూర్ కంపెనీలకు గతంలో మాదిరే మళ్లీ భూములు కేటాయిస్తారా? లేదా ?అన్నదానిపై నిర్ణయం చేయవలసి ఉంటుంది. వారికి రియల్ ఎస్టేట్ ప్రయోజనాల కోసం ఏపీ ప్రభుత్వం పక్షాన భూమి ఇవ్వడమే కాకుండా,అవసరమైన రోడ్లు తదితర సదుపాయాలను సమకూర్చడానికి 5,500 కోట్లు వ్యయం చేయడానికి సిద్దపడ్డారు. ఇప్పుడు ఖర్చు కూడా పెరుగుతుంది. సింగపూర్ కంపెనీల నుంచి ఏపీ ప్రభుత్వానికి వచ్చే ఆదాయం మాత్రం బాగా తక్కువగా ఉందని అప్పట్లో విమర్శలు వచ్చాయి. పైగా వారితో ఏ వివాదం వచ్చినా లండన్ కోర్టులో తేల్చుకోవాలని రాసుకున్నారు. 2019 లో తమ ప్రాజెక్టు వయబుల్ కాదని భావించి సింగపూర్ సంస్థలు దానిని వదలుకున్నాయి. సింగపూర్ సంస్థలకు స్విస్ చాలెంజ్ పద్దతిన భూములు ఇవ్వడం పై ఆనాడు కోర్టులలో వివాదాలు నడిచాయి. కోర్టు సంబంధిత చట్టంలోని కొన్ని క్లాజులను కొట్టివేయగా,వాటిని మార్చి మళ్లీ చట్టాన్ని ఆమోదించారు. నిజానికి చంద్రబాబు నాయుడు రైతుల నుంచి ముప్పైమూడు వేల ఎకరాల భూమి సమీకరించకుండా ,ప్రభుత్వానికి అవసరమైన వెయ్యి నుంచి ఐదువేల ఎకరాల భూమి తీసుకుని , అందులో భవనాల నిర్మాణం చేపట్టి ఉంటే ఇంత రాద్దాంతం అయ్యేది కాదు. ఆయన ఓవర్ యాంబిషస్ గా దీనిని ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ గా మార్చారన్న అభిప్రాయం వ్యక్తం అయ్యేది. ఇతర జిల్లాలప్రజలు మొత్తం డబ్బంతా అమరావతిలోనే పెడితే ఎలా అని ప్రశ్నించేవారు. ఇప్పుడు మళ్లీ అదే పరిస్థితి ఎదురవుతోంది. అయితే దాదాపు అన్ని జిల్లాల ప్రజలు అమరావతిని ఆమోదించినట్లుగానే ఎన్నికల ఫలితాలు వచ్చాయి కనుక చంద్రబాబు తన ఇష్టానుసారం ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. చంద్రబాబు రాగానే అధికారులు అక్కడ హడావుడి ఆరంభించారు. బహుశా కొన్ని పూర్తి కాని భవనాలకు ప్రాధాన్యత ఇచ్చి, తర్వాత మిగిలిన నిర్మాణ పనులు చేపట్టవచ్చు. అమరావతి రాజధాని పూర్తి కావడానికి చాలాకాలం పట్టవచ్చు. నిధుల సమస్య, సాంకేతిక అంశాలు, భూ సేకరణ వంటి వ్యవహారాలు సజావుగా పూర్తి చేసుకుంటే ఇబ్బంది ఉండకపోవచ్చు. కొసమెరుపు ఏమిటంటే చంద్రబాబు ప్రమాణ స్వీకారం కృష్ణానదికి ఆవల వైపున ఉన్న అమరావతిలోనే జరుగుతుందని తొలుత ప్రకటించారు. కాని ఏ సెంటిమెంట్ అయినా అడ్డం వచ్చిందేమో తెలియదు కాని, ఈసారి కృష్ణా నదికి ఈవల వైపు అంటే విమానాశ్రయం ఎదుట ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. అంటే 2014లో అమరావతి వైపు ప్రమాణ స్వీకారం చేయడం అచ్చి రాలేదని భావించి వాస్తు పండితులు ఈ మార్పు చేశారా?అన్న సందేహం వస్తుంది. అమరావతి వాస్తుపైనే అనుమానాలు ఉన్న నేతలు దానిని ఏ రీతిన ముందుకు తీసుకువెళతారన్నది ఆసక్తికరం.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు

Rahul Gandhi Dilemma Over Leaving Wayanad Raebareli
‘‘వయనాడ్‌, రాయ్‌బరేలీలో ఏది వదులుకోవాలి’’

తిరువనంతపురం: వయనాడ్‌, రాయ్‌బరేలీలో ఏ నియోజకవర్గాన్ని వదులుకోవాలో తెలియడం లేదని కాంగ్రెస్‌ అగ్రనేత, ఎంపీ రాహుల్‌గాంధీ అన్నారు. బుధవారం(జూన్‌12) కేరళలోని మల్లప్పురంలో జరిగిన కాంగ్రెస్‌ కార్యకర్తల సమావేశంలో రాహుల్‌గాంధీ మాట్లాడారు. ‘నేను ఎటూ తేల్చుకోలేకపోతున్నాను. ఏమైనా కానీ.. వయనాడ్‌, రాయ్‌బరేలీల్లో ఒక నియోజకవర్గానికే నేను ఎంపీగా ఉండాలి. నా నిర్ణయంతో రెండు నియోజకవర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా’అని రాహుల్‌ వ్యాఖ్యానించారు. రెండింటిలో ఏ నియోజకవర్గాన్ని వదులుకోవాలనే అంశంపై రాహుల్‌ పార్టీ పెద్దలకు ఇప్పటికే తన అభిప్రాయాన్ని చెప్పినట్లు సమాచారం. ఎంపీగా రెండు చోట్ల విజయం సాధించిన అనంతరం తొలిసారి బుధవారం కేరళలో రాహుల్‌ పర్యటించారు.

Spacex Ceo Elon Musk Accused With Two Of His Employees
మస్క్‌పై మహిళా ఉద్యోగినుల సంచలన ఆరోపణలు

వాషింగ్టన్ డీసీ : స్పేస్‌ఎక్స్‌ అధినేత ఎలోన్‌ మస్క్‌ మరో వివాదంలో చిక్కుకున్నారు. స్పేక్స్ఎక్స్‌లో ఇద్దరు ఉద్యోగినులతో మస్క్‌ శృంగారంలో పాల్గొన్నారంటూ పలు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. వారిలో ఒక ఉద్యోగిని స్పేస్‌ఎక్స్‌ ఇంటర్న్‌ అని తెలుస్తోంది. మరో ఉద్యోగిని పిల్లల్ని కనాలని బలవంతం చేసినట్లు సమాచారం.మస్క్‌పై ఈ తరహా ఆరోపణలు గతంలోనూ వచ్చాయి. వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ కథనం ప్రకారం.. 2016లో శృంగరంలో పాల్గొనాలని, అందుకు బదులుగా గుర్రాన్ని కొనుగోలు చేయొచ్చని ఆఫర్‌ చేశారంటూ స్పేస్‌ఎక్స్ ఫ్లైట్ అటెండెంట్ ఆరోపించారు.2013లో స్పేస్‌ఎక్స్‌కు రాజీనామా చేసిన మరో మహిళను పిల్లల్ని కనాలని మస్క్ పలు సందర్భాల్లో కోరినట్లు సదరు మహిళ చెప్పారంటూ వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ తన కథనంలో పేర్కొన్నారు. స్పేస్‌ఎక్స్‌లో పని చేస్తున్న ఒక మహిళను మస్క్ రాత్రి పూట తన ఇంటికి రావాలని పదే పదే ఆహ్వానించినట్లు నివేదిక పేర్కొంది. అయితే ఆ ఆరోపణలతో చట్టపరమైన చిక్కుల్లో పడ్డారు. ఎలోన్‌ మస్క్‌ తన తీరుతో టెస్లా,స్పెస్‌ఎక్స్‌లో వాతావారణం పూర్తిగా దెబ్బతింటోందని ఉద్యోగులతో పాటు ఇన్వెస్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి తాజా, ఆరోపణలపై మస్క్‌ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది.

Anil Ambani massive comeback Reliance Power repaid Rs 800 crore debt
‘పవర్‌’ చూపించిన అనిల్‌ అంబానీ.. తొలగిన చీకట్లు!

ముఖేష్ అంబానీ సోదరుడు అనిల్ అంబానీకి చీకటి రోజులు తొలగిపోయాయి. ఒకప్పుడు అత్యంత ధనవంతుల్లొ ఒకడైన ఆయన రిలయన్స్ పవర్‌తో బలమైన పునరాగమనం చేస్తున్నారు. షేర్ మార్కెట్లో కంపెనీ మెరుగైన పనితీరు కొనసాగుతుండటంతో స్టాండలోన్ ప్రాతిపదికన రుణ రహితంగా మారింది.బిజినెస్ స్టాండర్డ్ నివేదిక ప్రకారం.. అనిల్ అంబానీ రిలయన్స్ పవర్ సుమారు రూ .800 కోట్ల రుణాన్ని కలిగి ఉండేది. రుణాలిచ్చిన బ్యాంకులకు చెల్లించాల్సిన బకాయిలన్నింటినీ చెల్లించేసింది. గత కొన్ని నెలలుగా ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, డీబీఎస్, ఐడీబీఐ బ్యాంక్ సహా పలు బ్యాంకులతో డెట్ సెటిల్మెంట్ ఒప్పందాలు కుదుర్చుకుంది. నివేదిక ప్రకారం.. కంపెనీ ఈ బ్యాంకులకు మొత్తం రుణాన్ని తిరిగి చెల్లించింది. ఫలితంగా రిలయన్స్ పవర్ ఇప్పుడు స్టాండలోన్ ప్రాతిపదికన రుణ రహిత సంస్థగా మారింది.అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ పవర్ ప్రస్తుతం 38 లక్షలకు పైగా రిటైల్ ఇన్వెస్టర్ల భాగస్వామ్యంతో రూ .4016 కోట్ల ఈక్విటీ బేస్‌ను కలిగి ఉంది. ఉత్తరప్రదేశ్ లోని 3960 మెగావాట్ల సాసన్ యూఎంపీపీ, 1200 మెగావాట్ల రోసా థర్మల్ పవర్ ప్లాంట్ తో సహా ఇది 5900 మెగావాట్ల ఆపరేటింగ్ కెపాసిటీని కలిగి ఉంది. 2008లో సుమారు రూ.260.78 వద్ద ట్రేడైన రిలయన్స్ పవర్ షేరు భారీ పతనం తర్వాత 2020 మార్చి 27న షేరు ధర రూ.1.13 వద్ద ముగిసింది.కొన్నేళ్లుగా నెమ్మదిగా కోలుకుంటున్న అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ పవర్ మరోసారి ట్రేడర్ల దృష్టిని ఆకర్షించింది. రిలయన్స్ పవర్ షేరు ప్రస్తుతం రూ.26.15 పైన ట్రేడవుతోంది. ఇది త్వరలోనే రూ.36 మార్కును చేరుకోవచ్చని స్టాక్ మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Jr NTR Devara Movie Is Preponed, New Release Date Update Expected Soon
పవన్‌ ఫ్యాన్స్‌కు బ్యాడ్‌ న్యూస్‌..ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌కి గుడ్‌ న్యూస్‌!

‘జనతా గ్యారేజ్‌’ లాంటి హిట్‌ తర్వాత ఎన్టీఆర్‌, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘దేవర’. జాన్వీ కపూర్‌ హీరోయిన్‌. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌ గోవాలో శరవేగంగా జరుగుతోంది. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం.. పార్ట్‌ 1 ఈ ఏడాది ఏప్రిల్‌ 5నే విడుదల కావాల్సింది. అయితే షూటింగ్‌ ఆలస్యం కావడంతో అక్టోబర్‌ 10కి వాయిదా వేశారు. అయితే ఇప్పుడు ఆ తేది కూడా మారినట్లు తెలుస్తోంది. (చదవండి: ఆ సినిమా కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకోలేదు: మహేశ్ బాబు)తాజా సమాచారం ప్రకారం..దేవర అనుకున్న దాని కంటే రెండు వారాల ముందే వచ్చేస్తున్నాడట. అంటే అక్టోబర్‌ 10 నుంచి సెప్టెంబర్‌ 27కి ప్రీసోన్‌ చేస్తున్నారట. వాస్తవానికి సెప్టెంబర్‌ 27న పవన్‌ కల్యాణ్‌ నటిస్తున్న ‘ఓజీ’చిత్రం విడుదల కావాల్సింది. చాలా రోజుల క్రితమే రిలీజ్‌ డేట్‌ ప్రకటించారు మేకర్స్‌. కానీ షూటింగ్‌ ఇంకా పూర్తి కాకపోవడంతో రీలీజ్‌ని వచ్చే ఏడాదికి వాయిదా వేశారు. అందుకే దేవర రెండు వారాల ముందే వచ్చేస్తున్నాడు. రిలీజ్‌ డేట్‌పై త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతున్నట్లు తెలుస్తోంది. ఓజీ వాయిదా పడినందుకు పవన్‌ ఫ్యాన్స్‌ నిరాశ చెందితే.. దేవర ముందే వస్తున్నందుకు ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ సంతోషిస్తున్నారు. (చదవండి: ప్రభాస్ 'కల్కి 2898 ఏడీ'.. బుజ్జిని డ్రైవ్‌ చేసిన ఆనంద్ మహీంద్రా!)ఇక దేవర విషయానికొస్తే.. ఈ సినిమాతో జాన్వీ కపూర్‌ టాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తోంది. కల్యాణ్‌ రామ్‌ సమర్పణలో మిక్కినేని సుధాకర్‌, కె. హరికృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందుతో ఎన్టీఆర్‌ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నారనే టాక్‌ ఇండస్ట్రీలో వినిపిస్తోంది.

AP CM Chandrababu Naidu Swearing-in Ceremony Live Updates
ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణం

విజయవాడ, సాక్షి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణం చేశారు. బుధవారం ఉదయం గన్నవరం కేసరపల్లి ఐటీ పార్క్‌ వద్ద ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరిగింది. గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ చంద్రబాబు చేత సీఎంగా ప్రమాణం చేయించారు. ఏపీ ఎన్డీయే కూటమి శాసనసభా పక్ష నేతగా ఎన్నికైన చంద్రబాబు.. ప్రధాని మోదీ సమక్షంలో ప్రమాణం చేశారు. ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబును ప్రధాని మోదీ ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ తర్వాత వరుసగా కొత్త మంత్రులు ప్రమాణం చేశారు. జనసేన అధినేత కొణిదెల పవన్‌ కల్యాణ్‌, చంద్రబాబు తనయుడు.. టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ బాబు, టీడీపీ సీనియర్‌ నేత అచ్చెన్నాయుడు.. .. కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్‌(జనసేన), పి.నారాయణ, వంగలపూడి అనిత, సత్యకుమార్‌ యాదవ్‌(బీజేపీ), నిమ్మల రామానాయుడు, మహ్మద్‌ ఫరూఖ్‌, ఆనం రాంనారాయణరెడ్డి, పయ్యావుల కేశవ్‌, అనగాని సత్యప్రసాద్‌, కొలుసు పార్థసారథి, బాల వీరాంజనేయ స్వామి, ఆనం రాంనారాయణరెడ్డి, పయ్యావుల కేశవ్‌, అనగాని సత్యప్రసాద్‌, కొలుసు పార్థసారథి, డి బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్‌, కందుల దుర్గేష్‌(జనసేన), గుమ్మడి సంధ్యారాణి, బీసీ జనార్ధన్‌రెడ్డి, టీజీ భరత్‌, ఎస్‌ సవిత, వాసంశెట్టి సుభాష్‌, కొండపల్లి శ్రీనివాస్‌, మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి.. ఒకరి తర్వాత ఒకరు మంత్రులుగా ప్రమాణం చేశారు. మంత్రులందరూ ప్రమాణం చేసిన తర్వాత ప్రధాని మోదీ, రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌, చంద్రబాబు కొత్త కేబినెట్‌తో కలిసి గ్రూప్‌ ఫొటో దిగారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కేంద్ర మంత్రులు అమిత్‌ షా, నితిన్‌ గడ్కరీ, జేపీ నడ్డా తదితరులు, మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ షిండే, తమిళనాడు మాజీ సీఎం పన్నీరు సెల్వం, తెలంగాణ మాజీ గవర్నర్‌ తమిళిసై తదితర మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సుప్రీం కోర్టు మాజీ సీజే ఎన్వీ రమణ, చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, చంద్రబాబు వియ్యంకుడు నందమూరి బాలకృష్ణ, మూడు పార్టీల కీలక నేతలు హాజరయ్యారు. సినీ రంగం నుంచి చిరంజీవి, రజినీకాంత్‌, నారా ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ ఈ కార్యక్రమంలో పాల్గొంది. తమిళిసైకి షా వార్నింగ్‌చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమం వేదికగా ఆసక్తికరమైన ఘటన ఒకటి చోటు చేసుకుంది. బీజేపీ అ‍గ్రనేత, కేంద్ర మంత్రి అమిత్‌ షా.. ఆ పార్టీ తమిళనాడు నేత తమిళిసైని దగ్గరకు పిలిచి మరీ ఏదో సీరియస్‌గా మాట్లాడారు. తమిళనాడులో ప్రస్తుతం నెలకొన్న రాజకీయంపైనే ఆయన అంత సీరియస్‌గా వార్నింగ్‌ ఇచ్చి ఉంటున్నారని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.మెగా బ్రదర్స్‌తో మోదీ సందడిప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిశాక వేదికపై కాసేపు సందడి వాతావరణం నెలకొంది. తన దగ్గరకు వచ్చిన పవన్‌ను ప్రత్యేకంగా అభినందించారు ప్రధాని మోదీ. కాస్త దూరంలో ఉన్న ఆయన సోదరుడు చిరంజీవి దగ్గరకు తీసుకొచ్చి.. ఇద్దరి చేతులు పైకి ఎత్తి అభివాదం చేశారు. ఆ తర్వాత ఇద్దరికి దగ్గరకు తీసుకుని కాసేపు ప్రత్యేకంగా మాట్లాడారు. కేంద్ర మంత్రి అమిత్‌ షా, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు రామ్మోహన్‌ నాయుడికి చిరు ఆత్మీయ ఆలింగనంవేదికపైకి చేరుకున్న రజినీకాంత్‌రజినీకాంత్‌ దంపతులతో నందమూరి బాలకృష్ణ➡️ కేసరపల్లి వేదికపైకి చేరుకున్న తమిళనాడు మాజీ సీఎం పన్నీరు సెల్వం➡️ వేదికపైకి చేరుకున్న నందమూరి బాలకృష్ణ.. అతిథుల్ని ఆహ్వానిస్తున్న హిందూపురం ఎమ్మెల్యే➡️ పవన్‌ కల్యాణ్‌ ప్రమాణ స్వీకార నేపథ్యంలో బస్సులో కేసరపల్లికి బయల్దేరిన మెగా ఫ్యామిలీపవన్‌ కల్యాణ్‌ ప్రమాణ స్వీకార నేపథ్యంలో బస్సులో కేసరపల్లికి బయల్దేరిన మెగా ఫ్యామిలీ ఇదీ చదవండి: ఏపీ కొత్త మంత్రుల పూర్తి జాబితా ఇదే

amit shah serious on tamilisai chandrababu oath ceremony at vijayawada
అమిత్‌ షా-తమిళిసై మధ్య అసలేం జరిగింది!

సాక్షి, విజయవాడ: చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమ వేదికపై ఆసక్తికర ఘటన ఒకటి చోటు చేసుకుంది. బీజేపీ అగ్రనేత అమిత్‌ షా ఆ పార్టీ మహిళా నేత తమిళిసై సౌందరరాజన్‌ మధ్య జరిగిన సన్నివేశమది. ఈ కార్యక్రమానికి తెలంగాణ మాజీ గవర్నర్‌, తమిళనాడు బీజేపీ నేత తమిళిసై సౌందరరాజన్‌ కూడా హాజరయ్యారు. అక్కడే వేదిక మీద ఉన్న బీజేపీ పెద్దలకు నమస్కారం చేసి ముందుకు వెళ్లబోయారు. అయితే.. కేంద్ర మంత్రి అమిత్‌ షా ఆమెను వెనక్కి పిలిచారు. ఒక్కసారిగా ఆమెపై సీరియస్‌ అయ్యారు. తమిళిసై ఏదో చెప్పబోతుండగా.. అడ్డుకుని మరీ అమిత్‌ షా ఆమెను ఏదో వారించినట్లు ఉంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అన్నామలై తో పంచాయతీ బంద్ చెయ్ అంటున్నాడా ?? pic.twitter.com/NVeTII7Sxl— 𝗡𝗔𝗟𝗟𝗔 𝗕𝗔𝗟𝗨 (@Nallabalu1) June 12, 2024తమిళిసైకి, కేంద్ర మంత్రి అమిత్‌ షాకి మధ్య అసలు ఏం జరిగింది?. ఆమెపై కేంద్రమంత్రి అమిత్‌ షా ఎందుకు అంత సీరియస్‌ అయ్యారని షోషల్‌మీడియాలో చర్చ జరుగుతోంది.ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో తమిళనాడులో బీజేపీ పేలవమైన ప్రదర్శన ఇచ్చింది. బీజేపీ రాష్ట్ర చీఫ్‌ అన్నామలైతో పాటు తమిళిసై కూడా ఓటమి పాలయ్యారు. ఆ వెంటనే ఆమె అన్నామలైకి వ్యతిరేకంగా స్టేట్‌మెంట్లు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అమిత్‌ షా పంచాయితీలు పెట్టొద్దంటూ ఆమెను వారించి ఉంటారని పలువురు కామెంట్లు చేస్తున్నారు. దీనిపై బీజేపీ స్పందిస్తేనే అసలేం జరిగిందనేది స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
 

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all
Advertisement