Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Ysrcp Complaint To The President About Tdp Attacks In Ap
టీడీపీ కార్యకర్తలా.. గూండాలా.. ఇదేం అరాచకం: వైఎస్సార్‌సీపీ నేతలు

సాక్షి, న్యూఢిల్లీ: ఏపీలో జరుగుతున్న టీడీపీ దాడులపై రాష్ట్రపతికి వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు చేసింది. అనంతరం ఆ పార్టీ నేతలు మీడియా సమావేశంలో మాట్లాడారు. ఏపీలో శాంతి భద్రతలను పరిరక్షించాలని రాష్ట్రపతిని కోరినట్లు వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. ఏపీలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. వారం రోజులుగా టీడీపీ శ్రేణులు దాడులకు తెగబడుతున్నాయి. వక్రీకరించే బుద్ధి చంద్రబాబు, ఆయన పార్టీ నాయకులకే ఉంది’’ అంటూ విజయసాయిరెడ్డి మండిపడ్డారు.‘‘చట్టం లేదు, సేచ్ఛ లేదు, న్యాయం లేదు. అన్యాయమే రాజ్యమేలుతోంది. బాధితులు ఫిర్యాదు చేస్తామన్నా పోలీసులు స్వీకరించే పరిస్థితి లేదు. ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి. వెళ్లాయి.. కానీ ఎలాంటి పరిస్థితి ఎన్నడూ లేదు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, వాళ్ల ఆస్తులే లక్ష్యంగా చేసుకుని టీడీపీ శ్రేణులు స్వైర విహారం చేస్తున్నాయి. మీరు టీడీపీ కార్యకర్తలా.. గూండాలా?. ప్రమాణస్వీకారానికి ముందే చంద్రబాబు హింసను ప్రేరేపించారు. హింసకు గురైన బాధితులు ఆక్రందనలు చంద్రబాబుకు కనిపించడం లేదా?’’ అని విజయసాయిరెడ్డి మండిపడ్డారు.

Major Fire Accident In Kuwait
Kuwait Fire: కువైట్‌లో భారీ అగ్నిప్రమాదం.. మృతుల్లో 10 మంది భారతీయులు

కువైట్‌ సిటీ: కువైట్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. బుధవారం (జూన్‌12) తెల్లవారుజామున 3 గంటలకు అపార్ట్‌మెంట్‌లో మంటలు చెలరేగాయి. ఈ అగ్ని ప్రమాదంలో మొత్తం 42 మంది సజీవ దహనమయ్యారు. మృతుల్లో 10 మంది భారతీయులున్నట్లు తెలిసింది. తీవ్రంగా గాయపడిన 50కి పైగా మందిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Kommineni Srinivasa Rao Comments On Chandrababu
అమరావతిపై చంద్రబాబుకే అనుమానాలున్నాయా?

ఏపీ రాజధాని అమరావతి అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. టీడీపీ, జనసేన,బీజేపీ సభ్యులంతా కలిసి ఆయనను తమ నేతగా ఎన్నుకున్న సందర్భంగా మాట్లాడుతూ.. అమరావతిపై క్లారిటీ ఇచ్చారు. అలాగే విశాఖను ఆర్దిక రాజధానిగా అభివృద్ది చేస్తామని, కర్నూలును కూడా ప్రగతి పధంలోకి తీసుకు వెళతామని అన్నారు. ఆయన తాను ఇచ్చిన సూపర్ సిక్స్ వాగ్దానాల గురించి కాకుండా అమరావతిపైనే ప్రసంగించడం అందరి దృష్టిని ఆకర్షించింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మూడు రాజధానులు పెట్టడం ద్వారా ఏపీ అభివృద్దికి ప్రయోజనం జరుగుతుందని భావించారు. విశాఖ పట్నం అయితే రాష్ట్రం అంతటికి గ్రోత్ ఇంజన్ అవుతుందని ఆశించారు. అమరావతి మాదిరి లక్షల కోట్లు ఖర్చుపెట్టవలసిన అవసరం ఉండదని అనుకున్నారు. కాని దానిని తెలుగుదేశం,ఇతర విపక్షాలు ముందుకు సాగకుండా అడ్డుపడ్డాయి. దాంతో జగన్ ఇందుకు సంబంధించిన చట్టాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు అప్పట్లోనే ప్రకటించారు. కాకపోతే తమ విధానం మూడు రాజధానులు అని ఆయన అన్నారు. కాని ఆయన తిరిగి అదికారంలోకి రాలేకపోయారు.విశాఖ, కర్నూలులకు అడ్డుపడిన చంద్రబాబు నాయుడు, ఇప్పుడు జగన్ అక్కడి వారిని మోసం చేశారని అంటున్నారు. చంద్రబాబుతో వచ్చిన చిక్కే ఇది. ఎక్కడ ఏది అవసరమైతే అది మాట్లాడుతుంటారు. ఇందులో జగన్ మోసం చేసింది ఏముంది? ఆయన ఎన్నికల ప్రచారం సమయంలో గెలిచిన తర్వాత విశాఖ నుంచే పాలన చేస్తామని ప్రకటించారు. విశాఖను సుందరంగా తీర్చి దిద్దారు. రిషికొండపై ఆకర్షణీయమైన భవంతిని నిర్మించారు. అలాగే కర్నూలులో పలు న్యాయ రంగానికి సంబంధించిన పలు ఆఫీస్ లు ఏర్పాటు చేశారు. లోకాయుక్త ఆఫీస్ ను కూడా అక్కడే నెలకొల్పారు. హైకోర్టు ఏర్పాటు పూర్తిగా ఆయన చేతిలో లేనిది కనుక దానిపై ముందుకు వెళ్లలేకపోయారు. ఈ విషయాలలో జగన్ చిత్తశుద్దిని శంకించనవసరం లేదు.జగన్‌ ఒకటి తలిస్తే, ప్రజా తీర్పు మరో రకంగా రావడంతో చంద్రబాబుకు అది అడ్బాంటేజ్ అయింది. విశాఖ ప్రజలు కూడా తమకు రాజధాని వద్దని అనుకున్నారని చంద్రబాబు అభిప్రాయపడుతున్నారు. ఇంతవరకు తప్పు లేదు. ఎందుకంటే జగన్ ఆ ప్రాంతానికి అంత పెద్ద వరం ఇస్తే ,దానిని వారు ఆదరించలేదు.కర్నూలులో హైకోర్టు పెట్టాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం కర్నూలులో హైకోర్టు ఏర్పాటు కావవల్సి ఉంది. అక్కడ కూడా ఆశ్చర్యంగా వైఎస్సార్‌సీపీకి వ్యతిరేక తీర్పు వచ్చింది. తాజాగా చంద్రబాబు అక్కడ హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని కూడా చెప్పడం లేదు. ఈ నేపధ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా తన విధానాన్ని మార్చుకుంటేనే బెటర్ అనిపిస్తుంది. వచ్చే ఐదేళ్లు టీడీపీ కూటమి అధికారంలో ఉంటుంది కనుక వారు చేయదలచుకున్నది అంతా అమరావతిలోనే చేస్తారు. ఆ తర్వాత ఎన్నికలలో వైసిపి గెలిచినా, ఇందులో మార్పులు చేయడం కష్టం అవుతుంది. అప్పుడు మళ్లీ మూడు రాజధానులు అన్నా ఉపయోగం ఉండదు. నా వ్యక్తిగత అభిప్రాయం అయితే అమరావతిపై ఇక వివాదాన్ని ముగించడం మంచిది. వైఎస్సార్‌సీపీ దీనిపై ఎలా ముందుకు వెళుతుందో చూడాలి. అమరావతికి సంబంధించి కొన్ని చిక్కుముళ్లను చంద్రబాబు విడదీయవలసి ఉంటుంది. 2014 టరమ్ లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నప్పుడు కేవలం ప్రాధామిక సదుపాయాల కోసం లక్షతొమ్మిది వేల కోట్ల రూపాయలు అవసరం అవుతాయని , ఈ నిదులను మంజూరు చేయాలని కేంద్రానికి లేఖ రాశారు. ఇప్పుడు ఆ వ్యయం ఇంకా భారీగా పెరిగి ఉంటుంది.అంత మొత్తాన్ని ఎలా వెచ్చిస్తారో చెప్పగలగాలి. కేంద్రం ఇప్పుడు ఏమైనా ఆ ప్రకారం ఇస్తే ఇబ్బంది లేదు. అలా ఇవ్వకపోతే మళ్లీ సమస్య మొదటికి వస్తుంది. అప్పట్లో ప్రధాని మోదీ మట్టి,నీళ్లు ఇచ్చి వెళ్లారని చంద్రబాబు విమర్శించేవారు. ఈ విడత టీడీపీపై కేంద్రంలోని ప్రభుత్వం ఆధారపడే పరిస్థితి ఉంది కనుక లక్ష కోట్లను రాజధాని కోసం సాధించగలిగితే చంద్రబాబుకు మంచి పేరు వస్తుంది. గత ప్లాన్ ప్రకారం నవ నగరాలన్నింటిని ఇక్కడే నిర్మిస్తారా?లేక వాటిని వాయిదా వేస్తారా? అనేది చూడాలి. అంతేకాదు. అమరావతి భూముల విషయంలో పలు వివాదాలు ఉన్నాయి. కొంతమంది రైతులు తమ భూములను రాజధానికి ఇవ్వడానికి ఇష్టపడలేదు. వారిపై అప్పట్లో కేసులు కూడా పెట్టారు. జగన్ ప్రభుత్వం వచ్చాక వాటిని తొలగించింది. ఆ రోజుల్లో పంటలను దగ్దం చేసి భూములు లాక్కునే యత్నం చేశారన్న విమర్శలు వచ్చాయి. అలాంటి చోట్ల ఏ రకంగా ముందుకు వెళతారో తెలియదు. ప్లాట్ల కేటాయింపుపై కూడా రకరకాల వ్యాఖ్యలు ఉన్నాయి. వాటన్నిటిని పరిష్కరించుకోవల్సి ఉంటుంది. వారికి రోడ్లు,డ్రైనేజ్, రక్షిత నీరు మొదలైనవాటిని సమకూర్చుకోవాలి. అమరావతిలో పది డిగ్రీల ఉష్ణాగ్రత తగ్గించాలని అప్పట్లో చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఇంటింటికి ఏసీ కూడా ఇచ్చే ఏర్పాటు చేస్తామని అన్నారు. ఇవన్ని చేయగలిగితే తెలుగుదేశంకి ఖ్యాతి వస్తుంది. ప్రభుత్వ కార్యాలయాల వసతుల కోసం ఏభై అంతస్తుల టవర్ లు నిర్మించాలని తలపెట్టారు. అదే ఆలోచనను మళ్లీ చేస్తారో?లేదో తెలియవలసి ఉంది. కృష్ణానది పక్కన ఉండడంతో నేల స్వభావం భారీ భవంతులకు అనువైనది కాదని నిపుణులు చెబుతారు. అందువల్లే రాఫ్ట్ టెక్నాలజీకి వెళుతున్నామని అనేవారు. అది బాగా ఖరీదైనది. అయినా ఖర్చు భరించక తప్పదు. మరో కీలక అంశం సింగపూర్ కంపెనీలకు గతంలో మాదిరే మళ్లీ భూములు కేటాయిస్తారా? లేదా ?అన్నదానిపై నిర్ణయం చేయవలసి ఉంటుంది. వారికి రియల్ ఎస్టేట్ ప్రయోజనాల కోసం ఏపీ ప్రభుత్వం పక్షాన భూమి ఇవ్వడమే కాకుండా,అవసరమైన రోడ్లు తదితర సదుపాయాలను సమకూర్చడానికి 5,500 కోట్లు వ్యయం చేయడానికి సిద్దపడ్డారు. ఇప్పుడు ఖర్చు కూడా పెరుగుతుంది. సింగపూర్ కంపెనీల నుంచి ఏపీ ప్రభుత్వానికి వచ్చే ఆదాయం మాత్రం బాగా తక్కువగా ఉందని అప్పట్లో విమర్శలు వచ్చాయి. పైగా వారితో ఏ వివాదం వచ్చినా లండన్ కోర్టులో తేల్చుకోవాలని రాసుకున్నారు. 2019 లో తమ ప్రాజెక్టు వయబుల్ కాదని భావించి సింగపూర్ సంస్థలు దానిని వదలుకున్నాయి. సింగపూర్ సంస్థలకు స్విస్ చాలెంజ్ పద్దతిన భూములు ఇవ్వడం పై ఆనాడు కోర్టులలో వివాదాలు నడిచాయి. కోర్టు సంబంధిత చట్టంలోని కొన్ని క్లాజులను కొట్టివేయగా,వాటిని మార్చి మళ్లీ చట్టాన్ని ఆమోదించారు. నిజానికి చంద్రబాబు నాయుడు రైతుల నుంచి ముప్పైమూడు వేల ఎకరాల భూమి సమీకరించకుండా ,ప్రభుత్వానికి అవసరమైన వెయ్యి నుంచి ఐదువేల ఎకరాల భూమి తీసుకుని , అందులో భవనాల నిర్మాణం చేపట్టి ఉంటే ఇంత రాద్దాంతం అయ్యేది కాదు. ఆయన ఓవర్ యాంబిషస్ గా దీనిని ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ గా మార్చారన్న అభిప్రాయం వ్యక్తం అయ్యేది. ఇతర జిల్లాలప్రజలు మొత్తం డబ్బంతా అమరావతిలోనే పెడితే ఎలా అని ప్రశ్నించేవారు. ఇప్పుడు మళ్లీ అదే పరిస్థితి ఎదురవుతోంది. అయితే దాదాపు అన్ని జిల్లాల ప్రజలు అమరావతిని ఆమోదించినట్లుగానే ఎన్నికల ఫలితాలు వచ్చాయి కనుక చంద్రబాబు తన ఇష్టానుసారం ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. చంద్రబాబు రాగానే అధికారులు అక్కడ హడావుడి ఆరంభించారు. బహుశా కొన్ని పూర్తి కాని భవనాలకు ప్రాధాన్యత ఇచ్చి, తర్వాత మిగిలిన నిర్మాణ పనులు చేపట్టవచ్చు. అమరావతి రాజధాని పూర్తి కావడానికి చాలాకాలం పట్టవచ్చు. నిధుల సమస్య, సాంకేతిక అంశాలు, భూ సేకరణ వంటి వ్యవహారాలు సజావుగా పూర్తి చేసుకుంటే ఇబ్బంది ఉండకపోవచ్చు. కొసమెరుపు ఏమిటంటే చంద్రబాబు ప్రమాణ స్వీకారం కృష్ణానదికి ఆవల వైపున ఉన్న అమరావతిలోనే జరుగుతుందని తొలుత ప్రకటించారు. కాని ఏ సెంటిమెంట్ అయినా అడ్డం వచ్చిందేమో తెలియదు కాని, ఈసారి కృష్ణా నదికి ఈవల వైపు అంటే విమానాశ్రయం ఎదుట ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. అంటే 2014లో అమరావతి వైపు ప్రమాణ స్వీకారం చేయడం అచ్చి రాలేదని భావించి వాస్తు పండితులు ఈ మార్పు చేశారా?అన్న సందేహం వస్తుంది. అమరావతి వాస్తుపైనే అనుమానాలు ఉన్న నేతలు దానిని ఏ రీతిన ముందుకు తీసుకువెళతారన్నది ఆసక్తికరం.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు

This Rs 250 CRORE Venue Will Be Fully Dismantled After T20 WC 2024
రూ. 250 కోట్లు.. బ్యాటర్లకు చుక్కలే! కూల్చేయనున్న ఐసీసీ?

అమెరికాలోని ప్రఖ్యాత నగరంలోని స్టేడియం... నిర్మాణానికి దాదాపుగా 250 కోట్ల రూపాయల ఖర్చు... 34,000 మంది ప్రేక్షకులు ప్రత్యక్షంగా మ్యాచ్‌ను వీక్షించేలా సీటింగ్‌ సామర్థ్యం..పరుగుల వరద పారుతుందని భావిస్తే టీ20 ఫార్మాట్‌కు భిన్నంగా లో స్కోరింగ్‌ మ్యాచ్‌లు.. బౌండరీల సంగతి దేవుడెరుగు సింగిల్స్‌ తీయాలన్నా కష్టంగా తోచే పిచ్‌. 👉తొలి మ్యాచ్‌లో శ్రీలంక వర్సెస్‌ సౌతాఫ్రికా.. నమోదైన స్కోర్లు.. 77 (19.1), 80/4 (16.2). ఆరు వికెట్ల తేడాతో లంకపై సౌతాఫ్రికా విజయం.👉రెండో మ్యాచ్‌లో ఇండియా వర్సెస్‌ ఐర్లాండ్‌.. స్కోర్లు 96 (16), 97/2 (12.2).. ఎనిమిది వికెట్ల తేడాతో ఐర్లాండ్‌ను చిత్తు చేసిన టీమిండియా.👉ముచ్చటగా మూడో మ్యాచ్‌లో ఐర్లాండ్‌తో తలపడ్డ కెనడా.. స్కోర్లు 137/7 (20)- 125/7 (20). 12 పరుగుల తేడాతో కెనడా గెలుపు.👉ఇక నాలుగో మ్యాచ్‌ నెదర్లాండ్స్‌- సౌతాఫ్రికా మధ్య. ఇది కూడా లో స్కోరింగ్‌ మ్యాచే! నెదర్లాండ్స్‌ 103 రన్స్‌ చేస్తే.. సౌతాఫ్రికా 106 పరుగులు సాధించి.. నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది.👉ఐదో మ్యాచ్‌.. వరల్డ్‌కప్‌కే హైలైట్‌. ఇండియా వర్సెస్‌ పాకిస్తాన్‌.. ఇండియా 119 పరుగులకు ఆలౌట్‌ అయితే.. పాక్‌ 113 పరుగుల వద్దే నిలిచి.. ఆరు పరుగుల తేడాతో ఓడిపోయింది.👉ఆ తర్వాత సౌతాఫ్రికా(113/6)తో బంగ్లాదేశ్‌(109/7) తలపడగా.. ప్రొటిస్‌ జట్టు బంగ్లాపై నాలుగు పరుగుల తేడాతో గెలుపొందింది.👉ఏడో మ్యాచ్‌లో కెనడా- పాకిస్తాన్‌ పోటీపడగా.. 106 పరుగులకే పరిమితమైన కెనడా.. 107 పరుగులు(17.3 ఓవర్లలో) చేసిన పాక్‌ చేతిలో ఏడు వికెట్ల తేడాతో ఓడింది.ఇదే ఆఖరు.. కూల్చేయడమే తరువాయిఇక ఆఖరిసారిగా ఇక్కడ ఆతిథ్య అమెరికా జట్టు టీమిండియాతో తలపడేందుకు సిద్ధమైంది. గ్రూప్‌-ఏ లో ఉన్న ఈ జట్ల మధ్య జరిగే మ్యాచే ఇక్కడ జరిగే చివరి మ్యాచ్‌. ఆ తర్వాత దీనిని కూల్చేస్తారు.అవును.. మీరు విన్నది నిజమే. ఇదంతా న్యూయార్క్‌లోని నసావూ కౌంటీ ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియం గురించే! టీ20 ప్రపంచకప్‌ టోర్నీకి అమెరికా తొలిసారిగా ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే.20 జట్లు.. తొమ్మిది వేదికలువెస్టిండీస్‌తో కలిసి ఈ మెగా టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్న యూఎస్‌ఏలో మూడు వేదికల్లో మ్యాచ్‌ల నిర్వహణకు షెడ్యూల్‌ ఖరారైంది.న్యూయార్క్‌- నసావు కౌంటీ ఇంటర్నేషనల్ స్టేడియం, ఫ్లోరిడా- లాడర్‌హిల్‌లోని సెంట్రల్ బ్రోవార్డ్ పార్క్ కౌంటీ స్టేడియం, డల్లాస్‌-టెక్సాస్‌లోని గ్రాండ్ ప్రయరీ క్రికెట్ స్టేడియాలలో మ్యాచ్‌లు నిర్వహిస్తున్నారు.అయితే, వీటిలో నసావూ కౌంటీ స్టేడియాన్ని ఈ ఈవెంట్‌ కోసం అంతర్జాతీయ క్రికెట్‌ మండలి తాత్కాలికంగా నిర్మించింది. జూన్‌ 3- 12 వరకు ఎనిమిది మ్యాచ్‌లు పూర్తైన తర్వాత దీనిని డిస్‌మాంటిల్‌ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.పెదవి విరిచిన ప్రేక్షకులుఅయితే, డ్రాప్‌- ఇన్‌ పిచ్‌ ఉన్న ఈ స్టేడియం కోసం ఐసీసీ సుమారుగా రూ. 250 కోట్లు ఖర్చు చేసినా.. సదుపాయాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదీ బిగ్‌ ఆపిల్‌ సిటీలోని నసావూ కౌంటీ స్టేడియం సంగతి!!టీ20 ప్రపంచకప్‌-2024లో మొత్తం 20 జట్లు భాగం కాగా.. అమెరికాలో మూడు, వెస్టిండీస్‌(గయానా, బార్బడోస్‌, ఆంటిగ్వా, ట్రినిడాడ్‌, సెయింట్‌ విన్సెంట్‌, సెయింట్‌ లూసియా)లోని ఆరు నగరాలు ఇందుకు ఆతిథ్యం ఇస్తున్నాయి. చదవండి: WC: పక్కా టీ20 టైప్‌.. న్యూయార్క్‌ పిచ్‌ వెనుక ఇంత కథ ఉందా?

AP CM Chandrababu Naidu Swearing-in Ceremony Live Updates
ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణం

విజయవాడ, సాక్షి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణం చేశారు. బుధవారం ఉదయం గన్నవరం కేసరపల్లి ఐటీ పార్క్‌ వద్ద ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరిగింది. గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ చంద్రబాబు చేత సీఎంగా ప్రమాణం చేయించారు. ఏపీ ఎన్డీయే కూటమి శాసనసభా పక్ష నేతగా ఎన్నికైన చంద్రబాబు.. ప్రధాని మోదీ సమక్షంలో ప్రమాణం చేశారు. ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబును ప్రధాని మోదీ ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ తర్వాత వరుసగా కొత్త మంత్రులు ప్రమాణం చేశారు. జనసేన అధినేత కొణిదెల పవన్‌ కల్యాణ్‌, చంద్రబాబు తనయుడు.. టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్‌ బాబు, టీడీపీ సీనియర్‌ నేత అచ్చెన్నాయుడు.. .. కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్‌(జనసేన), పి.నారాయణ, వంగలపూడి అనిత, సత్యకుమార్‌ యాదవ్‌(బీజేపీ), నిమ్మల రామానాయుడు, మహ్మద్‌ ఫరూఖ్‌, ఆనం రాంనారాయణరెడ్డి, పయ్యావుల కేశవ్‌, అనగాని సత్యప్రసాద్‌, కొలుసు పార్థసారథి, బాల వీరాంజనేయ స్వామి, ఆనం రాంనారాయణరెడ్డి, పయ్యావుల కేశవ్‌, అనగాని సత్యప్రసాద్‌, కొలుసు పార్థసారథి, డి బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్‌, కందుల దుర్గేష్‌(జనసేన), గుమ్మడి సంధ్యారాణి, బీసీ జనార్ధన్‌రెడ్డి, టీజీ భరత్‌, ఎస్‌ సవిత, వాసంశెట్టి సుభాష్‌, కొండపల్లి శ్రీనివాస్‌, మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి.. ఒకరి తర్వాత ఒకరు మంత్రులుగా ప్రమాణం చేశారు. మంత్రులందరూ ప్రమాణం చేసిన తర్వాత ప్రధాని మోదీ, రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌, చంద్రబాబు కొత్త కేబినెట్‌తో కలిసి గ్రూప్‌ ఫొటో దిగారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కేంద్ర మంత్రులు అమిత్‌ షా, నితిన్‌ గడ్కరీ, జేపీ నడ్డా తదితరులు, మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ షిండే, తమిళనాడు మాజీ సీఎం పన్నీరు సెల్వం, తెలంగాణ మాజీ గవర్నర్‌ తమిళిసై తదితర మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సుప్రీం కోర్టు మాజీ సీజే ఎన్వీ రమణ, చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, చంద్రబాబు వియ్యంకుడు నందమూరి బాలకృష్ణ, మూడు పార్టీల కీలక నేతలు హాజరయ్యారు. సినీ రంగం నుంచి చిరంజీవి, రజినీకాంత్‌, నారా ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ ఈ కార్యక్రమంలో పాల్గొంది. తమిళిసైకి షా వార్నింగ్‌చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమం వేదికగా ఆసక్తికరమైన ఘటన ఒకటి చోటు చేసుకుంది. బీజేపీ అ‍గ్రనేత, కేంద్ర మంత్రి అమిత్‌ షా.. ఆ పార్టీ తమిళనాడు నేత తమిళిసైని దగ్గరకు పిలిచి మరీ ఏదో సీరియస్‌గా మాట్లాడారు. తమిళనాడులో ప్రస్తుతం నెలకొన్న రాజకీయంపైనే ఆయన అంత సీరియస్‌గా వార్నింగ్‌ ఇచ్చి ఉంటున్నారని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.మెగా బ్రదర్స్‌తో మోదీ సందడిప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిశాక వేదికపై కాసేపు సందడి వాతావరణం నెలకొంది. తన దగ్గరకు వచ్చిన పవన్‌ను ప్రత్యేకంగా అభినందించారు ప్రధాని మోదీ. కాస్త దూరంలో ఉన్న ఆయన సోదరుడు చిరంజీవి దగ్గరకు తీసుకొచ్చి.. ఇద్దరి చేతులు పైకి ఎత్తి అభివాదం చేశారు. ఆ తర్వాత ఇద్దరికి దగ్గరకు తీసుకుని కాసేపు ప్రత్యేకంగా మాట్లాడారు. కేంద్ర మంత్రి అమిత్‌ షా, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు రామ్మోహన్‌ నాయుడికి చిరు ఆత్మీయ ఆలింగనంవేదికపైకి చేరుకున్న రజినీకాంత్‌రజినీకాంత్‌ దంపతులతో నందమూరి బాలకృష్ణ➡️ కేసరపల్లి వేదికపైకి చేరుకున్న తమిళనాడు మాజీ సీఎం పన్నీరు సెల్వం➡️ వేదికపైకి చేరుకున్న నందమూరి బాలకృష్ణ.. అతిథుల్ని ఆహ్వానిస్తున్న హిందూపురం ఎమ్మెల్యే➡️ పవన్‌ కల్యాణ్‌ ప్రమాణ స్వీకార నేపథ్యంలో బస్సులో కేసరపల్లికి బయల్దేరిన మెగా ఫ్యామిలీపవన్‌ కల్యాణ్‌ ప్రమాణ స్వీకార నేపథ్యంలో బస్సులో కేసరపల్లికి బయల్దేరిన మెగా ఫ్యామిలీ ఇదీ చదవండి: ఏపీ కొత్త మంత్రుల పూర్తి జాబితా ఇదే

amit shah serious on tamilisai chandrababu oath ceremony at vijayawada
అమిత్‌ షా-తమిళిసై మధ్య అసలేం జరిగింది!

సాక్షి, విజయవాడ: చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమ వేదికపై ఆసక్తికర ఘటన ఒకటి చోటు చేసుకుంది. బీజేపీ అగ్రనేత అమిత్‌ షా ఆ పార్టీ మహిళా నేత తమిళిసై సౌందరరాజన్‌ మధ్య జరిగిన సన్నివేశమది. ఈ కార్యక్రమానికి తెలంగాణ మాజీ గవర్నర్‌, తమిళనాడు బీజేపీ నేత తమిళిసై సౌందరరాజన్‌ కూడా హాజరయ్యారు. అక్కడే వేదిక మీద ఉన్న బీజేపీ పెద్దలకు నమస్కారం చేసి ముందుకు వెళ్లబోయారు. అయితే.. కేంద్ర మంత్రి అమిత్‌ షా ఆమెను వెనక్కి పిలిచారు. ఒక్కసారిగా ఆమెపై సీరియస్‌ అయ్యారు. తమిళిసై ఏదో చెప్పబోతుండగా.. అడ్డుకుని మరీ అమిత్‌ షా ఆమెను ఏదో వారించినట్లు ఉంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అన్నామలై తో పంచాయతీ బంద్ చెయ్ అంటున్నాడా ?? pic.twitter.com/NVeTII7Sxl— 𝗡𝗔𝗟𝗟𝗔 𝗕𝗔𝗟𝗨 (@Nallabalu1) June 12, 2024తమిళిసైకి, కేంద్ర మంత్రి అమిత్‌ షాకి మధ్య అసలు ఏం జరిగింది?. ఆమెపై కేంద్రమంత్రి అమిత్‌ షా ఎందుకు అంత సీరియస్‌ అయ్యారని షోషల్‌మీడియాలో చర్చ జరుగుతోంది.ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో తమిళనాడులో బీజేపీ పేలవమైన ప్రదర్శన ఇచ్చింది. బీజేపీ రాష్ట్ర చీఫ్‌ అన్నామలైతో పాటు తమిళిసై కూడా ఓటమి పాలయ్యారు. ఆ వెంటనే ఆమె అన్నామలైకి వ్యతిరేకంగా స్టేట్‌మెంట్లు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అమిత్‌ షా పంచాయితీలు పెట్టొద్దంటూ ఆమెను వారించి ఉంటారని పలువురు కామెంట్లు చేస్తున్నారు. దీనిపై బీజేపీ స్పందిస్తేనే అసలేం జరిగిందనేది స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Joe Biden Will Respect Judicial Process over Son Convicted In Gun Crimes
నేను అధ్యక్షుడినే కాదు.. తండ్రిని కూడా: జో బైడెన్‌

న్యూయార్క్‌: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ కుమారుడు హంటర్‌ బైడెన్‌(54)ను గన్‌ కోనుగోలు కేసులో మొత్తం మూడు ఆరోపణల్లోనూ కోర్టు దోషిగా తేల్చింది. 2018లో గన్‌ కొనుగోలు చేసిన సమయంలో డ్రగ్స్‌కు బానిసకాదంటూ ఆయుధ డీలర్‌కు అబద్దం చెప్పారని, ఆ గన్‌ను 11 రోజుల పాటు అక్రమంగా తన వద్దే ఉంచుకున్నాడని న్యాయమూర్తులు నిర్ధారించారు. తన కుమారుడి కేసుపై తాజాగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ స్పందించారు.‘‘నేను అమెరికాకు అధ్యక్షుడిని. కానీ, నేను కూడా ఒక తండ్రిని. ఈ కేసుకు సంబంధించి హంటర్‌ ఆప్పీల్‌ను పరిగణలోకి తీసుకున్నందుకు న్యాయపరమైన ప్రక్రియను గౌరవిస్తాను’’ అని జోబైడెన్‌ అన్నారు. దీం‍తో క్రిమినల్‌ కేసులో దోషిగా తేలిన కుమారుడిని కలిగి ఉన్న తొలి అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్‌గా నిలవటం గమనార్హం.ఇక.. ఈ కేసు విచారించిన డెలావెర్‌లోని ఫెడరల్‌ కోర్టు జడ్జి మేరీ ఎల్లెన్‌ నొరీకా మాత్రం హంటర్‌కు 120 రోజుల జైలు శిక్ష పడే అవకాశాలు ఉ‍న్నట్లు తెలిపారు. ఈ కేసులో పూర్తి తీర్పు అక్టోబర్‌లో వెలువడనుందని చెప్పారు. సాధారణంగా ఇలాంటి నేరాలకు గరిష్టంగా 25 ఏళ్ల వరకు జైలు శిక్షపడే అవకాశాలు ఉన్నాయి. హంటర్‌ బైడెన్‌పై మరో కేసు కూడా ఉంది. పన్ను ఎగ్గొట్టిన ఆరోపణలపై కాలిఫోర్నియా కోర్టు సెప్టెంటర్‌లో విచారణ జరపనుంది.

How To Spot Artificial Jewellery as US Woman Gets Duped After Paying Rs 6 Crore For A Necklace
ఆశపడ్డారో ఖేల్‌ ఖతం! నకిలీ బంగారాన్ని ఎలా గుర్తించాలి?

రాజస్థాన్‌లోని జైపూర్‌లో నకిలీ ఆభరణాన్ని స్వచ్ఛమైన బంగారు నగగా నమ్మించి ఒక అమెరికన్‌ టూరిస్ట్‌ మహిళను ఏకంగా రూ. 6 కోట్లకు ముంచేసిన వైనం దిగ్భ్రాంతికి గురి చేసింది. రూ. 300 విలువైన బంగారు పూత పూసిన వెండి నెక్లెస్‌ను గోల్డ్‌ నెక్లెస్‌గా నమ్మించాడో నగల వ్యాపారి. తరువాత విషయం తెలుసుకున్న ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో అసలేదో, నకిలీ ఏదో ఎలా తెలుసుకోవాలి? కృత్రిమ బంగారు ఆభరణాలను ఎలా గుర్తించాలి? తెలుసుకుందాం రండి! అందం, స్టేటస్‌కోసమో, భవిష్యత్తు అవసరాల కోసమో ప్రజలు తరచుగా బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. బంగార ధర ఎపుడూ ఖరీదైందే కాబట్టి మోసాలకు చాలా అవకాశం ఉంది. అందులోనూ ఈ మధ్యకాలంలో నిజమైన బంగారంలా మురిపిస్తున్న ఇమిటేషన్‌ జ్యుయల్లరీకి ఆదరణబాగా పెరుగుతోంది. అందుకే అసలు బంగారాన్ని, నకిలీ బంగారానికి తేడాను గుర్తించడం చాలా కీలకం. ఆభరణాల నిపుణులు, అనుభవజ్ఞులైన పెట్టుబడిదారులు బంగారం నిజమో కాదో సులువుగా గుర్తిస్తారు. నిజానికి కాస్త పరిశీలిస్తే అసలు బంగారాన్ని, నకిలీ బంగారాన్ని గుర్తించడం ఎవరికైనా పెద్ద కష్టమేమీకాదు.మెరిసీ ప్రతీదీ బంగారం కాదు పసుపు రంగులో కనిపించే ప్రతిదీ బంగారం కాదు. బంగారం పెద్దగా మెరవదు. నిజమైన బంగారం అందమైన మృదువైన పసుపు రంగులో ఉంటుంది. ఎరుపు రంగు కలిసిన పసుపు రంగులో ఉన్నా, బాగా మెరుస్తున్నా అనుమానించాలి.హాల్‌మార్క్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ జారీ చేసే హాల్‌మార్క్ ధృవీకరణను తనిఖీ చేయడం. బ్రాండ్: కొన్ని రకాల బ్రాండ్లు నాణ్యతకు మారుపేరుగా ఉంటాయి. అలాంటి బ్రాండ్స్‌కి చెందిన లోగో, పేరు, అక్షరాలను శ్రద్దగా గమనించాలి. గోల్డ్ మాగ్నెట్ టెస్ట్: నకిలీ బంగారం లేదా బంగారు మిశ్రమాలు తక్షణమే అయస్కాంతానికి ఆకర్షితులవుతాయి. ఇది అంతర్లీన లోహం యొక్క నిజమైన స్వభావాన్ని వెల్లడిస్తుంది. ఇది బంగారంతో చేసినది కాదు లేదా దానిలో కొద్ది శాతం మాత్రమే అని అర్థం చేసుకోవాలి. స్వచ్ఛమైన బంగారంలో అయస్కాంత మూలకాలు ఉండవు. యాసిడ్‌ టెస్ట్‌ : వివిధ కెమికల్స్ యాసిడ్‌ని కూడా బంగారాన్ని గుర్తించడానికి ఉపయోగిస్తారు. బంగారు ఆభరణాల నైట్రిక్ టెస్ట్ చేయడానికి, బంగారంపై కొన్ని చుక్కల నైట్రిక్ యాసిడ్ వేయండి. ఆభరణాల రంగులో మార్పు రాకపోతే, అది బంగారం అని నమ్మవచ్చు.మెటీరియల్‌ని, రాళ్లను బాగా పరిశీలించడం: ఆభరణాల్లో ఉపయోగించి మెటల్స్‌పై చాలా శ్రద్ధ వహించాలి. అలాగే ఆభరణంలోని రాళ్లను, స్ఫటికాలను నిశితంగా గమనించాలి. ఇమిటేషన్‌ జ్యుయల్లరీ బరువును గమనించాలి. ఫినిషింగ్‌ చెక్‌ చేయాలి, పేలవమైన ఫినిషింగ్ లేదా అంచులు గరుకుగా ఉన్నా అనుమానించాలి.తక్కువ ధర అని మభ్య పెట్టినా: బంగారు ఆభరణాలను తక్కువ ధరకే ఇస్తున్నాం అంటే ఖచ్చితంగా అనుమానించాలి. నిజా నిజాలను, నాణ్యత, బరువును నిర్ధారించుకోవాలి. తొందరపడి అస్సలు మోసపోకూడదు.

Bollywood actor Kartik Aaryan charging Rs 40 cr per film?
రూ.1 కోటి నుంచి రూ.40 కోట్లు తీసుకునే స్థాయికి.. హీరో ఏమన్నాడంటే?

బాలీవుడ్‌ హీరో కార్తీక్‌ ఆర్యన్‌ 2011లో 'ప్యార్‌ కా పంచనామా' సినిమాతో హీరోగా కెరీర్‌ ఆరంభించాడు. ఇప్పటివరకు సుమారు 16 చిత్రాల్లో నటించాడు. డిఫరెంట్‌ స్క్రిప్టులు ఎంచుకుంటూ తనకంటూ ఓ స్టార్‌డమ్‌ తెచ్చుకున్నాడు. కేవలం ఐదేళ్లలోనే రూ.1 కోటి తీసుకునే స్థాయి నుంచి ఏకంగా రూ.40 కోట్లు తీసుకునే స్థాయికి ఎదిగాడని బీటౌన్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది.ఫస్ట్‌ సినిమాకు ఎంతంటే?తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌కు హాజరైన కార్తీక్‌కు ఇదే ప్రశ్న ఎదురైంది. దీని గురించి హీరో మాట్లాడుతూ.. నా ఫస్ట్‌ మూవీ ప్యార్‌ కా పంచనామాకు నేను కోటి రూపాయలు తీసుకోలేదు. నా పారితోషికం కనీసం లక్షల్లో కూడా లేదు. కేవలం రూ.70 వేలు మాత్రమే. పైగా అందులో టీడీఎస్‌ కట్‌ చేసుకుని రూ.63,000 ఇచ్చారు అని బదులిచ్చాడు. ఆ సినిమా తర్వాతే..పోనీ.. 2018లో వచ్చిన సోనూకీ టిటు కి స్వీటీ సినిమాకు రూ.1 కోటి అందుకున్నావా? అని యాంకర్‌ రాజ్‌ శమానీ అడగ్గా.. ఆ చిత్రానికి కూడా అంత పెద్ద మొత్తం తీసుకోలేదని తెలిపాడు. సోనూ.. సినిమా తర్వాతే కాస్త ఎక్కువ పారితోషికం అందుకుంటున్నాను. కానీ ఈ ట్యాక్స్‌లు నాకు రావాల్సిన డబ్బును కొంత హరిస్తున్నాయి అని చెప్పుకొచ్చాడు. కాగా ప్రస్తుతం కార్తీక్‌ ఆర్యన్‌ చేతిలో చందూ చాంపియన్‌, భూల్‌ భులయ్యా 3 సినిమాలున్నాయి.చదవండి: డైరెక్టర్‌తో ప్రేమలో ఉన్న యంగ్ హీరోయిన్.. వీడియో వైరల్

JP Nadda's Cabinet Move, Who Is Next BJP Chief?
బీజేపీ జాతీయాధ్యక్ష పదవిపై కొనసాగనున్న సస్పెన్స్‌!

న్యూఢిల్లీ, సాక్షి: ఇటీవల కొలువు దీరిన కొత్త కేబినెట్‌లో జేపీ నడ్డాకు స్థానం దక్కింది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలూ చేపట్టారు. ఈ తరుణంలో.. బీజేపీ జాతీయాధ్యక్షుడి బాధ్యతల నుంచి ఆయన తప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నెలలో ప్రధాని మోదీ ఇటలీ పర్యటనకు వెళ్లి రానున్నారు. ఆయన వచ్చాక బీజేపీకి కొత్త అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ ప్రారంభమవుతుందని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.బీజేపీలో పార్టీ ప్రెసిడెంట్‌ ఎన్నిక అంత సులువుగా జరగదు. అందుకోసం సుదీర్ఘమైన ప్రక్రియ కొనసాగుతుంది. సాధారణంగా.. బీజేపీ పార్లమెంటరీ బోర్డు వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ను ఎన్నుకుంటుంది. అయితే.. కనీసం సగం రాష్ట్రాల్లో సంస్థాగత ఎన్నికలు ముగిశాకే జాతీయ అధ్యక్షుడి ఎన్నిక జరుగుతుంది. జులైలో మెంబర్‌షిప్‌ క్యాంపెయిన్‌ మొదలవుతుందని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ఇది కనీసం ఆరు నెలపాటు కొనసాగే అవకాశం ఉంది. ఈ లెక్కన డిసెంబర్‌-జనవరి మధ్యలో కొత్త అధ్యక్షుడి ఎన్నిక జరుగుతుంది.వాస్తవానికి జేపీ నడ్డా అధ్యక్ష కాలపరిమితి ఈ ఏడాది జనవరితోనే పూర్తైంది. అయితే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆయన కాలపరిమితిని ఈ జూన్‌ దాకా పొడిగిచింది బీజేపీ హైకమాండ్‌. ఇక బీజేపీలో వన్‌ పర్సన్‌.. వన్‌ పోస్ట్‌ పాలసీ ఉన్నప్పటికీ అది కచ్చితంగా అమలు కావడం లేదు. అయితే బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి విషయంలో మాత్రం బీజేపీ తప్పుకుండా రూల్స్‌ పాటించాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో.. కొత్త అధ్యక్షుడి ఎంపిక జరిగేదాకా నడ్డానే అధ్యక్షుడిగా కొనసాగమని బీజేపీ అధిష్టానం కోరే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఏడాది చివరికల్లా ఎన్నిక ప్రక్రియ పూర్తి అవుతుంది. కాబట్టి.. అప్పటిదాకా ఆయనే కొనసాగవచ్చని సమాచారం. దీంతో ఈ గ్యాప్‌లో పలువురి పేర్లను సైతం పరిశీలించేందుకు తమకు వీలుంటుందని హైకమాండ్‌ భావిస్తోంది.ఇక.. బీజేపీ తొలుత వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ఎన్నుకుని.. ఆ తర్వాతే పూర్తిస్థాయి అధ్యక్షుడి బాధ్యతలు అప్పజెప్తుంది. జేపీ నడ్డా ఇంతకు ముందు ఇలాగే ఎన్నుకున్నారు. 2019 జూన్‌లో జేపీ నడ్డాకు వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు అప్పజెప్పారు. ఆపై 2020 జనవరి 20 నుంచి పూర్తి స్థాయి బీజేపీ జాతీయ అధ్యక్షుడి హోదాలో ఆయన కొనసాగుతున్నారు.జేపీ నడ్డా నేపథ్యం.. జగత్‌ ప్రకాశ్‌ నడ్డా.. లాయర్ వృత్తి నుంచి క్రియాశీల రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. హిమాచల్‌ ప్రదేశ్‌ 1993 అసెంబ్లీ ఎన్నికల్లో బిలాస్‌పూర్‌ ఎమ్మెల్యేగా తొలిసారి నెగ్గారాయన. పదేళ్లపాటు ఎమ్మెల్యేగా కొనసాగిన ఆయన.. 2003 ఎన్నికల్లో మాత్రం ఓడారు. 2007లో మళ్లీ నెగ్గి మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. ఆ తర్వాత 2012లో అసెంబ్లీ ఎన్నికలకు ఆయన పోటీ చేయలేదు. అయితే సీనియర్‌ కోటాలో రాజ్యసభకు మాత్రం ప్రమోషన్‌ దక్కించుకున్నారు. 2014లో కేంద్ర మంత్రివర్గ పునర్వవ్యస్థీకరణలో భాగంగా జేపీనడ్డాకు ఆరోగ్య శాఖ దక్కింది. 2019లో అమిత్‌ షా కేంద్ర మంత్రి వర్గంలోకి వచ్చాక.. పార్టీ పగ్గాలు ఎవరికి అప్పజెప్పాలన్నదానిపై తర్జన భర్జనలు జరిగాయి. ఆ సమయంలో జేపీ నడ్డాకు బాధ్యతలు తప్పగించారు. ఇక.. 2024 మార్చిలో హిమాచల్‌ రాజ్యసభ సభ్యతానికి రాజీనామా చేసి.. గుజరాత్‌ రాజ్యసభ స్థానం నుంచి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మోదీ 3.0 కేబినెట్‌లో మళ్లీ ఆయనకు ఆరోగ్య మంత్రిత్వ శాఖనే దక్కింది.

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
 

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all
Advertisement