Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

AP CM YS Jagan to Visit Bobbili and Payakarao and Eluru on may 1st
నేడు సీఎం జగన్‌ ప్రచార సభలు ఇలా..

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం మూడు నియోజకవర్గాల్లో  ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం తెలిపారు. సీఎం పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ను మంగళవారం ఆయన విడుదల చేశారు.ఆ వివరాల ప్రకారం.. బుధవారం ఉదయం 10 గంటలకు  విజయనగరం లోక్‌సభ స్థానం పరిధిలోని బొబ్బిలిలో ఉన్న మెయిన్‌ రోడ్‌ సెంటర్‌లో జరిగే ప్రచార సభలో సీఎం జగన్‌ పాల్గొంటారు. మధ్యాహ్నం 12.30 గంటలకు అనకాపల్లి పార్లమెంట్‌ పరిధిలోని పాయకరావుపేటలోని సూర్య మహల్‌ సెంటర్‌లో జరిగే సభలో.. మధ్యాహ్నం 3 గంటలకు ఏలూరులోని ఫైర్‌ స్టేషన్‌ సెంటర్‌లో జరిగే ప్రచార సభలో ముఖ్యమంత్రి జగన్‌ పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు.

PM Narendra Modi Fires On CM Revanth Reddy
డబుల్‌ ఆర్‌ ట్యాక్స్‌ ఢిల్లీకి.. రేవంత్‌ను ఉద్దేశిస్తూ ప్రధాని మోదీ ఫైర్‌

కాంగ్రెస్‌ ఎన్నికల గుర్తు హస్తం... పంజా.. ఆ పార్టీ ఎక్కడ అధికారంలో ఉంటే అక్కడ అబద్ధపు వాగ్దానాలు, ఓటు బ్యాంకు రాజకీయం, నేరగాళ్లను పెంచి పోషించడం, కుటుంబపాలన, అవినీతి అనే ఐదు సూత్రాలను నమ్మి రాజకీయం చేస్తుంది. ఇప్పుడు మిమ్మల్ని దోచుకునేందుకు వారసత్వ సంపద పన్ను తీసుకురావాలని చూస్తోంది. ఇది అమలుచేస్తే మీరు జీవితాంతం కష్టపడి దాచుకున్న సొమ్ము మీ మరణం తర్వాత మీ వారసులకు ఇవ్వలేరు.  సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ ఆర్‌ ఆర్‌ (డబుల్‌ ఆర్‌) ట్యాక్స్‌ పేరుతో ప్రజలను దోచుకుంటోందని ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలుగు వా­ళ్లు తీసిన ‘ట్రిపుల్‌ ఆర్‌’ భారత్‌లోనే సూపర్‌ హిట్‌ సినిమాగా నిలిచి ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతిని సాధిస్తే... తెలంగాణలో ఈ ‘డబుల్‌ ఆర్‌’ యావద్దేశం సిగ్గుపడేలా చేస్తోందని మండి­పడ్డారు. ఈ ట్యాక్స్‌పై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోందని, పారిశ్రామిక వేత్తలు, వ్యాపా­రులు, కాంట్రాక్టర్ల నుంచి వసూలు చేసిన డబ్బును నల్లధనం రూపంలో ఢిల్లీకి తరలిస్తున్నారని ఆరోపించారు. ‘మీ అందరికీ ఆ డబు­ల్‌ ఆర్‌ ఎవరో తెలుసు. దానిని వివరించాల్సిన అవసరం లేదు. ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌ వసూళ్లకు కళ్లెం వేయకపోతే తెలంగాణ ప్రజలు తిరిగి కోలుకోలేనంతగా దోచేస్తారు. ఐదేళ్లలో రాష్రా­­్టన్ని నాశ­నం చేస్తారు’ అని ధ్వజమెత్తారు. దీనికి కళ్లెం ప­డాలంటే పార్లమెంట్‌ ఎన్నికల్లో 17 సీట్లలోనూ బీజేపీని గెలిపించాలని కోరారు. మంగళవారం జహీరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని చిల్వర్‌ గ్రామం (అల్లాదుర్గ్‌)లో బీజేపీ నిర్వహించిన బహిరంగసభలో ప్రధాని ప్రసంగించారు. ఈ సందర్భంగా మోదీ... ‘నా తెలంగాణ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు’ అంటూ తెలుగులో ఉపన్యాసం ప్రారంభించారు. బసమేశ్వర్, సంగమేశ్వర్, సేవాలాల్‌ మహరాజ్‌లకు నమస్కారాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్‌ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్‌. మెదక్‌ ఎంపీ అభ్యర్థి ఎం.రఘునందన్‌రావు తదితరులు పాల్గొన్నారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ ఒక్క గూటి పక్షులే..  ‘బీఆర్‌ఎస్‌ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు అతిపెద్ద స్కాం కాగా... విపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్‌ దీనిపై విచారణ జరుపుతామని చెప్పింది. కానీ అధికారంలోకి వచ్చాక ఈ కేసుకు సంబంధించిన ఫైళ్లను తొక్కి పెట్టింది. బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉండగా ఓటుకు కోట్లు కేసులో విచారణను ముందుకు సాగకుండా చర్యలు తీసుకుంది. ఈ రెండు పారీ్టలు ఒకరినొకరిని కాపాడుకోవాలని చూస్తున్నాయి. బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ ఒక్క గూటి పక్షులే.. అవి కరప్షన్‌ రాకెట్‌ కమిటీకి చెందిన సభ్యులు. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ ద్వారా ఇది అర్థమవుతోంది. బీఆర్‌ఎస్‌.. ఆప్‌తో కలిసి లిక్కర్‌ స్కామ్‌ చేసింది. ఢిల్లీలో లిక్కర్‌ స్కామ్‌ చేసిన పారీ్టతో కాంగ్రెస్‌ పొత్తు పెట్టుకుంది’ అని మోదీ ధ్వజమెత్తారు. ‘కాంగ్రెస్‌.. రైతులకు వెన్నుపోటు పొడవడానికి కూడా వెనుకాడటం లేదు. వంద రోజుల్లో రుణమాఫీ చేస్తామని చెప్పి ఇప్పటి వరకు చేయలేదు. క్వింటాల్‌ వరికి రూ.500 బోనస్‌ ఇస్తామన్నారు. ఇప్పుడు ఇవ్వకుండా, కనీసం దానిపై మాట్లాడకుండా నోటికి తాళం వేసుకున్నారు’ అని మోదీ తెలిపారు. కాంగ్రెస్‌ జన్మతః రాజ్యాంగ వ్యతిరేకి..  ‘నేను జీవించి ఉన్నంత కాలం రాజ్యాంగానికి ఏమీ జరగకుండా కాపాడుకుంటాను. రాజ్యాంగాన్ని కదిలించే వ్యక్తి, శక్తి ఎవరూ ఉండరు. కాంగ్రెస్‌కు, వాళ్ల తొత్తులు, చెంచాలకు సవాల్‌ చేస్తున్నా. దీన్ని కాపాడే బాధ్యత నేను తీసుకుంటున్నాను. దళితులు, బంజారా, ఆదివాసీలు, ఓబీసీల రిజర్వేషన్లను మతప్రాతిపదికన ముస్లింలకు ఇచ్చే ప్రయత్నాన్ని ఎట్టిపరిస్థితుల్లో జరగనివ్వను. కాంగ్రెస్‌ పార్టీ జన్మతః రాజ్యాంగ వ్యతిరేకి. మతపర రిజర్వేషన్లు వద్దని రాజ్యాంగంలో ఉంటే.. రాహుల్‌ గాంధీ ఓటుబ్యాంకు రాజకీయాల కోసం ఆ రిజర్వేషన్లను ప్రోత్సహిస్తున్నారు. మోదీకి రాజ్యాంగమంటే పవిత్రగ్రంథం, రాజ్యాంగం రచించి 60 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గుజరాత్‌ సీఎంగా ఏనుగుపై రాజ్యాంగాన్ని ఊరేగించాను. నేను కింద నడిచాను. 2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టడానికి ముందే ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి ప్రతీక అయిన పార్లమెంట్‌ భవనం ఎదుట సాష్టాంగ ప్రణామం చేశాను. రాజవంశీయులు (నెహ్రూ, ఇందిరాగాంధీ కుటుంబం) అధికార దాహంతో రాజ్యాంగాన్ని అవమానించారు. వాళ్లు ఈవీఎంలు, ఎన్నికల కమిషన్‌ను కూడా నమ్మడం లేదు’ అని మోదీ ధ్వజమెత్తారు.  ఫేక్‌ వీడియో సృష్టించి లబ్ధి పొందాలని చూస్తున్నారు... ‘ఈ ఎన్నికల్లో ఓడిపోతామని భావించి కాంగ్రెస్‌ నాయకులు రిజర్వేషన్లపై ఫేక్‌ వీడియో సృష్టించి లబ్ధి పొందాలని చూస్తున్నారు. ఓటు బ్యాంకు రాజకీయాలతో వివిధ సామాజికవర్గాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీని వెనుక డబుల్‌ ఆర్‌ ఉన్నట్లు తెలుస్తోంది. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న ఒక ముఖ్యమంత్రి ఇలా చేయొచ్చా? ఇండియా కూటమి నిరాశా నిస్పృహల్లో మునిగిపోయింది. దేశవ్యాప్తంగా ఈ కూటమికి ఈసారి ప్రతిపక్ష హోదా కూడా దక్కే పరిస్థితి లేదు. కాంగ్రెస్‌కు ఓటేస్తే అది పూర్తిగా నిష్ఫలమే. బీజేపీ ఒక్కటే వికల్పం, సంకల్పం. మీరు రఘునందన్‌ రావు, బీబీ పాటిల్‌కు ఓటు వేస్తే నేరుగా మోదీకి వేసినట్లే. తెలంగాణ అభివృద్ధికి మా ప్రభుత్వం లక్షల కోట్లు ఖర్చుచేసింది. 4 వందేభారత్‌ రైళ్లు, 40 రైల్వేస్టేషన్ల ఆధునీకరణ, మెదక్‌–ఎల్లారెడ్డి–బోధన్‌ జాతీయ రహదారిపై నిర్ణయం, సంగారెడ్డి–అకోల–నాందేడ్‌ నేషనల్‌ హైవే పూర్తి, అందోల్‌–నారాయణఖేడ్‌–జుక్కల్‌ రోడ్డులో కనెక్టివిటీ పెంపు...ఇలా ఎన్నో చర్యలు చేపట్టాం’ అని మోదీ చెప్పారు. కాంగ్రెస్‌ను ఒక్క సీట్లో గెలుపైనా అవసరమా? ‘కేంద్రం ఎన్నో ప్రయాసలకు ఓర్చి తెలంగాణ అభివృద్ధికి కృషి చేస్తుంటే... ఇక్కడ కాంగ్రెస్‌ ప్రభుత్వం సంకుచిత రాజకీయాలు చేస్తోంది. సమ్మక్క, సారక్క గిరిజన వర్సిటీ స్థాపనకు కేంద్రం చర్యలు తీసుకుంటే నేటికీ దానికి అవసరమైన భూమి ఇవ్వలేదు. మనోహరాబాద్‌–సిద్దిపేట–కోటపల్లి రైల్వేలైన్‌కు భూమి కేటాయించలేదు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్న కాంగ్రెస్‌ను ఒక్క ఎంపీ సీట్లో అయినా ప్రజలు గెలిపించాల్సిన అవసరముందా? కనీసం హైదరాబాద్‌లో పండుగ నిర్వహించుకోవాలంటే కూడా చివరకు శ్రీరామ నవమికి కూడా ఆంక్షలు పెట్టింది. ఒక వర్గం ఓట్ల కోసం ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో 2004 నుంచి 2009 వరకు కాంగ్రెస్‌కు రికార్డు స్థాయిలో ఎమ్మెల్యేలు, ఎంపీలను గెలిపించారు.. కానీ కాంగ్రెస్‌ ఏం చేసింది. గెలిచాక ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల హక్కులను కాలరాసింది. ఏపీని ఒక ప్రయోగశాలగా మార్చి ఓబీసీల రిజర్వేషన్లను ముస్లింలకు కట్టబెట్టింది. రాజ్యాంగం, రిజర్వేషన్లపై మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రజలను మోసం చేస్తోంది. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు నేను కట్టుబడి ఉన్నాను. మీ కోసం నేను పోరాడతాను’ అని చెప్పారు. నెహ్రూ కాలం నుంచి మోసం ‘కాంగ్రెస్‌ మొదటి నుంచి రాజ్యాంగాన్ని, అంబేడ్కర్‌ను గౌరవించలేదు. దేశ మొదటి ప్రధాని నెహ్రూ రాజ్యాంగాన్ని అవహేళన చేసి పెద్ద తప్పు చేశారు. ఆయన తర్వాత ఇందిరాగాంధీ తన రాజకీయ అవసరాల కోసం రాజ్యాంగానికి తూట్లు పొడిచారు. ఎమర్జెన్సీ విధించారు. రాజీవ్‌గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు మీడియా, పత్రిక స్వేచ్ఛను హరించారు. మన్మోహన్‌ సింగ్‌ కేబినెట్‌ చట్టరూపకంగా బిల్లును తెస్తే.. దాన్ని రాహుల్‌ చింపివేశారు. రాజ్యాంగానికి వారిచ్చే గౌరవమిది. రాజ్యాంగాన్నే కాదు కాంగ్రెస్‌ పార్టీ రాజ్యాంగాన్ని కూడా అవమానించి అప్పటి అధ్యక్షుడు సీతారాం కేసరిని బాత్‌రూంలో బంధించి సోనియాగాం«దీని అధ్యక్షురాలిని చేశారు. వీరికి అధికారమే సర్వస్వం’ అని మోదీ మండిపడ్డారు.  

Chandrababu copied YSRCP schemes in Andhra Pradesh
బూటకపు హామీలకు కేరాఫ్‌ బాబు

సాక్షి, అమరావతి: బూటకపు హామీలు ఇవ్వడం.. వాటిని గాలికొదిలేయడంలో కేరాఫ్‌ అడ్రస్‌ ఎవరిదంటే అందరూ చెప్పేమాట చంద్రబాబు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ అలవికాని హామీలను ఇవ్వడం, ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపడం, ఆ తర్వాత వాటిని మర్చిపోవడం ఆయనకు వెన్నుపోటుతో పెట్టిన విద్య. ఈసారి కూడా ఇదే రీతిలో చంద్రబాబు, తన దత్తపుత్రుడు పవన్‌ కళ్యాణ్‌తో కలిసి ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. ఇందులో కొత్తగా ఒక్కటంటే ఒక్క పథకం చంద్రబాబు ఆలోచనల నుంచిలో అమలవుతున్న పథకాలను యథాతథంగా కాపీ కొట్టి మక్కీకి మక్కీ దించేశారు. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఇప్పటికే అమలు చేస్తున్న పథకాలను నిస్సిగ్గుగా కాపీ కొట్టి తన మేనిఫెస్టోలో పెట్టుకోవడం చంద్రబాబుకే చెల్లిందని రాజకీయ విశ్లేషకులు, ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.  కాపీ క్యాట్‌ బాబు..  రాష్ట్రంలో ప్రజలకు రూ.25 లక్షల ఆరోగ్య బీమా అందిస్తామని చంద్రబాబు మేనిఫెస్టోలో పేర్కొన్నారు. వాస్తవానికి ఇప్పటికే వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పరిమితిని ఏకంగా రూ.25 లక్షలకు పెంచి పూర్తి స్థాయిలో అమలు చేస్తోంది. ఈ స్థాయిలో ఉచిత వైద్యాన్ని అందిస్తున్న రాష్ట్రం దేశంలోనే ఏపీ ఒక్కటే కావడం గమనార్హం. చంద్రబాబు పాలనలో కేవలం తెల్ల రేషన్‌ కార్డు ఉన్న వారికి మాత్రమే ఆరోగ్యశ్రీ పథకం అందేది.అలాంటిది అధికారంలోకి వచ్చాక సీఎం వైఎస్‌ జగన్‌ రూ.5 లక్షల్లోపు వార్షికాదాయం ఉన్న కుటుంబాలన్నింటికీ ఈ పథకాన్ని వర్తింపజేశారు. దీంతో రాష్ట్రంలో 90 శాతానికిపైగా కుటుంబాలు ఆరోగ్యశ్రీ పరిధిలోకి వచ్చాయి. వీరందరికీ రూ.25 లక్షల వరకూ వైద్య సేవలు పూర్తిగా ఉచితమే. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఇదే హామీ ఇవ్వడం వల్ల కొత్తగా ప్రజలకు వచ్చే ప్రయోజనమేముందని చర్చ జరుగుతోంది.  డిజిటల్‌ హెల్త్‌ కార్డులూ కాపీయేనా బాబు? ఆరోగ్యశ్రీ పరిమితి పెంపునే కాకుండా మరో దాన్ని కూడా చంద్రబాబు నిస్సిగ్గుగా కాపీ కొట్టి మేనిఫెస్టోలో పెట్టుకున్నారు. ఇప్పటికే వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం రాష్ట్రంలో 4.7 కోట్ల మందికిపైగా డిజిటల్‌ హెల్త్‌ కార్డులు అందజేసింది. ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రతి కుటుంబానికి స్మార్ట్‌ హెల్త్‌ కార్డులు పంపిణీ చేసింది. అధికారంలోకి వచ్చిన తొలి నాళ్లలోనే డిజిటల్‌ వైద్య సేవలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ అంశంలో దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఇప్పుడు చంద్రబాబు సైతం తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి డిజిటల్‌ హెల్త్‌ కార్డులు ఇస్తామని హామీ ఇవ్వడం పట్ల ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.    బాబు దగా మరువని ప్రజలు 2014 ఎన్నికల్లో మేనిఫెస్టోలో వైద్య ఆరోగ్య విధానం పేరిట చంద్రబాబు మొత్తం 14 హామీలు ఇచ్చి ఏ ఒక్కటీ నెరవేర్చిన పాపానపోలేదు. జిల్లాకు ఒక నిమ్స్‌ ఆస్పత్రి నిర్మాణం అంటూ దాన్ని కూడా గాలికొదిలేశారు. ఆరోగ్యశ్రీలో కొత్త వ్యాధులను చేర్చి ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో ఉచిత పరీక్షలు, చికిత్సలు, ఆపరేషన్‌ల సౌకర్యం కలి్పస్తాం అని మేనిఫెస్టోలో ప్రకటించిన బాబు కల్లబొల్లి మాటలతో ప్రజలను వంచించారు.2007లో వైఎస్సార్‌ హయాంలో 942 వ్యాధులను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెస్తే.. చంద్రబాబు ప్రభుత్వం ఎనీ్టఆర్‌ వైద్యసేవగా దానిపేరు మార్చి కేవలం 117 వ్యాధులను మాత్రమే పెంచింది. అయినా వాటికి ప్రైవేటు, కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో చికిత్స సరిగా అందని దుస్థితి ఉండేది. ఇలా అనేక బూటకపు హామీలతో 2014లో అధికారంలో వచ్చి చంద్రబాబు చేసిన దగాను ప్రజలు ఇప్పటికీ మరిచిపోలేదు.  మందులూ మక్కీకి మక్కీ కాపీ.. తాము అధికారంలోకి వస్తే బీపీ, షుగర్‌ వంటి నాన్‌ కమ్యూనికబుల్‌ వ్యాధులకు ఉచితంగా జనరిక్‌ మందులు పంపిణీ చేస్తామంటూ చంద్రబాబు మరో హామీ ఇచ్చారు.  వాస్తవానికి రాష్ట్రంలో జగన్‌ ప్రభుత్వం ఫ్యామిలీ డాక్టర్, వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్, జగనన్న ఆరోగ్య సురక్ష వంటి కార్యక్రమాలను ఇప్పటికే పూర్తి స్థాయిలో అమలు చేస్తోంది. ఈ కార్యక్రమాల్లో భాగంగా బీపీ, షుగర్, ఇతర జబ్బులున్న వారిని గుర్తించారు.బాధితులందరికీ సొంత గ్రామాలు, వార్డుల్లోనే ప్రభుత్వ వైద్యులు క్రమం తప్పకుండా ఫాలోఅప్‌ వైద్య సేవలు అందిస్తున్నారు. ఇక మంచానికి పరిమితం అయిన వారి ఇళ్ల వద్దకే వెళ్లి సేవలు అందజేస్తున్నారు. ఉచితంగా మందులూ అందిస్తున్నారు. ఒకవైపు ప్రభుత్వ వైద్యులే ప్రజల ఇంటి ముంగిటకే వెళ్లి సేవలు వైద్య సేవలు అందిస్తుంటే.. తాము అధికారంలోకి వస్తే మందులు ఉచితంగా ఇస్తామంటూ చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అంటున్నారు. 

Lucknow Super Giants win over Mumbai Indians
IPL 2024: ఉత్కంఠ పోరులో లక్నో విజయం.. ముంబై ఇక ఇంటికే!

ఐపీఎల్‌ 2024 సీజన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో మంగళవారం (ఏప్రిల్‌ 30) జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ బౌలర్లు అదరగొట్టారు.డూ ఆర్‌ డై లా జరిగిన మ్యాచ్‌లో ముంబై కేవలం నామమాత్రపు స్కోరుకే పరిమితమైంది. లక్నో సూపర్‌ జెయింట్స్‌ బౌలర్లు ముంబైకి చుక్కలు చూపించారు. వరుసగా వికెట్లు పడగొట్టడంతో పాటు పరుగులు కూడా రాకుండా కట్టడి చేశారు. ఫలితంగా ముంబై జట్టుపై నాలుగు వికెట్ల తేడాతో లక్నో సూపర్‌ జెయింట్స్‌ విజయం సాధించింది. దాంతో పాయింట్ల జాబితాలో లక్నో మూడో స్ధానానికి చేరింది. ఇక ప్లే ఆఫ్‌ అవకాశాలు ముంబై జట్టు దాదాపు కోల్పోయింది.స్కోర్లు: ముంబై 144/7, 145/6(19.2 ఓవర్లు)ముంబై ఇండియన్స్: ఇషాన్ కిషన్(వికెట్‌కీపర్‌), రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(కెప్టెన్‌), నేహాల్ వధేరా, టిమ్ డేవిడ్, మహ్మద్ నబీ, గెరాల్డ్ కోయెట్జీ, పీయూష్ చావ్లా, జస్ప్రీత్ బుమ్రాఇంపాక్ట్‌ ప్లేయర్స్‌: నువాన్ తుషార, కుమార్ కార్తికేయ, డెవాల్డ్ బ్రెవిస్, నమన్ ధీర్, షమ్స్ ములానీలక్నో సూపర్ జెయింట్స్: కేఎల్‌ రాహుల్ (కెప్టెన్‌/వికెట్‌కీపర్‌), మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, నికోలస్ పూరన్, అష్టన్ టర్నర్, ఆయుష్ బడోని, కృనాల్ పాండ్యా, రవి బిష్ణోయ్, నవీన్-ఉల్-హక్, మొహ్సిన్ ఖాన్, మయాంక్ యాదవ్ఇంపాక్ట్‌ ప్లేయర్స్‌: అర్షిన్ కులకర్ణి, మణిమారన్ సిద్ధార్థ్, కృష్ణప్ప గౌతం, యుధ్వీర్ సింగ్, ప్రేరక్ మన్కడ్

JDS suspends Prajwal Revanna from party over obscene videos
పార్టీ నుంచి ప్రజ్వల్‌ సస్పెండ్‌

బెంగళూరు: లైంగిక దౌర్జన్యం, వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కారణంగా సిట్టింగ్‌ ఎంపీ ప్రజ్వల్‌ను జేడీఎస్‌ తమ పార్టీ నుంచి సస్పెండ్‌ చేసింది. మంగళవారం హుబ్బళిలో జేడీఎస్‌ కోర్‌ కమిటీ భేటీలో పార్టీ జాతీయ అధ్యక్షుడు హెచ్‌డీ దేవెగౌడకు ప్రజ్వల్‌ సస్పెన్షన్‌పై సిఫార్సుచేసిన కొద్ది సేపటికే పార్టీ ప్రజ్వల్‌ను సస్పెండ్‌చేసింది. ‘‘ మహిళలను ప్రజ్వల్‌ లైంగికంగా వేధిస్తున్నట్లు సంబంధిత వీడియోలు సామాజిక మాధ్యమాల్లో, మీడియాలో         విస్తృతంగా షేర్‌ అవుతున్నాయి. ఆ వీడియోలు పార్టీకి, పార్టీ నాయకత్వానికి చెడ్డపేరు తెస్తున్నాయి. పార్టీ నియమావళి, క్రమశిక్షణా నిబంధనావళిని ఉల్లంఘించిన కారణంగా తక్షణం ఆయన్ను సస్పెండ్‌చేస్తున్నాం’ అని సస్పెన్షన్‌ ఉత్తర్వులో పార్టీ పేర్కొంది. కోర్‌ కమిటీ భేటీలో కర్ణాటక రాష్ట్ర జేడీఎస్‌ చీఫ్‌ హెచ్‌డీ కుమారస్వామి కూడా పాల్గొన్నారు. ‘‘ కేసు దర్యాప్తు కోసం ప్రభుత్వం నియమించిన సిట్‌ నివేదిక, ప్రభుత్వ చర్యలను బట్టి సస్పెన్షన్‌ను పొడిగిస్తామని కుమారస్వామి చెప్పారు. 

Gold And Silver Prices Hit Record Highs
ధర పెరిగినా బంగారమే

న్యూఢిల్లీ: భారత్‌ కుటుంబాల్లో బంగారానికి ఉన్న ప్రాధాన్యత తెలిసిందే. దీనిని ప్రతిబింబిస్తూ, ఈ ఏడాది జనవరి–మార్చి త్రైమాసికంలో 2023 ఇదే కాలంతో  పోలి్చతే భారత్‌ పసిడి డిమాండ్‌ 8 శాతం పెరిగి 136.6 టన్నులకు (ఆభరణాలు, పెట్టుబడులు) పెరిగింది. ధర తీవ్రంగా ఉన్నా ఈ స్థాయి డిమాండ్‌ నెలకొనడం గమనార్హం. సమీక్షా కాలంలో త్రైమాసిక సగటు ధర  (దిగుమతి సుంకం, జీఎస్‌టీ మినహా) 10 గ్రాములకు రూ.49,943.80 నుంచి రూ.55,247.20కి ఎగసింది.  ఇక భారత్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) ఇదే కాలంలో ఏకంగా 19 టన్నులు కొనుగోలు చేసింది. 2023 క్యాలెండర్‌ ఇయర్‌ మొత్తంలో ఆర్‌బీఐ కొనుగోళ్లు 16 టన్నులే కావడం గమనార్హం. తాజా ‘క్యూ1 2024, గోల్డ్‌ డిమాండ్‌ ట్రెండ్స్‌ నివేదికలో  ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) ఈ అంశాలను తెలిపింది.ప్రపంచ వ్యాప్తంగా 3 శాతం అప్‌ మార్చి త్రైమాసికంలో ప్రపంచ పసిడి డిమాండ్‌ 3% పెరిగి 1,238 టన్నులకు చేరింది. 2016 తర్వాత ఈ స్థాయి డిమాండ్‌ పటిష్టత ఇదే తొలిసారి. సగటు త్రైమాసిక ధర ఔన్స్‌కు (31.1 గ్రాములు) 2,070 డాలర్లు. వార్షికంగా ఈ రేటు 10% అధికమైతే, త్రైమాసికంగా  5 % ఎక్కువ. సెంట్రల్‌ బ్యాంకులు తమ హోల్డింగ్స్‌ను ఈ కాలంలో 290 టన్నులు పెంచుకున్నాయి.  ∗ మార్చి త్రైమాసికంలో భారత్‌ పసిడి డిమాండ్‌ విలువ రూపాయల్లో వార్షిక ప్రాతిపదికన 20 శాతం పెరిగి రూ.75,470 కోట్లకు చేరింది.∗సమీక్షా కాలం మొత్తం పసిడి డిమాండ్‌లో ఆభరణాల డిమాండ్‌ 4 శాతం పెరిగి 95.5 టన్నులకు చేరగా, పెట్టుబడుల (కడ్డీలు, నాణేల వంటివి) విలువ 19 శాతం పెరిగి 41.1 టన్నులుగా నమోదైంది.∗ విలువల్లో చూస్తే ఆభరణాలకు డిమాండ్‌ 15% పెరిగి రూ.52,750 కోట్లకు చేరింది. పెట్టుబడుల్లో  విలువ 32% పెరిగి రూ.22,720కి ఎగసింది. ∗ మార్చి త్రైమాసికంలో పసిడి దిగుమతులు 25 % పెరిగి 179.4 టన్నులుగా నమోదయ్యాయి.  ∗గోల్డ్‌ రీసైక్లింగ్‌ విలువ 10% పెరిగి 38.3 టన్నులుగా నమోదైంది.∗2024లో 700 నుంచి 800 టన్నుల కొనుగోళ్లు జరుగుతాయన్నది అంచనా. 

BJP vs Congress party in Haryana
కూటముల కురుక్షేత్రం

కురుక్షేత్ర యుద్ధాన్ని తలదన్నే రాజకీయాలకు హరియాణా ఆలవాలం. కుల సమీకరణాలు, పొత్తులు, కూటములు, వేరుకుంపట్లు ఇక్కడ పరిపాటి. జాతీయ పార్టీలతో పాటు ఒకప్పుడు చక్రం తిప్పిన ప్రాంతీయ పార్టీలూ రాజకీయంగా కీలక పాత్ర పోషిస్తున్నాయి.రెండు దశాబ్దాలుగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకే లోక్‌సభ ఎన్నికల్లోనూ ఆధిపత్యం లభిస్తూ వస్తోంది. 2005 నుండి 2014 దాకా కాంగ్రెస్‌ చక్రం తిప్పగా పదేళ్లుగా బీజేపీ పట్టు బిగించింది. గత ఎన్నికల్లో సింగిల్‌గా పోటీ చేసి 10 సీట్లను క్లీన్‌స్వీప్‌ చేసిన కమలనాథులను రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు కలవరపెడుతున్నాయి. గత ఎన్నికల్లో సున్నా చుట్టిన కాంగ్రెస్‌ ఈసారి ఇండియా కూటమి రూపంలో కాషాయ పార్టీని ఢీకొడుతోంది... – సాక్షి, నేషనల్‌ డెస్క్‌ఇండియా కూటమి, ప్రాంతీయ పార్టీలు సై... రైతు సమస్యలు తదితరాలతో రాష్ట్రంలో ఉక్కిరిబిక్కిరి అవుతున్న బీజేపీపై కాంగ్రెస్‌ నేతృత్వంలోని ఇండియా కూటమి రెట్టించిన ఉత్సాహంతో పోరాడుతోంది. పొత్తులో భాగంగా 9 సీట్లలో కాంగ్రెస్, ఒకచోట ఆప్‌ పోటీ చేస్తున్నాయి. మాజీ సీఎం భూపిందర్‌ సింగ్‌ హుడా సారథ్యంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో 31 సీట్లతో బలమైన ప్రతిపక్షంగా నిలిచిన కాంగ్రెస్‌ ఈసారి ఎలాగైనా సత్తా చాటాలని పట్టుదలగా ఉంది.ధరల పెరుగుదల, కార్పొరేట్లతో మోదీ కుమ్మక్కు, విపక్షాలపై వేధింపులు, నిరుద్యోగం తదితరాలను ఇండియా కూటమి ప్రచారా్రస్తాలుగా చేసుకుంది. రైతు ఆందోళనలకు మద్దతుతో పాటు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)కు చట్టబద్ధత హామీలను మేనిఫెస్టోలో చేర్చడం కలిసొస్తుందని ఆశపడుతోంది. ఐఎన్‌ఎల్‌డీ, జేజేపీ కూడా ఒంటరిగా పోటీ చేస్తూ జాతీయ పార్టీలకు సవాలు విసురుతున్నాయి.అయితే జేజేపీ హరియాణా రాష్ట్ర చీఫ్‌ నిషాన్‌ సింగ్‌ ఎన్నికల వేళ పార్టీకి గుడ్‌బై చెప్పి షాకిచ్చారు. కాంగ్రెస్‌ నుంచి బీజేపీలో చేరిన కార్పొరేట్‌ దిగ్గజం నవీన్‌ జిందాల్‌ కురుక్షేత్రలో ఆప్‌ నేత సుశీల్‌ గుప్తాతో తలపడుతున్నారు. అది హాట్‌ సీట్‌గా అందరినీ ఆకర్షిస్తోంది. 2004, 2009ల్లో కాంగ్రెస్‌ తరఫున ఇక్కడ గెలిచిన జిందాల్‌ 2014లో బీజేపీ చేతిలో ఓడారు. 2019లో పోటీకి దూరంగా ఉన్నారు.బీజేపీకి కొత్త కష్టాలు...2014 లోక్‌సభ ఎన్నికల్లో 7 సీట్లు గెలిచిన ఊపులో ఆ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ సొంతంగా మెజారిటీ సాధించింది. మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ సీఎం అయ్యారు. 2019లో 10 లోక్‌సభ సీట్లూ నెగ్గినా అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్‌ పుంజుకోవడంతో హంగ్‌ వచ్చింది. అయినా జేజేపీ, స్వతంత్రుల మద్దతుతో బీజేపీ మళ్లీ గద్దెనెక్కింది. జేజేపీ చీఫ్‌ దుష్యంత్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టింది. ప్రభుత్వ వ్యతిరేకతతో బీజేపీకి కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి.లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై విభేదాలతో బీజేపీ, జేజేపీ పొత్తుకు తెరపడింది. దాంతో ఖట్టర్, దుష్యంత్‌ రాజీనామా చేశారు. ఎన్నికల ముందు ఓబీసీ వర్గానికి చెందిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయాబ్‌ సింగ్‌ సైనీ సీఎం అయ్యారు. తాజాగా వెల్లువెత్తిన రైతు ఆందోళనలూ బీజేపీకి ప్రతికూలంగా మారొచ్చని భావిస్తున్నారు. మోదీ కరిష్మా, అయోధ్య రామమందిర నిర్మాణం, హిందుత్వ నినాదం తదితరాలనే పార్టీ నమ్ముకుంది.ప్రాంతీయ పార్టీల్లో చీలికలు... ఐఎన్‌ఎల్‌డీ వ్యవస్థాపకుడు, హరియాణా సీఎంగా, ఉప ప్రధానిగా చేసిన చౌదరి దేవీలాల్‌ అనంతరం పార్టీ పగ్గాలు చేపట్టిన కుమారుడు ఓం ప్రకాశ్‌ చౌతాలా నాలుగుసార్లు సీఎం అయ్యారు. ఉద్యోగ నియామకాల కుంభకోణంలో ఆయన, అవినీతి కేసుల్లో పెద్ద కుమారుడు అజయ్‌ సింగ్‌ చౌతాలా జైలుకెళ్లారు. దాంతో రెండో కుమారుడు అభయ్‌ సింగ్‌ చౌతాలా పార్టీ పగ్గాలు చేపట్టారు. అన్నదమ్ముల కుమ్ములాటతో పార్టీ చీలిపోయింది.అజయ్‌ సింగ్‌ కుమారులైన దుష్యంత్‌ చౌతాలా, దిగ్విజయ్‌ చౌతాలాను పార్టీ నుంచి తొలగించారు. దాంతో తండ్రి, సోదరునితో కలిసి దుష్యంత్‌ జననాయక్‌ జనతా పార్టీ (జేజేపీ)ని స్థాపించారు. జేజేపీ గత లోక్‌సభ ఎన్నికల్లో ఆప్‌తో కలిసి పోటీ చేసినా ఒక్క సీటూ దక్కలేదు. అభయ్‌ సారథ్యంలోని ఐఎన్‌ఎల్‌డీ కూడా ప్రభావం చూపలేకపోయింది.2014లో హరియాణా జనహిత్‌ కాంగ్రెస్‌ (హెచ్‌జేసీ–బీఎల్‌) తో పొత్తు పెట్టుకున్న బీజేపీకి పెద్దగా ప్రయోజనం లభించలేదు. బీజేపీ 8 స్థానాల్లో పోటీ చేసి ఏడింటిని దక్కించుకోగా మూడు చోట్ల పోటీ చేసిన హెచ్‌జేసీకి ఒక్క సీటూ దక్కలేదు. హరియాణా లో మూడుసార్లు కాంగ్రెస్‌ ముఖ్యమంత్రిగా పని చేసిన భజన్‌లాల్‌ 2007లో కుమారుడు కుల్దీప్‌ బిష్ణోయ్‌తో కలిసి ఈ పార్టీని స్థాపించారు. 2016లో కాంగ్రెస్‌లో విలీనం చేశారు.పోలింగ్‌ తేదీ: మే 25 సర్వేలు ఏమంటున్నాయి?!బీజేపీ 8, ఇండియా కూటమి 2 సీట్లలో గెలుస్తాయని తాజా ఎన్నికల సర్వేలు అంచనా వేశాయి. సీఎం మార్పు, ప్రభుత్వ వ్యతిరేకత, రైతు ఆందోళనలు, తదితర పరిణామాలు కమలనాథుల జోరుకు కళ్లెం వేస్తాయని మరికొందరు రాజకీయ పండితులు అంటున్నారు.హరియాణా రాజకీయాలు జాతీయ, ప్రాంతీయ పార్టీల ఎత్తుజిత్తుల నడుమ సాగుతున్నాయి. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఏడు సీట్లు గెలిచిన బీజేపీ 2019లో ఒంటరిగా పోటీ చేసి మొత్తం 10 సీట్లూ ఒడిసిపట్టింది. కాంగ్రెస్‌కు ఒక్క సీటూ దక్కలేదు. ప్రాంతీయ పార్టీ ఇండియన్‌ లోక్‌దళ్‌ (ఐఎన్‌ఎల్‌డీ) 2014లో గెలిచిన 2 సీట్లనూ పోగొట్టుకుంది.   

Young people to music streaming platforms
సెల్ఫ్‌–మేడ్‌ మ్యూజిక్‌ స్టార్స్‌

యువ సంగీతాభిమానులకు అచ్చంగా సరిపోయే మాట... మ్యూజిక్‌ మేక్స్‌ ఎవ్రీ థింగ్‌ బెటర్‌. ఇట్టే మరిచిపోయే లక్షణం నుంచి జ్ఞాపకశక్తి పెరగడం వరకు, క్రియేటివిటీని ఎంజాయ్‌ చేయడం నుంచి క్రియేటివ్‌ పవర్‌ పెంచుకోవడం వరకు, జడత్వం నుంచి నిత్యజీవనోత్సాహం వెల్లివిరియడం వరకు, అనామకత్వం నుంచి ప్రపంచం గుర్తించే స్థాయికి ఎదగడం వరకు ఎన్నోరకాలుగా సంగీతం యువతకు బలం అయింది. సంగీత రత్నాలను వెదుకుతూ మ్యూజిక్‌ స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌లలోకి అడుగు పెట్టిన యువతరం ఆ ప్లాట్‌ఫామ్‌లలోనే మ్యూజిక్‌ స్టార్‌లుగా మెరవడం ఈ తరంలో కనిపిస్తున్న ప్రత్యేకత.∗ స్పాటిఫైతో ప్రయాణం ప్రారంభించి స్టార్‌గా ఎదిగిన ఆర్టిస్ట్‌లలో జస్లీన్‌ రాయల్‌ ఒకరు. సింగర్, సాంగ్‌ రైటర్, కంపోజర్‌గా మంచి పేరు తెచ్చుకుంది. హిట్‌ బాలీవుడ్‌ ట్రాక్స్‌ కంపోజ్‌ చేసింది. ‘ప్రపంచ ప్రేక్షకులతో కనెక్ట్‌ కావడానికి, శ్రోతల అభిప్రాయాలను తెలుసుకొని అందుకు అనుగుణంగా మ్యూజిక్‌ కంపోజింగ్‌లో మార్పులు చేయడానికి స్పాటిఫై ఉపయోగపడింది’ అంటుంది జస్లీన్‌ రాయల్‌.∗ ఆరు సంవత్సరాల వయసులో పాటల కోసం గొంతు సవరించింది బెంగళూరుకు చెందిన దియా వదిరాజ్‌. రకరకాల మ్యూజిక్‌ జానర్‌లలో టాలెంటెడ్‌ సింగర్‌గా పేరు తెచ్చుకుంది. కోల్‌కతాకు చెందిన రనితా బెనర్జీ అయిదు సంవత్సరాల వయసులో ‘సింగింగ్‌ స్టార్‌’ షోలో పాల్గొంది. ‘స రే గ మ ప’ లిటిల్‌ ఛాంప్స్‌లో ఫస్ట్‌ రన్నర్‌–అప్‌గా నిలిచింది. ‘స్వీట్‌ వాయిస్‌’ రనిత గొంతు నుంచి వచ్చిన ‘జరాసీ ఆహట్‌’ పాట 6.2 మిలియన్‌ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది.∗ మల్టీ టాలెంటెడ్‌ సింగర్‌గా పేరు తెచ్చుకుంది అంకిత కుందు. రియాల్టీ షోలలో పాడడం ద్వారా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. బిహార్‌కు చెందిన మిథాలీ ఠాకూర్‌ ‘రైజింగ్‌ స్టార్‌’ షోతో ఫేమ్‌ అయింది. భోజ్‌పూరి, క్లాసికల్, ఫోక్‌ సాంగ్స్‌ను పాడడంలో మంచి పేరు తెచ్చుకుంది. యూట్యూబ్‌లో ఆమె వీడియోలు మిలియన్‌ల వ్యూస్‌ను సొంతం చేసుకున్నాయి. ఇండియన్‌–అమెరికన్‌ సింగర్, సాంగ్‌ రైటర్‌ లిశా మిశ్రా పాటలను రికార్డ్‌ చేసి యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేసేది. బాలీవుడ్‌ సినిమాలలో కూడా పాడింది. ఇండియన్‌ ఐడల్‌ జూనియర్‌గా 2015లో సంగీత ప్రపంచానికి పరిచయం అయింది భువనేశ్వర్‌కు చెందిన అనన్య నందా. బాలీవుడ్‌ పాటల్లోనే కాదుక్లాసికల్‌లోనూ మంచి పేరు తెచ్చుకుంది. మెలోడియస్‌ వాయిస్‌తో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తోంది.∗ బోస్టన్‌ (యూఎస్‌)లో పుట్టిన అవంతి నగ్రల్‌కు చిన్నప్పటి నుంచి సంగీతం అంటే ఇష్టం. ముంబైకి వచ్చిన తరువాత తన పాషన్‌నే కెరీర్‌గా చేసుకుంది. మ్యూజిక్‌లో రకరకాల జానర్స్‌ను మిక్స్‌ చేయడంలో గట్టి పట్టు సాధించిన అవంతికి యూట్యూబ్‌ చానల్‌ కూడా ఉంది. ఇందులో తన లైవ్‌ పర్‌ఫార్‌మెన్స్‌ వీడియోలను అప్‌లోడ్‌ చేస్తుంది. అవంతికి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు.∗ ఆర్‌ అండ్‌ బీ, హిప్‌–హాప్, సోల్, పాప్‌ మ్యూజిక్‌లలో బహుముఖ ప్రజ్ఞ చాటుకుంటోంది ఇలీన హ్యాట్స్‌. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రదర్శనలు ఇచ్చింది. ముంబైకి చెందిన సాచి రాజాధ్యక్ష ఆల్ట్‌–పాప్‌ మ్యూజిక్‌లో అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకుంది. ఆమె పవర్‌ఫుల్, సోల్‌ వాయిస్‌కు ఎంతోమంది అభిమానులు ఉన్నారు.∗ దియ నుంచి అవంతి వరకు ఎందరో, ఎందరెందరో యంగ్‌ మ్యూజిషియన్స్‌ సంగీతం పట్ల అంకితభావంతో సెల్ఫ్‌–మేడ్‌ సూపర్‌స్టార్‌లుగా ఎదిగారు. ఎంతోమంది ఔత్సాహికులకు రోల్‌ మోడల్స్‌గా మారారు. 

Sakshi Editorial On Prajwal Revanna Deve Gowda
సిగ్గూ ఎగ్గూ లేని తెంపరితనం

దేశమంతా నివ్వెరపోయిన వివాదం ఇది. ఘన కుటుంబ వారసత్వం... దేశంలోని అత్యున్నత ప్రజా ప్రాతినిధ్య వేదికైన పార్లమెంట్‌లో సభ్యత్వం... ఇవేవీ మనిషిలోని మకిలినీ, మృగాన్నీ మార్చలేక పోయిన విషాదం ఇది. మాజీ ప్రధాని దేవెగౌడ మనుమడూ, ఆయన తదనంతరం కర్ణాటకలో హసన్‌ నుంచి పార్లమెంట్‌కు ఎన్నికైన యువకుడూ అయిన ప్రజ్వల్‌ రేవణ్ణ నిస్సహాయులైన పలువురు స్త్రీలతో సాగించిన బలవంతపు లైంగిక చర్యల వ్యవహారం సభ్యసమాజాన్ని తలదించుకొనేలా చేస్తోంది. ఏప్రిల్‌ 26 నాటి లోక్‌సభ పోలింగ్‌కు కొద్దిరోజుల ముందు ఆ వికృత వీడియోలు వందల కొద్దీ బయటకు రావడం సొంత కుటుంబపార్టీ జేడీ(ఎస్‌)ను సైతం ఆత్మరక్షణలో పడేసింది. అన్నిటికీ మించి సామాన్యులకు రక్షకులమంటూ ప్రజాప్రతినిధులుగా ఎన్నికైనవారే చివరకు భక్షకులుగా తయారవుతున్న రాజకీయ విలువల పతనానికి ఈ వ్యవహారం మరో నగ్నసాక్ష్యంగా నిలిచింది. 2019 నుంచి 2022 మధ్య పలుమార్లు తనను ప్రజ్వల్‌ రేవణ్ణ లైంగికంగా బలవంతం చేశారంటూ బాధితురాలు ఒకరు ఆరోపించారు. పనివారి నుంచి పార్టీ కార్యకర్తలు, ప్రభుత్వ ఉద్యోగినుల దాకా పలువురితో ఈ మాజీ ప్రధాని మనుమడు ఇంట్లో, ఆఫీసులో ఇలానే వ్యవహరించారట. వాటిని స్వయంగా రికార్డ్‌ చేసి, బ్లాక్‌మెయిల్‌ చేస్తూ వచ్చారట. దాదాపు 3 వేల వీడియోలతో కూడిన ఆ వికృత చర్యల పెన్‌డ్రైవ్‌ ఇప్పుడు బయటపడింది. నిజానికి, ప్రజ్వల్‌ అకృత్య వీడియోల కథ కొత్తదేమీ కాదు. ఆయన వీడియోలు అనేకం కొన్నేళ్ళ క్రితమే బయటకొచ్చాయి. వాటి ప్రచురణ, ప్రసారాల్ని అడ్డుకొనేందుకు ఈ 33 ఏళ్ళ యువనేత అప్పట్లోనే కోర్టుకెళ్ళారు. మీడియా చేతులు కట్టేస్తూ హైకోర్టు నుంచి నిషేధపుటుత్తర్వులు తెచ్చుకున్నారు. తీరా ఇప్పుడు ఓ బాధితురాలు ముందుకొచ్చి ఫిర్యాదు చేయడంతో మరోసారి తేనె తుట్టె కదిలింది. ప్రత్యర్థి పార్టీ ప్రభుత్వం దాన్ని అందిపుచ్చుకొంది. ఈ మురికి చేష్టల కేసుపై ముగ్గురు సభ్యులతో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) ఏర్పాటుచేసింది. ప్రజ్వల్‌ వివాదంలో రాజకీయాలున్నాయనే మాట వినిపిస్తున్నది అందుకే!వీడియోలు అయిదేళ్ళ పాతవనీ, బాధిత మహిళలకు న్యాయం చేసే ఉద్దేశమే నిజంగా ఉంటే, ఈ పార్లమెంట్‌ సభ్యుడి లైంగిక దుష్ప్రవర్తనపై సాక్ష్యాలు చాలాకాలంగా ఉన్నా కర్ణాటకలోని కాంగ్రెస్‌ సర్కార్‌ ఎందుకు చర్యలు తీసుకోలేదు? ప్రస్తుత ఎన్నికల సమయంలోనే ఈ అస్త్రం ఎందుకు బయటకు తీసింది? ఇవీ బీజేపీ ప్రశ్నలు. బాధితురాలు కేసు పెట్టడం, వీడియోల వివాదాన్ని మీడియా బట్టబయలు చేయడంతో చట్టం తన పని తాను చేసుకుపోతోందన్నది అధికార కాంగ్రెస్‌ జవాబు. ఆరోపణల పర్వమెలా ఉన్నా, నిందితుడు ప్రజ్వల్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న జెడీ(ఎస్‌), అలాగే దానితో పొత్తుపెట్టుకున్న బీజేపీలు నష్టనివారణ చర్యలు చేపట్టక తప్పలేదు. బీజేపీ అగ్రనేత – సాక్షాత్తూ కేంద్ర హోమ్‌ మంత్రి అమిత్‌ షా సైతం ఈ వివాదాస్పద వీడియోలను ఖండిస్తూ, నారీశక్తినే తాము బలపరుస్తున్నామని మంగళవారం వివరణనివ్వాల్సి వచ్చింది. ప్రజ్వల్, అతని తండ్రి రేవణ్ణ విడిగా ఉంటారనీ, తమ కుటుంబంతో సంబంధం లేదనీ నిందితుడి బాబాయ్, మాజీ సీఎం కుమారస్వామి అనాల్సి వచ్చింది. ఈ సెక్స్‌ వీడియోల వివాదం ప్రభావం ఎన్నికల్లో తమ పార్టీపై పడకుండా చూడాలనే తాపత్రయం తెలుస్తూనే ఉంది. చివరకు, ‘సిట్‌’ దర్యాప్తు పూర్తయ్యే వరకు ప్రజ్వల్‌ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్టు కుమారస్వామి ప్రకటించడం అనివార్యమైంది. ప్రజ్వల్‌ రేవణ్ణ కేసు ఏదో నూటికో, కోటికో జరిగిన ఘటన అనుకుంటే పొరపాటే. రాజకీయ బలిమిని చూసుకొని కన్నూమిన్నూ కానని కొందరు... బలవంతపు లైంగిక చర్యలు, దాడులకు పాల్పడుతున్న కేసులు అనేకం వెలుగులోకి వస్తున్నాయి. ఈ బడాబాబులు అధికారాన్నీ, హోదానూ అడ్డుపెట్టుకొని ఈ కేసుల నుంచి ఒంటి మీద దుస్తులు నలగకుండా బయటకు వచ్చేస్తున్నారు. మహిళా రెజ్లర్లతో లైంగికంగా అనుచిత రీతిలో వ్యవహరిస్తూ వచ్చిన బీజేపీ నేత బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌ సింగ్‌ కేసు అంతర్జాతీయంగానూ వార్తల్లో నిలిచినా, ఇప్పటి దాకా అతీగతీ లేదు. బాధితులకు ఇప్పటికీ న్యాయం దక్కలేదు. సందీప్‌ సింగ్, ఖజన్‌ సింగ్‌ లాంటి పలువురు నేతల కేసుల కథ కూడా అంతే. గమ్మత్తేమిటంటే, గతంలోనే ఆరోపణలు ఎదుర్కొన్న ప్రజ్వల్‌ హైకోర్ట్‌ ‘గ్యాగ్‌’ ఉత్తర్వులను అడ్డం పెట్టుకొని, దర్జాగా గడిపేశాడు. సిగ్గుమాలిన నేరచర్యలు యథేచ్ఛగా కొనసాగించాడు. కర్ణాటక రాష్ట్ర మహిళా కమిషన్‌ ఫిర్యాదు మేరకు ఇప్పుడు ప్రభుత్వం తాజాగా దర్యాప్తు చేపట్టడంతో కష్టాలు తప్పలేదు. పోలింగైన వెంటనే గుట్టుచప్పుడు కాకుండా విదేశాలకు ఉడాయించాడు.  ప్రజ్వల్‌ వ్యవహారశైలి, అతని వీడియోల పెన్‌డ్రైవ్‌పై స్థానిక బీజేపీ నేత ఒకరు గత డిసెంబర్‌లోనే తన పార్టీని అప్రమత్తం చేశారు. జేడీ(ఎస్‌)తో పొత్తునూ, హసన్‌లో ప్రజ్వల్‌ అభ్యర్థిత్వాన్నీ వ్యతిరేకించారు. అన్నీ తెలిసినా బీజేపీ ముందుకెళ్ళి పొత్తు కొనసాగించడం, ప్రజ్వల్‌కు మద్దతుగా ఆ పార్టీ అధినాయకత్వం స్వయంగా ఎన్నికల ప్రచారం చేయడం విడ్డూరం. నారీశక్తికి వందనమంటూ కబుర్లు చెప్పి, మహిళా ఓటర్లను ప్రసన్నం చేసుకొనేందుకు తంటాలు పడే పార్టీలు, ప్రతినిధులు ఆడ వారికి ఇస్తున్న అసలైన గౌరవం అంతంత మాత్రమే. పితృస్వామ్య భావజాలంతో స్త్రీని భోగ వస్తువుగా చూసే సంస్కృతి నుంచి ఇవాళ్టికీ మన సమాజం, నేతలు బయటపడనే లేదన్న చేదు నిజం పదే పదే రుజువవుతోంది. చివరకు తాజా లోక్‌సభలో మహిళా ప్రాతినిధ్యం సైతం 15 శాతం లోపలే అన్నది మన మహిళా సాధికారత మాటల్లోని డొల్లతనానికి నిదర్శనం. ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. అధికారం మాటేమో కానీ, ముందుగా వారిని సుఖభోగ యంత్రాలుగా భావించడం మాని, మనుషులుగా గుర్తించాలి. ప్రజ్వల్‌ సహా కళంకిత నేతల్ని కఠినంగా శిక్షించడం ఆ క్రమంలో తొలి అడుగు.  

Veteran actor Krishna Alluri Sitaramaraj 50 years completes in tollywood
అల్లూరికి అర్ధ శతాబ్దం

‘మా మన్యం దొర సీతారామరాజు వచ్చాడు’.... ప్రజల్లో సంబరం. దొరకు పాదాభివందనం చేశారు. కానీ... అతను నిజమైన దొర కాదు. మన్యం దొర  అల్లూరి సీతారామ రాజు గెటప్‌ వేసుకున్న నటుడు. అప్పటికి నిజమైన అల్లూరి సీతారామరాజుని చూసిన కొందరు వృద్ధులు లొకేషన్లో ఆ గెటప్‌లో ఉన్న నటుడికి పాదాభివందనం చేశారు. వెండితెరపై సీతారామరాజుగా కనిపించక ముందే అలా షూటింగ్‌ లొకేషన్లో ప్రజల చేత ‘భేష్‌’ అనిపించుకున్నారు కృష్ణ. అల్లూరి సీతారామరాజు గెటప్‌ అంటే కృష్ణ తప్ప వేరే ఏ నటుడికీ నప్పదు అనేంతగా ఆ పాత్రలో ఒదిగిపోయారు సూపర్‌ స్టార్‌. 1974 మే 1న విడుదలైన ‘అల్లూరి సీతారామరాజు’ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ చిత్రం యాభై ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కొన్ని విశేషాలు తెలుసుకుందాం... ఎన్టీఆర్‌ హీరోగా నటించిన ‘అగ్గిరాముడు’ సినిమా 1954 ఆగస్టు 5న విడుదలైంది. బుర్రిపాలెంకు చెందిన కృష్ణ తెనాలిలో ఆ సినిమా చూశారు. అందులో అల్లూరి గురించి బుర్రకథగా చెప్పే సీన్‌ కృష్ణను ఆకట్టుకుంది. ఆ తర్వాత ఎన్టీఆర్‌ నటించిన ‘జై సింహ’ని కూడా చూశారు కృష్ణ. ఆ సినిమా పాటల పుస్తకం చివరి పేజీలో ఎన్టీఆర్‌ తర్వాతి చిత్రం ‘అల్లూరి సీతారామరాజు’ అనే ప్రకటనతో పాటు అల్లూరి గెటప్‌లో స్కెచ్‌తో గీసిన ఎన్టీఆర్‌ బొమ్మ ఉంది. ఆ సినిమా కోసం కృష్ణ ఎదురు చూశారు. అయితే ఆ సినిమా ప్రారంభమైనా తర్వాత ఆగిపోయింది. పై చదువుల కోసం ఏలూరు వెళ్లిన కృష్ణకి నాటకాలపై ఆసక్తి కలిగింది. అది కాస్తా సినిమాలవైపు మళ్లడంతో చెన్నైకి చేరుకున్నారు. అప్పుడు ప్రజా నాట్యమండలి రాజారావు బృందం ప్రదర్శించిన ‘అల్లూరి సీతారామరాజు’ నాటకానికి మంత్రముగ్దుడయ్యారు కృష్ణ. ఆ తర్వాత హీరో అయిన కృష్ణ ‘అసాధ్యుడు’లో (1968) అంతర్నాటకంలో భాగంగా సీతారామరాజు వేషం వేశారు. ఆ వేషంలో చక్కగా ఉన్నారంటూ జనాలు కితాబిచ్చారు. దీంతో తాను హీరోగా అల్లూరి చరిత్రతో సినిమా తీస్తే బాగుంటుందనుకున్నారు కృష్ణ. అయితే 1972లో శోభన్‌బాబు హీరోగా సీతారామరాజు మూవీ నిర్మించనున్నట్లు డి. లక్ష్మీ నారాయణ (డీఎల్‌) ప్రకటించారు. కానీ అనారోగ్యం వల్ల ఆ ప్రయత్నం విరమించుకున్నారాయన. కృష్ణ హీరోగా ‘పెద్దలు మారాలి’ సినిమా తీశారు డీఎల్‌. ఆ చనువుతో సీతారామరాజు కథని కృష్ణకి ఇచ్చి, ఆసక్తి ఉంటే సినిమా తీసుకోమన్నారు. అలా ‘అల్లూరి సీతారామరాజు’ చేసే అవకాశం కృష్ణకి వచ్చింది. డేరింగ్‌ అండ్‌ డ్యాషింగ్‌ కృష్ణ కృష్ణకు ‘డేరింగ్‌ అండ్‌ డ్యాషింగ్‌’ అని పేరు. ‘అల్లూరి సీతారామరాజు’ కథలో వాణిజ్యపరమైన అంశాలు ఉండవని, పైగా హీరో చనిపోతాడని ఫైనాన్స్‌ ఇవ్వడానికి ఫైనాన్షియర్లు, పంపిణీ చేయడానికి కూడా ఎవరూ సాహసించలేదు. ‘ఇంత రిస్క్‌ అవసరమా.. ఈ సినిమా వద్దు’ అని శ్రేయోభిలాషులు కృష్ణకు చె΄్పారు. ఎన్టీఆర్‌ కూడా వద్దనే అన్నారు. అయినా తాను ఓ హీరోగా రూపొందిన ‘దేవుడు చేసిన మనుషులు’ శత దినోత్సవంలో అల్లూరి సీతారామరాజు సినిమా తీస్తున్నానని, అది తన నూరో చిత్రంగా ఉంటుందని కృష్ణ ప్రకటించారు. 1973 డిసెంబరులో మద్రాస్‌ వాహినీ స్టూడియోలో షూటింగ్‌ ఆరంభమైంది. అల్లూరి సీతారామరాజు గెటప్‌లో ఉన్న కృష్ణపై ఫస్ట్‌ షాట్‌ తీశారు. సినిమా మొదలుపెట్టినప్పట్నుంచి అనేక ఇబ్బందులు. చింతపల్లి అడవిలో షూటింగ్‌ కాబట్టి అక్కడ గెస్ట్‌ హౌస్‌లు లేకపోవడంతో యూనిట్‌లోని దాదాపు ఐదువందల మందికి ఒక కాలనీలా తాత్కాలిక బస ఏర్పాటు చేశారు. సముద్ర మట్టానికి నాలుగువేల అడుగుల ఎత్తులో కొండ ప్రాంతంలో షూటింగ్‌. భయంకరమైన చలి. దాదాపు 40 రోజుల పాటు షూటింగ్‌ చేశారు. దర్శకుడు రామచంద్రరావు అస్వస్థతకి గురి కావడం ఓ ఊహించని షాక్‌. ఆయన్ను చెన్నైకి తీసుకెళ్లి, మెరుగైన వైద్యం చేయించినా కోలుకోలేదు. ఫిబ్రవరి 14న తుది శ్వాస విడిచారు. మిగతా భాగాన్ని కృష్ణ తెరకెక్కించారు. యుద్ధ సన్నివేశాలను దర్శకుడు కేఎస్‌ఆర్‌ దాస్‌ రూపొందించారు. రామచంద్రరావు మీద గౌరవంతో దర్శకుడిగా ఆయన పేరే ఉంచేశారు కృష్ణ. సినిమా స్కోప్‌.. ఈజీ కాదు తెలుగులో పూర్తి స్థాయిలో రూపొందిన తొలి సినిమా స్కోప్‌ ఈస్ట్‌మన్‌ కలర్‌ చిత్రం ‘అల్లూరి సీతారామరాజు’. అయితే అప్పుడు సినిమా స్కోప్‌ అంత ఈజీ కాదు. ఈ మూవీకి వీఎస్‌ఆర్‌ స్వామి ఛాయాగ్రాహకుడు. అప్పట్లో సినిమా స్కోప్‌ ఫార్మాట్‌లో తీసేందుకు రెండే లెన్స్‌లు ఉండేవట. కాగా సినిమా స్కోప్‌ ఫార్మాట్‌లో తీసే లెన్స్‌కి కెమెరా వ్యూఫైండర్స్‌ ఉండవట. దీంతో ఊహించుకుని ఫ్రేమ్‌ సెట్‌ చేసుకునేవారట. ఈ ప్రక్రియను వీఎస్‌ఆర్‌ స్వామి ముంబైలో అధ్యయనం చేసి రావడంతో ‘అల్లూరి సీతారామరాజు’ ఈజీగా చేయగలిగారు.   అల్లూరి పాటలు అజరామరం ‘అల్లూరి సీతారామరాజు’లోని పాటలన్నీ సూపర్‌ హిట్‌. పి. ఆదినారాయణరావు ఈ సినిమాకు సంగీతదర్శకుడు. సినిమా ఆరంభంలో వచ్చే ‘రగిలింది విప్లవాగ్ని..’, సినిమా చివర్లో వచ్చే.. ‘ఓ విప్లవజ్యోతి...’ పాటలకు ఆరుద్ర సాహిత్యం అందించగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడారు. ‘వస్తాడు నా రాజు..’ పాటను నారాయణరెడ్డి రాయగా,  ‘హైలెస్సా.. హైలెస్సా..’, ‘కొండ దేవతా నిన్ను కొలిచేవమ్మా..’ పాటలను కొసరాజు రాశారు.‘తెలుగు వీర లేవరా..’ పాటను శ్రీశ్రీ రాశారు. ఈ పాటను ఘంటసాలతోనే పాడించాలన్నది కృష్ణ సంకల్పం. ఆ సమయానికి ఘంటసాల ఆరోగ్యం సరిగా లేదు. ఆ తర్వాత ఘంటసాల ఆరోగ్యం కాస్త కుదుటపడటంతో ఆయన ఈ పాట పాడారు. కానీ ఈ సినిమా విడుదల కాకముందే ఘంటసాల కాలం చేశారు. ఈ పాటకు వి. రామకృష్ణ గొంతు కలిపారు. ఈ పాటకుగాను జాతీయ ఉత్తమ గీత రచయిత అవార్డు శ్రీశ్రీని వరించింది. ఓ తెలుగు సినిమాలోని పాటకు జాతీయ పురస్కారం రావడం అదే తొలిసారి. అలాగే ఇదే సినిమాలోని ‘వందేమాతరం అంటూ నినదించిన..’, ‘హ్యాపీ క్రిస్మస్‌..’ పాట, ‘అరుణాయ శరణ్యాయ..’ శ్లోకం వంటివి కూడా వీనుల విందుగా ఉంటాయి.రికార్డులు భళా ‘అల్లూరి సీతారామరాజు’ సినిమా 19 కేంద్రాల్లో (బెంగళూరుతో కలుపుకుని) వందరోజులు, 2 కేంద్రాల్లో 25 వారాలు, హైదరాబాద్‌లోని సంగం థియేటర్‌లో రజతోత్సవం, అలాగే షిఫ్టింగులతో ఏడాది పాటు ఆడటం విశేషం. ఈ చిత్రం స్వర్ణోత్సవం చెన్నైలోని ఉడ్‌ల్యాండ్స్‌ హోటల్‌లో ఘనంగా జరిగాయి. స్వాతంత్య్ర సమరయోధులు ఇంటూరి వెంకటేశ్వరరావు, అనిసెట్టి సుబ్బారావు, దాశరథి, సుంకర సత్యనారాయణ, కేఎస్‌ గోపాలకృష్ణన్‌ వంటి వారిని సత్కరించారు. అల్లూరి సీతారామరాజు కుటుంబ సభ్యుల సంక్షేమం కోసం రూ. పదివేలతో ఓ ట్రస్టు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించి, అందుకు సంబంధించిన పత్రాలను సీతారామరాజు సోదరుడు సత్యనారాయణరాజుకి అందించారు కృష్ణ. ఇలా ఈ సినిమాకి సంబంధించిన విశేషాలు చాలా ఉన్నాయి.అల్లూరి చేయనన్న ఎన్టీఆర్‌ అల్లూరి సీతారామరాజు సినిమా మొదలుపెట్టి, ఆపినా ఆ సినిమా తీయాలన్న ఎన్టీఆర్‌ ఆకాంక్ష అలాగే ఉండిపోయింది. కృష్ణ ‘అల్లూరి సీతారామరాజు’ వచ్చిన చాలా ఏళ్లకు ఆ సినిమా తీద్దామని పరుచూరి బ్రదర్స్‌తో అన్నారు ఎన్టీఆర్‌. కానీ సోదరులు వద్దని సలహా ఇచ్చి, కృష్ణ చేసిన సినిమా చూడమన్నారు. ఎన్టీఆర్‌ కోరిక మేరకు ‘అల్లూరి సీతారామరాజు’ని ప్రత్యేకంగా చూపించారు కృష్ణ.  ‘‘అద్భుతంగా తీశారు. నేను ‘అల్లూరి సీతారామరాజు’  తీయను’’ అన్నారు ఎన్టీఆర్‌.మహారథి చేతికి స్క్రిప్ట్‌ త్రిపురనేని మహారథి చేతిలో డీఎల్‌ ఇచ్చిన స్క్రిప్ట్‌ పెట్టి, ‘ఈ సబ్జెక్ట్‌లో సినిమా తీయడానికి కావాల్సినంత దమ్ము ఉందా’ అడిగారు కృష్ణ సోదరుడు హనుమంతరావు. ‘చాలా ఉంది’ అన్నారు మహారథి. కానీ, తనకు ఇచ్చిన స్క్రిప్ట్‌లో ఒక్క సన్నివేశం తప్ప మహారథికి వేరే ఏదీ నచ్చలేదు. పరిశోధనలు చేసి, స్క్రిప్ట్‌ తయారు చేశారు. దర్శకుడిగా వి. రామచంద్రరావును తీసుకున్నారు. సినిమా స్కోప్‌  ఈస్ట్‌మన్‌ కలర్‌లో తీయాలని నిర్ణయించింది పద్మాలయా స్టూడియోస్‌ సంస్థ (కృష్ణ సొంత నిర్మాణ సంస్థ). ‘అల్లూరి...’ తర్వాత ‘పాడి పంటలు’తోనే హిట్‌... ‘అల్లూరి సీతారామరాజు’ చూసిన  విజయా వాహిని సంస్థ అధినేతల్లో ఒకరైన దర్శక–నిర్మాత చక్రపాణి అభినందించారు. కానీ ‘ఈ సినిమా తర్వాత నీ సినిమాలు ఆడటం కష్టం’ అని కూడా కృష్ణతో అన్నారు. ఆయన అన్న మాటలు నిజమయ్యాయి. ‘అల్లూరి సీతారామరాజు’ తర్వాత కృష్ణ చేసిన ప్రతి చిత్రాన్నీ ఈ సినిమాతో పోల్చారు ప్రేక్షకులు. దాంతో ఆ తర్వాత కృష్ణ నటించిన çపది సినిమాలకు పైగా ఆశించిన ఫలితాన్ని సాధించలేదు. చివరికి పద్మాలయా స్టూడియోస్‌ నిర్మించిన ‘పాడి పంటలు’ (1976) విజయంతో హీరోగా కృష్ణ పూర్వ వైభవాన్ని పొందారు. 

తప్పక చదవండి

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
Advertisement
Advertisement