ఓటీటీలోకి వచ్చేసిన క్రైమ్ కామెడీ మూవీ.. ప్రస్తుతం టాప్ ట్రెండింగ్‌లో | Paarijatha Parvam Telugu Movie OTT Streaming Platform And Release Date | Sakshi
Sakshi News home page

Parijatha Parvam OTT: తెలుగు మూవీ ఓటీటీలో రిలీజ్.. స్ట్రీమింగ్ ఎందులో అంటే?

Jun 12 2024 1:59 PM | Updated on Jun 12 2024 2:56 PM

Parijatha Parvam OTT Streaming Details Latest

ఓటీటీలోకి చాలారోజుల నుంచి సరైన సినిమాలు రావట్లేదు. ఇప్పుడు ఆ కొరత తీర్చడానికి అన్నట్లు తెలుగు మూవీ 'పారిజాత పర్వం' వచ్చేసింది. షార్ట్ ఫిల్మ్స్‌తో గుర్తింపు తెచ్చుకుని ఈ మధ్య హీరోగా వరస సినిమాలు చేస్తున్న చైతన్య రావు.. ఇందులో లీడ్ రోల్ చేశాడు. సునీల్, శ్రద్ధా దాస్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. అవి ఏంటంటే?)

క్రైమ్ కామెడీ ఎంటర్‌టైనర్ స్టోరీతో తీసిన ఈ సినిమా గత నెల 19న థియేటర్లలోకి వచ్చింది. చిన్న బడ్జెట్ మూవీ కావడంతో ప్రేక్షకులు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది కాబట్టి అందరూ చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఆహా ఓటీటీలో టాప్ ట్రెండింగ్‌లో నడుస్తోంది.

'పారిజాత పర్వం' విషయానికొస్తే.. హీరో అవుదామని వచ్చి హైదరాబాద్‌లో రౌడీగా మారతాడు బార్ శ్రీను (సునీల్). ఇతడి కథని సినిమాగా తీద్దామని చైతన్య (చైతన్య రావు) ప్రయత్నాలు చేస్తుంటాడు. అయితే సినిమా తీయడం కోసం డబ్బు అవసరమై ఎవరినైనా కిడ్నాప్ చేయాలనుకుంటాడు. అలా ఓ నిర్మాత భార్య సురేఖ (సురేఖావాణి)ని చైతన్య కిడ్నాప్ చేయాలనుకుంటాడు. మరోవైపు బార్ శ్రీను గ్యాంగ్ కూడా ఆమెనే కిడ్నాప్ చేయడానికి వస్తుంది. ఇద్దరిలో ఎవరు సక్సెస్ అయ్యారు. చివరకు ఏమైందనేదే స్టోరీ.

(ఇదీ చదవండి: Pihu Review: ఓటీటీలోనే బెస్ట్ చైల్డ్ మూవీ.. కానీ చూస్తే భయపడతారు!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement