Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

TDP Gooons Attack YSRCP: YS Jagan Again Request Governor
ఏపీలో కుప్పకూలిన రాజ్యాంగ వ్యవస్థలు: వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి : రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలిపోయాయని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు రాజకీయ కక్షసాధింపులతో ప్రజాస్వామ్యానికే పెనుముప్పు వచ్చిందని మండిపడ్డారు. టీడీపీ యథేచ్ఛ దాడులతో ఆటవిక పరిస్థితులు తలెత్తాయని, యంత్రాంగం మొత్తం నిరీ్వర్యం అయిపోయిందన్నారు. వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై ఉన్మాదంతో దాడులు చేస్తున్నారని, పార్టీ నుంచి పోటీ చేసిన అభ్యర్థులకు రక్షణే లేకుండా పోయిందని చెప్పారు.ఉన్నత చదువులకు కేంద్రాలైన యూనివర్సిటీల్లో ఆచార్యులపై దౌర్జన్యాలకు దిగి వారిని భయభ్రాంతులకు గురిచేస్తున్నారని తెలిపారు. గత ఐదేళ్లలో పాలనా సంస్కరణలు, పేదలను ఆదుకునే కార్యక్రమాలతో దేశంలో రాష్ట్రానికి వచ్చిన పేరు ప్రఖ్యాతులన్నింటినీ దెబ్బ తీసి, కేవలం మూడు రోజుల్లోనే హింసాయుత రాష్ట్రంగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి, పౌర స్వేచ్ఛకు తీవ్ర భంగం వాటిల్లుతోందని, గవర్నర్‌ జోక్యం చేసుకోవాలని మరోసారి విజ్ఞప్తి చేశారు. హింసాయుత ఘటనల్లో బాధితులైన పార్టీ కార్యకర్తలకు, తన అన్నదమ్ములకు, అక్కచెల్లెమ్మలకు వైఎస్సార్‌సీపీ తోడుగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. ఈ మేరకు శుక్రవారం ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్‌(ట్విట్టర్‌)లో పోస్టు చేశారు.

TDP Activists Attack on YSRCP Activists In AP
ప్రజాస్వామ్యమా? ఆటవిక రాజ్యమా?

పూర్వం యుద్ధం ముగిశాక విజయం సాధించిన రాజులు ఓడిపోయిన రాజు రాజ్యంపై పడి విధ్వంసం సృష్టించేవారు. జనావాసాలపై దాడులు చేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేవారు. అందినకాడికి దోచుకునేవారు. ప్రజలంతా ఒకచోటుకు చేరి.. మోకరిల్లి శరణుకోరాక కానీ శాంతించే వారు కాదు. ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితి చూస్తుంటే అలాంటి దుస్థితే కనిపిస్తోంది. ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుక్షణం నుంచి టీడీపీ శ్రేణులు యథేచ్ఛగా విధ్వంసకాండ కొనసాగిస్తున్నాయి. ఎక్కడికక్కడ దాడులకు తెగబడి భయోత్పాతం సృష్టిస్తున్నాయి.ప్రజాస్వామ్యంలో ఏ పార్టీ అయినా విజయం సాధించాక తొలుత దృష్టి సారించాల్సింది శాంతి భద్రతల పరిరక్షణపైనే. అందుకు విరుద్దంగా రాష్ట్రంలో టీడీపీ కార్యకర్తలు దౌర్జన్యం కొనసాగిస్తుండగా... టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం వారిని నిలువరించే ప్రయత్నం చేయకుండా... తిరిగి వైఎస్సార్‌సీపీ కవ్వంపుల పట్ల జాగ్రత్తగా ఉండాలని, వైఎస్సార్‌సీపీ కవ్వంచినా సంయమనం పాటించాలంటూ ట్వీట్‌ చేయటం విధ్వంసాలకు మరింత ఊతమిచ్చేదిగా కనిపిస్తోంది. ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది... వచ్చామన్న కిక్కుతో ఊరూరా కవ్వంపులకు, దాడులకు తెగబడుతున్నది తెలుగుదేశమే.మూడు రోజులుగా వరుస దాడులు చేస్తున్నా పోలీసులకు పైనుంచి ఆదేశాలుండటంతో చేష్టలుడిగి చూస్తున్నారు తప్ప నిలువరించే ప్రయత్నం చేయటం లేదు. తాను ప్రమాణ స్వీకారం చేసే వరకు ఏమైనా చేయండని, రెచ్చిపోండని చంద్రబాబు పరోక్షంగా సంకేతాలిచ్చారని, అందుకే పోలీసులు పట్టనట్లు ఊరుకుంటున్నారని విశ్వసనీయంగా తెలిసింది. ఎందుకంటే తాను ప్రమాణ స్వీకారం చేయకముందయితే తన హయాంలో జరగలేదని చెప్పొచ్చనేది బాబు యోచనగా చెబుతున్నారు.

Ramoji Rao Passes Away
ఈనాడు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు కన్నుమూత

సాక్షి, హైదరాబాద్‌: ఈనాడు గ్రూప్‌ సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు శనివారం ఉదయం కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చేరారు. అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.మూడురోజుల క్రితం ఆయనకు వైద్యులు శస్త్రచికిత్స చేసి స్టంట్స్‌ వేశారు. వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్న రామోజీరావు శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వైద్యులు ఆయనకు వెంటిలేటర్‌ అమర్చారు. వయోభారంతో పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. తెల్లవారుజామున 4.50 గంటలకు తుది శ్వాస విడిచారు.అధికారిక లాంఛనాలతో రామోజీరావు అంత్యక్రియలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. రామోజీ మృతి పట్ల పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. 1936 నవంబర్‌ 16న కృష్ణా జిల్లా పెదపారుపూడిలో రామోజీరావు జన్మించారు. ఈనాడు దినపత్రికను 1974 ఆగస్టు 10న విశాఖపట్నంలో ప్రారంభించారు. ఈనాడుతో పాటు ‘సితార’ సినీ పత్రిక నడిపారు. హైదరాబాద్‌లో అంతర్జాతీయ స్థాయిలో ఫిల్మ్ సిటీని నిర్మించారు. 2016లో భారత ప్రభుత్వం రామోజీని పద్మవిభూషణ్‌తో సత్కరించింది.

T20 WC: Afghanistan shock hapless New Zealand for historic win in Guyana
న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన అఫ్గాన్‌.. 75 ప‌రుగుల‌కే ఆలౌట్‌

టీ20 వరల్డ్‌కప్‌-2024లో న్యూజిలాండ్‌కు ఘోర ప‌రాభ‌వం ఎదురైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా గయానా వేదిక‌గా అఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 84 పరుగుల తేడాతో న్యూజిలాండ్ ఓటమి పాలైంది. బ్యాటింగ్‌, బౌలింగ్‌ అన్ని విభాగాల్లో విఫలమైన కివీస్‌.. అఫ్గాన్‌ ముందు మోకరిల్లింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన అఫ్గానిస్తాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. అఫ్గాన్‌ ఇన్నింగ్స్‌లో ఓపెనర్లు గుర్భాజ్‌(56 బంతుల్లో 80, 5 ఫోర్లు, 5 సిక్స్‌లు), ఇబ్రహీం జద్రాన్‌(44) అదరగొట్టారు. కివీస్‌ బౌలర్లలో బౌల్ట్‌, మాట్‌ హెన్రి తలా రెండు వికెట్లు పడగొట్టగా.. లూకీ ఫెర్గూసన్‌ ఒక్క వికెట్‌ సాధించారు. చెలరేగిన ఫారూఖీ, రషీద్‌..160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్‌కు అఫ్గానిస్తాన్‌ బౌలర్లు చుక్కలు చూపించారు. అఫ్గాన్‌ బౌలర్ల దాటికి న్యూజిలాండ్‌ కేవలం 75 పరుగులకే కుప్పకూలింది. అఫ్గాన్‌ పేసర్‌ ఫజల్హక్ ఫారూఖీ, కెప్టెన్‌ రషీద్‌ ఖాన్‌ తలా నాలుగు వికెట్లు పడగొట్టి బ్లాక్‌ క్యాప్స్‌ పతనాన్ని శాసించారు. వీరితో మహ్మద్‌ నబీ రెండు వికెట్లు సాధించాడు. ఇక న్యూజిలాండ్‌ బ్యాటర్లలో గ్లెన్‌ ఫిలిప్స్‌(18), మాట్‌ హెన్రీ(12) డబుల్‌ డిజిట్‌ స్కోర్‌ చేయగా.. మిగితా బ్యాటర్లంతా సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు.

Who Will Be in Chandrababu Cabinet Ministers: AP
కుర్చీలపై కన్ను!

సాక్షి, అమరావతి: టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 12వ తేదీన నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో మంత్రి పదవులు ఎవరిని వరిస్తాయనే అంశంపై పెద్ద ఎత్తున చర్చలు సాగుతున్నాయి. టీడీపీ నుంచి 135 మంది ఎమ్మెల్యేలుగా గెలిచినందున ఆశావహుల సంఖ్య భారీగా ఉంది.అయితే మొత్తం 24 మంత్రి పదవులే ఇచ్చే అవకాశం ఉన్నందున అందులోనే మూడు పార్టీలకు సర్దుబాటు చేయడం కత్తిమీద సాములా మారింది. జనసేనకు కనీసం ఐదు మంత్రి పదవులు దక్కుతాయనే ప్రచారం జరుగుతుండగా బీజేపీకి రెండు పదవులు ఇచ్చే అవశాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ రెండు పార్టీలకూ ఇవ్వగా మిగిలిన మంత్రి పదవులను టీడీపీ సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుంది. అచ్చెన్నా..! రామ్మోహనా!ఉమ్మడి శ్రీకాకుళం నుంచి టీడీపీ సీనియర్‌ నేత, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి మంత్రివర్గంలో బెర్త్‌ ఖాయమనే ప్రచారం జరుగుతోంది. అయితే కేంద్ర మంత్రివర్గంలో ఆయన సోదరుడి కుమారుడు రామ్మోహన్‌ నాయుడికి అవకాశం దక్కితే మాత్రం అచ్చెన్నాయుడికి ఛాన్స్‌ ఉండకపోవచ్చనే వాదన వినిపిస్తోంది. ఒక కుటుంబంలో ఒకరికే పదవి ఇచ్చే యోచన ఉంటే వీరిలో ఒకరికే అవకాశం లభించవచ్చు. అదే జిల్లా నుంచి కూన రవికుమార్, కొండ్రు మురళీమోహన్‌ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. విజయనగరం జిల్లా నుంచి గెలిచిన కళా వెంకట్రావు, అదితి గజపతిరాజు పేర్లు సైతం పరిశీలనలో ఉన్నాయి.విశాఖ జిల్లాలో ఈసారి గంటా శ్రీనివాసరావుకు మంత్రి పదవి దక్కకపోవచ్చని చెబుతున్నారు. చింతకాయల అయ్యన్న పాత్రుడికి కచ్చితంగా మంత్రి పదవి ఇస్తారని.. మహిళ, ఎస్సీ కోటాలో వంగలపూడి అనితకు అవకాశం లభిస్తుందనే చర్చ నడుస్తోంది. ఉమ్మడి తూర్పు గోదావరి నుంచి జ్యోతుల నెహ్రూ, నిమ్మకాయల చినరాజప్ప, గోరంట్ల బుచ్చయ్య చౌదరిలో ఒకరిని మంత్రివర్గంలోకి తీసుకునే వీలుందని చెబుతున్నారు. సీనియర్ల అవసరం ఉందని భావిస్తే యనమల రామకృష్ణుడిని మంత్రివర్గంలోకి తీసుకోవచ్చని భావిస్తున్నారు. ఆయన కుమార్తె దివ్య తుని నుంచి ఎమ్మెల్యేగా గెలిచినా యనమలకు తగిన ప్రాధాన్యం ఉంటుందని భావిస్తున్నారు.నిమ్మలకు పక్కాఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి నిమ్మల రామానాయుడికి మంత్రివర్గంలో పక్కాగా చోటు దక్కుతుందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. క్లిష్ట సమయంలో పార్టీ కోసం చురుగ్గా పని చేసి చంద్రబాబు, లోకేశ్‌కి దగ్గరవడంతో ఆయనకు అవకాశం కచ్చితంగా లభిస్తుందని చెబుతున్నారు. బీసీ కోటాలో పితాని సత్యనారాయణ పేరు బలంగా వినిపిస్తోంది. ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజుకి మంత్రి పదవిపై రకరకాల చర్చలు సాగుతున్నాయి. ఆయన మంత్రిగా పని చేయరని పార్టీలో కొందరు చెబుతుండగా, ఇస్తే తీసుకుంటారని మరి కొందరు వాదిస్తున్నారు.చింతమనేని ప్రభా­కర్‌ పేరు కూడా రేసులో వినిపిస్తోంది. ఉమ్మ­డి కృష్ణా జిల్లా నుంచి కొల్లు రవీంద్ర ఖాయంగా మంత్రి అవుతారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. బీసీ నేతగా పని చేసిన అనుభవం, ప్రతిపక్షంలోనూ చురుగ్గా వ్యవహరించడంతో ఆయనకు అవకాశం ఖాయమని భావిస్తున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి ప్రత్తిపాటి పుల్లారావు, యరపతినేని శ్రీనివాసరావు, ధూళిపాళ్ల నరేంద్ర, కన్నా లక్ష్మీనారాయణ, రామాంజనేయులు, నక్కా ఆనంద్‌బాబు పేర్లు సైతం వినిపిస్తున్నాయి. వీరిలో ఒకరికి అవకాశం లభించవచ్చని చెబుతున్నారు.నారాయణకు మళ్లీ ఛాన్స్‌ ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి గొట్టిపాటి రవికుమార్, ఏలూరి సాంబశివరావు, డి. బాలవీరాంజనేయస్వామిలో ఒకరికి మంత్రి పదవి దక్కనున్నట్లు ప్రచారం జరుగుతోంది. నెల్లూరు జిల్లా నుంచి గెలిచిన వారిలో పి.నారాయణ గ్యారంటీగా మంత్రి అయ్యే ఛాన్స్‌ ఉంది. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు కావడంతో ఆయనతోపాటే ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని సమాచారం. సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పేర్లు కూడా చంద్రబాబు పరిశీలనలో ఉన్నాయి.చిత్తూరు జిల్లా నుంచి అమర్‌నాథ్‌రెడ్డి, పులివర్తి నానిలో ఒకరిని మంత్రిగా చేస్తారని చెబుతున్నారు. కడప జిల్లా నుంచి రెడ్డప్పగారి మాధవి, వరదరాజులరెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. కర్నూలు జిల్లా నుంచి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి మంత్రి అవుతారని చెబుతున్నారు. అనంతపురం జిల్లా నుంచి గెలిచిన వారిలో పయ్యావుల కేశవ్, పరిటాల సునీతలో ఒకరికి ఛాన్స్‌ దక్కవచ్చు. కాల్వ శ్రీనివాసుల పేరు కూడా పరిశీలనలో ఉంది.పవన్‌కు పదవిపై అస్పష్టతే..జనసేన నుంచి గెలిచిన 21 మంది ఎమ్మెల్యేల్లో ఐదుగురికి మంత్రివర్గంలో చోటు దక్కుతుందనే ప్రచారం జరుగుతోంది. పవన్‌ కళ్యాణ్‌కి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చే విషయంపై స్పష్టత రాలేదు. నాదెండ్ల మనోహర్‌ మంత్రివర్గంలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. కొణతాల రామకృష్ణ, పంతం నానాజీ, కందుల దుర్గేష్, పులపర్తి రామాంజనేయులు పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి.బీజేపీ కోటాలో సుజనాబీజేపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేల్లో చంద్రబాబుకి అత్యంత సన్నిహితుడైన సుజనా చౌదరికి మంత్రివర్గంలో చోటు పక్కాగా ఉంటుందని చెబుతున్నారు. కామినేని శ్రీనివాస్‌ పేరు కూడా వినిపిస్తున్నా ఎంత వరకు అవకాశం దక్కుతుందనే దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సుజనా చౌదరి పోటీలో ఉన్నందున ఆయనకు అవకాశాలు సన్నగిల్లాయి. సత్యకుమార్, విష్ణుకుమార్‌రాజులో ఒకరిని మంత్రి పదవి వరించే అవకాశం ఉందని చెబుతున్నారు.

Chepa Mandu Prasadam Distribution on June 8
చేప ప్రసాదానికి వేళాయే

హైదరాబాద్‌: మృగశిర కార్తెను పురస్కరించుకుని నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో బత్తిని కుటుంబం ఆధ్వర్యంలో శని, ఆదివారాల్లో చేప ప్రసాదం పంపిణీ చేసేందుకు అంతా సిద్ధం చేసినట్లు బత్తిని హరినాథ్, బత్తిని అమర్నాథ్‌ గౌడ్‌ తెలిపారు. కాగా.. శుక్రవారం ఉదయం చేప ప్రసాదం తయారీ కోసం దూద్‌బౌలిలోని తమ స్వగృహంలో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు చెప్పారు. ఈ క్రమంలో శుక్రవారం మత్స్యశాఖ, జీహెచ్‌ఎంసీ, పోలీస్‌ తదితర శాఖల అధికారులు ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో ఏర్పాట్లను పరిశీలించారు. 2 లక్షల చేప పిల్లలను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. మొత్తం 32 కౌంటర్లను ఏర్పాటు చేశామన్నారు. రూ.40 చొప్పున చేప పిల్లల టోకెన్‌ ధర నిర్ణయించారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వచ్చే ఆస్తమా రోగులు, వారి సహాయకులకు స్వచ్ఛంద సంస్థలు భోజన వసతులు ఏర్పాటు చేశాయి. ఈ ఏడాది సుమారు 5 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నారు. చేప ప్రసాదం పంపిణీ శనివారం ఉదయం 11 గంటలకు ప్రారంభమై ఆదివారం ఉదయం 6 గంటల వరకు నిర్విరామంగా కొనసాగుతుంది. ఇందుకోసం 300 మంది బత్తిని కుటుంబ సభ్యులు, వలంటీర్లు విడతల వారీగా విధుల్లో ఉంటారు. చేప ప్రసాదం కార్యక్రమ ప్రారం¿ోత్సవానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఆహా్వనించినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. కాగా.. ఇప్పటికే ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌కు ఆస్తమా బాధితులు తరలివచ్చారు. ట్రాఫిక్‌ ఆంక్షలు.. చేప ప్రసాదం పంపిణీ సందర్భంగా నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌ పరిసర ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. గృహకల్ప, గగన్‌ విహార్‌ల వద్ద తమ వాహనాలను పార్క్‌ చేసి గేట్‌నెం. 2 ద్వారా ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లోకి చేరుకోవాలని సూచించారు. వీఐపీలకు గేట్‌నెం.1 నుంచి ప్రవేశం కలి్పంచారు.

Horoscope Today: Rasi Phalalu On 08-06-2024 In Telugu
ఈ రాశి వారికి నూతన ఉద్యోగాలు దక్కుతాయి

శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, తిథి: శు.విదియ సా.4.21 వరకు, తదుపరి తదియ, నక్షత్రం: ఆరుద్ర రా.8.33 వరకు, తదుపరి పునర్వసు, వర్జ్యం: లేదు, దుర్ముహూర్తం: ఉ.5.35 నుండి 7.12 వరకు, అమృతఘడియలు: ప.10.32 నుండి 12.09 వరకు; రాహుకాలం : ఉ.9.00 నుండి 10.30 వరకు, యమగండం : ప.1.30 నుండి 3.00 వరకు, సూర్యోదయం : 5.28, సూర్యాస్తమయం : 6.29, బుద్ధ జయంతి, మృగశిర కార్తె ప్రారంభం. మేషం: పనులు చకచకా పూర్తి చేస్తారు. ఆత్మీయులు, శ్రేయోభిలాషులతో సంతోషంగా గడుపుతారు. ఆధ్యాత్మిక చింతన. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభవార్తలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం.వృషభం: మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. పనులు మందకొడిగా సాగుతాయి. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. దూరప్రయాణాలు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో పనిభారం.మిథునం: శ్రమకు తగిన ఫలితం పొందుతారు. ఆలోచనలు కలసివస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో కొత్త ఆశలు.కర్కాటకం: అనుకున్న పనులలో ఆటంకాలు. ఖర్చులు పెరుగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. ఆధ్యాత్మిక చింతన. దూరప్రయాణాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగాలలో ఇబ్బందులు ఎదురవుతాయి.సింహం: నూతన ఉద్యోగాలు దక్కుతాయి. పనుల్లో విజయం. ఆస్తుల ఒప్పందాలు. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. దైవదర్శనాలు. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో పురోభివృద్ధి.కన్య: కొత్త విషయాలు తెలుస్తాయి. పనుల్లో విజయం. శ్రమ ఫలిస్తుంది. విద్యార్థులకు నూతన విద్యావకాశాలు. వాహనయోగం. దైవదర్శనాలు. వ్యాపారాలలో సమస్యలు ఉద్యోగాలలో కొన్ని మార్పులు.తుల: సన్నిహితులతో విభేదాలు. ఆర్థిక పరిస్థితి నిరాశ పరుస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో నిరాశ.వృశ్చికం: దూరప్రయాణాలు. ఇంటాబయటా సమస్యలు. దైవదర్శనాలు చేసుకుంటారు. సోదరులతో కలహాలు. రుణాలు చేస్తారు. అనారోగ్యం. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో గందరగోళం.ధనుస్సు: పరిస్థితులు అనుకూలిస్తాయి. అరుదైన ఆహ్వానాలు అందుతాయి. భూములు కొంటారు. నిరుద్యోగులకు శుభవార్తలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో మరింత అనుకూలం.మకరం: సన్నిహితులతో సఖ్యత. విందువినోదాలు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. వివాదాల నుంచి బయటపడతారు. ఆహ్వానాలు అందుతాయి. శుభకార్యాలు నిర్వహిస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు.. ఉద్యోగాలలో కొత్త అవకాశాలు.కుంభం: ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. శ్రమ తప్పదు. పనుల్లో ఆటంకాలు. భూవివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో చికాకులు. వ్యాపారాలలో సమస్యలు. ఉద్యోగాలలో నిరుత్సాహం.మీనం: పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో చికాకులు. ఆరోగ్యభంగం. సోదరులతో విభేదాలు. వ్యాపారాలలో గందరగోళంగా ఉంటుంది. ఉద్యోగాలలో పనిఒత్తిడులు.

Dr YSR Statue Destroyed By TDP Leaders: Andhra Pradesh
AP: వైఎస్సార్‌ విగ్రహాల విధ్వంసం

సాక్షి నెట్‌వర్క్‌: రాష్ట్రంలో అధికారం అండ చూసుకుని టీడీపీ కార్యకర్తలు విధ్వంస కాండను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. వైఎస్సార్‌ కార్యకర్తలపై దాడులకు పాల్పడటంతో పాటు పనిగట్టుకుని వైఎస్సార్‌ విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు. పెట్రోల్‌ పోసి తగలబెడుతున్నారు. ట్రాక్టర్లతో కూల్చేస్తున్నారు. ప్రకాశం జిల్లా దర్శి మండలం రాజంపల్లిలో డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి గురువారం అర్ధరాత్రి నిప్పు పెట్టారు. పొగ రావడాన్ని గమనించిన స్థానికులు నీళ్లు పోసి మంటలార్పారు.అంతకు ముందు విగ్రహానికి తాళ్లు కట్టి ట్రాక్టర్‌తో లాగి కూల్చేయడానికి విఫలయత్నం చేశారు. విగ్రహం ముందు వైపు ట్రాక్టర్‌ స్లిప్‌ అయిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. అనంతరం మడ్డి ఇంజన్‌ ఆయిల్‌ తీసుకొచ్చి విగ్రహం మీద పోసి నిప్పు పెట్టారు. ఆ మేరకు విగ్రహం పక్కనే మడ్డి ఆయిల్‌ డబ్బాలు కూడా ఉన్నాయి. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ సుమన్‌ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ప్రకాశం జిల్లా సీఎస్‌ పురం మండలం పెదగోగులపల్లెలో శుక్రవారం సాయంత్రం టీడీపీ శ్రేణులు విధ్వంసానికి పాల్పడ్డాయి.వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్‌ సమీపంలో ఉన్న బోర్డును నేలమట్టం చేశారు. సమీపంలోని ఆర్వో ప్లాంటులోకి చొరబడి పైపులను విరిచేశారు. పల్నాడు జిల్లా వినుకొండ రూరల్‌ మండలం చీకటీగలపాలెం అడ్డరోడ్డులో కూడా ఇదే రీతిలో మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని పెట్రోల్‌ పోసి తగలబెట్టారు. స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటన స్థలాన్ని సందర్శించారు. ⇒ చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం శ్రీరంగరాజపురం మండలంలోని 49 కొత్తపల్లిమిట్ట, పుత్తూరు–చిత్తూరు జాతీయ రహదారిలోని దీపిక కల్యాణ మండపం వద్ద ఉన్న వైఎస్సార్‌సీపీ ప్రచార వాహనాన్ని ధ్వంసం చేసి పెట్రోలు పోసి నిప్పంటించారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కృపాలక్ష్మి ఎన్నికల్లో ఈ వాహనాన్ని ఉపయోగించారు. పోలింగ్‌ అనంతరం ఆ వాహనాన్ని దీపిక కల్యాణ మండపం వద్ద పార్కిం­గ్‌ చేశారు. దుండగులు వాహనానికి నిప్పం­టించిన తర్వాత కల్యాణ మండపంపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. వీవీ.పురం, కొత్తపల్లి మహభారతం, వినాయకస్వామి ఆలయం వద్ద ఏర్పాటు చేసి శిలాఫలకాల్ని ధ్వంసం చేశారు. వైఎస్సార్‌సీపీ మండలాధ్యక్షడు మణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ⇒ కూటమి శ్రేణులు విజయవాడలో వైఎస్సార్‌ విగ్రహం మెడలో టీడీపీ కండువా, చేతిలో ఆ పార్టీ జెండా పెట్టారు. ఎన్నికల్లో గెలిచిన సందర్భంగా టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు విజయవాడ భవానీపురం స్వాతి రోడ్డులో శుక్రవారం విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ బీజేపీ కార్యాలయం దాటి శివాలయం సెంటర్‌కు చేరుకుంది. ఆ సమయంలో ఓ యువకుడు పొక్లెయిన్‌పైకి ఎక్కి మహానేత వైఎస్సార్‌ విగ్రహం మెడలో పచ్చ కండువా వేశాడు. చేతిలో టీడీపీ జెండా పెట్టాడు. భవానీపురం పోలీసులు వారిస్తున్నా కార్యకర్తలు పట్టించుకోలేదు. ర్యాలీ ముందుకు కదిలిన తర్వాత పోలీసులు టీడీపీ కండువా, జెండాను తొలగించారు.⇒ తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రాపురం మండలంలోని కుప్పంబాదూరు గ్రామంలో వైఎస్సార్‌ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. గ్రామంలోని ప్రధాన రహదారి సమీపంలో ఎన్నో ఏళ్ల క్రితం దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. గురువారం రాత్రి 10 గంటల వరకు విగ్రహం అక్కడే ఉందని, ఉదయం లేచి చూసేసరికి విగ్రహం లేకపోవడాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.⇒ టీడీపీ కార్యకర్తలు శుక్రవారం ఎన్టీఆర్‌ జిల్లా నందిగామ పట్టణంలో హల్‌ చల్‌ చేశారు. పట్టణంలోని పలుచోట్ల శిలాఫలకాలు ధ్వంసం చేయడంతో పాటు పలుచోట్ల ఏర్పాటు చేసిన వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి, డాక్టర్‌ మొండితోక జగన్మోహన్‌రావు, మొండితోక అరుణ్‌ కుమార్‌ల బోర్డులను తొలగించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులకు, పోలీసులకు మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది.

BJP Telangana MPs Hopes To Minister Post
కేంద్ర మంత్రి పదవి ఎవరిని వరించేనో!!

సాక్షి, హైదరాబాద్‌: త్వరలో కొలువుదీరనున్న కేంద్ర మంత్రివర్గంలో గ్రేటర్‌ ఎంపీల్లో ఎవరికి చోటు దక్కుతుందోనని అటు బీజేపీ నేతల్లో, ఇటు ప్రజల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో గ్రేటర్‌ పరిధిలో బీజేపీ నుంచి ముగ్గురు ఎంపీలు ఎన్నికయ్యారు. వీరిలో ఒకరికి కేంద్రమంత్రి పదవి గ్యారంటీ అనే అభిప్రాయాలున్నాయి. గెలిచిన నేతల అభిమానులు మాత్రం ఇద్దరికి మంత్రి పదవులిచి్చనా ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదంటున్నారు. పదవి ఖాయమే.. కానీ.. నగరానికి చెందిన బండారు దత్తాత్రేయకు వాజపేయీ, మోదీ హయాంల్లోనూ మంత్రి పదవులు లభించాయి. కేంద్ర సహాయమంత్రి, కేబినెట్‌ మంత్రి పదవుల్ని ఆయన నిర్వర్తించారు. అలాగే ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు సికింద్రాబాద్‌ నుంచి రెండో పర్యాయం ఎంపీగా గెలిచిన కిషన్‌రెడ్డికి సైతం గత మోదీ ప్రభుత్వ హయాంలో తొలుత సహాయ, తర్వాత కేబినెట్‌ మంత్రి పదవులు వరించాయి. దత్తాత్రేయ కీలకమైన పట్టణాభివృద్ధిశాఖ, కారి్మకశాఖల మంత్రిగానూ పనిచేశారు. కిషన్‌రెడ్డి తొలుత హోంశాఖ సహాయ మంత్రిగా, అనంతరం పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖల మంత్రిగా పనిచేశారు. ఈ నేపథ్యంలో ఈసారీ రాజధాని పరిధిలోని వారికి మంత్రి పదవి ఖాయంగా లభించనుందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. అయితే వీరిలో ఎవరిని ఆ పదవి వరించనుందన్నది ఉత్కంఠ కలిగిస్తోంది. ఓసీకైతే కిషన్‌రెడ్డి.. బీసీకైతే ఈటల.. కిషన్‌రెడ్డికే మరోసారి మంత్రిగా అవకాశం కలి్పస్తారని భావిస్తున్న వారితోపాటు మల్కాజిగిరి నుంచి గెలిచిన ఈటల రాజేందర్‌కు అవకాశం లభించవచ్చని భావిస్తున్న వారూ ఉన్నారు. టీఆర్‌ఎస్‌ ఉద్యమ సమయం నుంచీ రాజకీయాల్లో ఆయన క్రియాశీలపాత్ర వహించడం, అన్నివర్గాల వారిని కలుపుకొని పోయే తత్వం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకోవడంతో పాటు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన మల్కాజిగిరి నుంచి గెలిచినందున అధిష్టానం ఆయనకు తగిన ప్రాధాన్యమిస్తుందని చెబుతున్నారు. వివిధ సమీకరణాలు, రాష్ట్రంలో గెలిచిన ఇతర ప్రాంతాల వారినీ పరిగణనలోకి తీసుకుంటే.. నగరం నుంచి ఓసీకి ఇవ్వాలనుకుంటే కిషన్‌రెడ్డికి, బీసీకి ఇవ్వాలనుకుంటే రాజేందర్‌కు మంత్రి పదవి లభించగలదని భావిసున్నవారు ఉన్నారు. క్యూలో ‘కొండా’ సైతం.. కాగా.. చేవెళ్ల నుంచి గెలిచిన కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి సైతం మంత్రి పదవి లభించే అవకాశాలున్నాయని ఆయన అభిమానులు చెబుతున్నారు. ఈటల రాజేందర్‌కు మంత్రిగా లేదా పార్టీ రాష్ట్ర శాఖ పగ్గాలు అప్పగించే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. గెలిచిన ఎంపీలు సైతం ఎవరికి వారుగా తమకు మంత్రి పదవి లభించగలదనే ఆశాభావంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇంతకీ మంత్రి పదవి ఎవరిని వరించనుందన్నది తేలాలంటే ప్రకటించేంతవరకు ఆగాల్సిందే.

Saurabh Netravalkar has an interesting background
‘సూపర్‌’ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌

డాలస్‌: టి20 ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో గురువారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ‘సూపర్‌ ఓవర్‌’ను అద్భుతంగా బౌల్‌ చేసి అమెరికాను గెలిపించిన లెఫ్టార్మ్‌ పేసర్‌ సౌరభ్‌ నేత్రావల్కర్‌పై అన్ని వైపుల నుంచి ప్రశంసలు కురుస్తున్నాయి. భారత్‌కు చెందిన అతను చదువు, ఉద్యోగరీత్యా యూఎస్‌కు వెళ్లి ఇప్పుడు తొలిసారి వరల్డ్‌ కప్‌ ఆడుతున్న తమ టీమ్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. 32 ఏళ్ల సౌరభ్‌ 2013లో తన తొలి రంజీ ట్రోఫీ మ్యాచ్‌ ఆడాడు. సూర్యకుమార్‌ యాదవ్, శార్దుల్‌ ఠాకూర్, వసీం జాఫర్‌ ఆ మ్యాచ్‌లో అతని సహచరులు. అయితే ఎన్నో ఆశలతో ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లోకి అడుగు పెట్టిన అతనికి అదే చివరి రంజీ మ్యాచ్‌ కూడా అయింది. అజిత్‌ అగార్కర్, జహీర్‌ ఖాన్, అవిష్కార్‌ సాల్వి, ధావల్‌ కులకరి్ణలాంటి పేసర్లు ఉన్న ముంబై టీమ్‌లో అతనికి చోటు దక్కడం కష్టమైపోయింది. అంతకు మూడేళ్ల క్రితమే అండర్‌–19 వరల్డ్‌ కప్‌లో ఆడి భారత్‌ తరఫున అత్యధిక వికెట్లు (9) తీసిన బౌలర్‌గా నిలిచాడు. అయితే అతను ఆశించినట్లుగా దేశవాళీ కెరీర్‌ ఊపందుకోకపోగా, ఐపీఎల్‌ అవకాశం కూడా దక్కలేదు. నిజానికి 2009లోనే సౌరభ్‌ వెలుగులోకి వచ్చాడు. ఎయిరిండియా ప్రతిభాన్వేషణలో భాగంగా బెంగళూరు ఎన్‌సీఏలో అద్భుత బంతితో యువరాజ్‌ సింగ్‌ను బౌల్డ్‌ చేయడంతో అతనికి స్కాలర్‌షిప్‌ లభించింది. కొద్ది రోజులకే అదే ఎయిరిండియా తమ ప్రధాన జట్టులోకి తీసుకోవడంతో యువరాజ్, రైనాలతో కలిసి కార్పొరేట్‌ టోర్నీ కూడా ఆడాడు. తర్వాతి ఏడాది కేఎల్‌ రాహుల్, మయాంక్‌ అగర్వాల్, ఉనాద్కట్, హర్షల్‌ పటేల్‌లలో కలిసి అండర్‌–19 ప్రపంచకప్‌లో పాల్గొన్నాడు. అయితే ఏకైక రంజీ మ్యాచ్‌ తర్వాత మళ్లీ ఆశించిన అవకాశాలు రాలేదు. మరో రెండేళ్లు క్రికెట్‌లో గట్టిగా ప్రయత్నిస్తానని, లేదంటే ఆటను ఆపేస్తానని సౌరభ్‌ తన తండ్రికి చెప్పాడు. చివరకు అదే జరిగింది. కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేసిన అతను ఎమ్మెస్‌ చేసేందుకు 2015లో అమెరికాకు వెళ్లిపోయాడు. న్యూయార్క్‌లో ప్రతిష్టాత్మక కార్నెల్‌ యూనివర్సిటీలో అవకాశం లభించింది. చదువులో ప్రతిభతో పాటు క్రికెట్‌ పరిజ్ఞానంతో ‘క్రిక్‌డీకోడ్‌’ అనే యాప్‌ను తయారు చేయడంతో ప్రత్యేక స్కాలర్‌íÙప్‌ కూడా లభించింది. చదువు పూర్తి కాగానే అతనికి ఒరాకిల్‌ సంస్థలో ఉద్యోగం కూడా వచ్చింది. అమెరికా చేరాక సరదాగా వారాంతపు క్రికెట్‌ ఆడుతూ వచ్చిన సౌరభ్‌... ఆ తర్వాత ఆటపై ప్రత్యేకంగా దృష్టి పెట్టిన యూఎస్‌ నేషనల్‌ చాంపియన్‌షిప్‌లో ఆడటంతో మరింత గుర్తింపు వచ్చింది. ఈ క్రమంలో అమెరికా తరఫున 2018లో తొలి వన్డే ఆడిన నేత్రావల్కర్‌ గత ఏడాది జరిగిన మేజర్‌ లీగ్‌లో ఆకట్టుకోవడంతో టి20 టీమ్‌లో రెగ్యులర్‌ సభ్యుడిగా మారాడు. అండర్‌–19 వరల్డ్‌ కప్‌లో పాక్‌తో మ్యాచ్‌లో బాబర్‌ ఆజమ్‌తో తలపడిన సౌరభ్‌... ఇప్పుడు బాబర్‌ టీమ్‌ను చిత్తు చేయడంలో కీలకపాత్ర పోషించాడు. వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌ కోసం ఆఫీసుకు సెలవు పెట్టిన సౌరభ్‌ ప్రదర్శన తర్వాత సౌరభ్‌ కంపెనీ ‘ఎక్స్‌’ ద్వారా తమ ఇంజినీర్‌ను అభినందించింది.

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
 

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all
Advertisement