బిగ్ బాస్ షోతో పరిచయమై.. దాదాపు మూడేళ్లుగా ప్రేమించుకున్న జంట.. ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు
							చెన్నైలోని ఓ రిసార్ట్ లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఒక్కటయ్యారు. అబ్బాయి ముస్లిం అయినప్పటికీ.. ఆమ్మాయి ఇష్టప్రకారం హిందు సంప్రదాయంలోనే పెళ్లి జరగడం విశేషం.
							2012 నుంచి సినిమాలు చేస్తున్న నటి పావని రెడ్డి.. తెలుగులో గౌరవం, అమృతంలో చందమామ, సేనాపతి, మళ్లీ మొదలైంది, చారీ 111 తదితర చిత్రాలు చేసింది.
							పావనికి ఇదివరకే 2017లో ప్రదీప్ అనే వ్యక్తితో పెళ్లయింది. పావని ఓ తెలుగు సీరియల్ చేస్తున్న టైంలో ఇతడి పరిచయమయ్యాడు. కాకపోతే పెళ్లయిన కొన్నాళ్లకే ప్రదీప్ ఆత్మహత్య చేసుకున్నాడు
							బిగ్ బాస్ 5వ సీజన్ లో పావని పాల్గొంది
							ఇదే షోలో పాల్గొన్న కొరియోగ్రాఫర్ ఆమిర్.. పావనిని చూసి ఇష్టపడ్డాడు. ఆమెకి విషయం చెబితే తొలుత నో చెప్పింది గానీ కొన్నాళ్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది
							అలా 2022 నుంచి ఆమిర్-పావని రెడ్డి రిలేషన్ షిప్ లో ఉన్నారు.
							ఇప్పుడు హిందూ సంప్రదాయంలో ఆమిర్-పావని పెళ్లి జరిగింది. ఈ క్రమంలోనే అందరూ కొత్త జంటకు విషెస్ చెబుతున్నారు
							
							
							
							
							
							
							
							
							
							
							
							
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
