T20 World Cup 2024: ఐర్లాండ్‌-కెనడా మ్యాచ్‌.. తుది జట్లు ఇవే..! | T20 World Cup 2024: Canada Won The Toss And Opt To Bowl Against Ireland, Here Are Playing XI | Sakshi
Sakshi News home page

T20 World Cup 2024: ఐర్లాండ్‌-కెనడా మ్యాచ్‌.. తుది జట్లు ఇవే..!

Jun 7 2024 7:52 PM | Updated on Jun 7 2024 8:26 PM

T20 World Cup 2024: Canada Won The Toss And Opt To Bowl Against Ireland, Here Are Playing XI

టీ20 వరల్డ్‌కప్‌ 2024లో భాగంగా ఇవాళ (జూన్‌ 7) కెనడా, ఐర్లాండ్‌ జట్లు తలపడనున్నాయి. న్యూయార్క్‌ వేదికగా జరుగనున్న ఈ మ్యాచ్‌లో ఐర్లాండ్‌ టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. ఈ టోర్నీలో కెనడా, ఐర్లాండ్‌ జట్లు ఇప్పటివరకు ఆడిన చెరో మ్యాచ్‌లో ఓటమిపాలై గ్రూప్‌-ఏ పాయింట్ల పట్టికలో నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నాయి. 

ఈ గ్రూప్‌ నుంచి వరుసగా రెండు విజయాలు సాధించిన యూఎస్‌ఏ అగ్రస్థానంలో ఉండగా.. ఇండియా, పాకిస్తాన్‌ రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. ఈ గ్రూప్‌ నుంచి నిన్న జరిగిన మ్యాచ్‌లో యూఎస్‌ఏ.. పాకిస్తాన్‌పై సంచలన విజయం సాధించింది.సూపర్‌-8కు చేరాలంటే పాక్‌ తదుపరి ఆడబోయే మూడు మ్యాచ్‌లు భారీ తేడాలతో గెలవాల్సి ఉంటుంది. జూన్‌ 9న పాక్‌.. న్యూయార్క్‌ వేదికగా భారత్‌తో తలపడనుంది.

తుది జట్లు..

కెనడా: ఆరోన్ జాన్సన్, నవనీత్ ధలివాల్, పర్గత్ సింగ్, నికోలస్ కిర్టన్, శ్రేయస్ మొవ్వ(వికెట్‌కీపర్‌), దిల్‌ప్రీత్ బజ్వా, సాద్ బిన్ జాఫర్(కెప్టెన్‌), డిల్లాన్ హేలిగర్, కలీమ్ సనా, జునైద్ సిద్ధిఖీ, జెరెమీ గోర్డాన్

ఐర్లాండ్: ఆండ్రూ బల్బిర్నీ, పాల్ స్టిర్లింగ్(కెప్టెన్‌), లోర్కాన్ టక్కర్(వికెట్‌కీపర్‌), హ్యారీ టెక్టర్, కర్టిస్ కాంఫర్, జార్జ్ డాక్రెల్, గారెత్ డెలానీ, మార్క్ అడైర్, బారీ మెక్‌కార్తీ, జాషువా లిటిల్, క్రెయిగ్ యంగ్

Advertisement
 
Advertisement
Advertisement