విమానాల్లో మద్యంపై నిషేధం | Airlines ban alcohol on flights due to pandemic | Sakshi
Sakshi News home page

విమానాల్లో మద్యంపై నిషేధం

Jun 22 2020 11:38 AM | Updated on Jun 22 2020 12:04 PM

Airlines ban alcohol on flights due to pandemic - Sakshi

ఓ వైపు లాక్ డౌన్ పుణ్యమా అని మద్యం సేల్స్ దూసుకుపోతుంటే, విమానాల్లో మాత్రం మందు అమ్మకాలపై నిషేధం పడింది. కరోనా వైరస్ కారణంగా విమానాల్లో మద్యపానాన్ని నిషేధిస్తున్నట్లు ఆసియాకు చెందిన వర్జిన్ ఆస్ట్రేలియా, అమెరికాకు చెందిన ఈజీ జెట్, కేఎల్ఎమ్ యూరప్, డెల్టా, అమెరికన్ ఎయిర్ లైన్స్ ప్రకటించాయి. 

క్యాబిన్ క్రూ, పాసింజర్ల మధ్య ఎడం ఉండేలా చూసుకునేందుకు, ఫేస్ మాస్కులను తరచూ తీయకుండా ఉంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాయి. చాలా సంస్ధలు విమానాల్లో కేవలం మంచినీళ్లను మాత్రమే అందుబాటులో ఉంచుతున్నాయి. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అన్ని ఎయిర్ లైన్స్ సంస్థలు విమానాల్లో ఫేస్ మాస్కులను తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. (వాళ్లు ఈ శిక్ష అనుభవించాల్సిందే: ఉత్తర కొరియా)

యూరప్ కు చెందిన ఈజీ జెట్ జాతీయ, అంతర్జాతీయ మార్గాల్లో జూన్ 15 నుంచి విమానాలను నడుపుతోంది. ఆహారంతో పాటు సాధారణ డ్రింక్స్ ను తమ వెంట తెచ్చుకునేందుకు పాసింజర్లకు అనుమతిస్తోంది. ప్రస్తుతం కేవలం మంచినీళ్లను మాత్రమే విమానంలో పాసింజర్లకు అందిస్తోంది. త్వరలో ఆహారాన్ని కూడా అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

వర్జిన్ అట్లాంటిక్ సంస్థ పాసింజర్లకు హెల్త్ ప్యాకులను ఇస్తోంది. వీటిలో మాస్కులతో పాటు జెల్, వైప్స్ ఉంటున్నాయి. ఈ సంస్థ కూడా విమానాల్లో మద్యం సరఫరాను తాత్కలికంగా నిలిపివేసింది. నెదర్లాండ్ కు చెందిన కేఎల్ఎమ్ సైతం ఆల్కహాల్, హట్ డ్రింక్స్ ను నిషేధించింది. కేవలం మంచినీళ్లు, సాఫ్ట్ డ్రింక్స్ ను పాసింజర్లకు అందిస్తోంది. సుదూర ప్రాంతాలకు వెళ్లే పాసింజర్లకు భోజన సదుపాయం కల్పించింది. (2020 యుగాంతం: అంతా ఉత్తుత్తిదే)

బ్రిటీష్ ఎయిర్ వేస్ కూడా ఆల్కహాల్ ను సర్వ్ చేయబోమని తేల్చి చెప్పింది. దానికి బదులు ఓ బాటిల్ నీరు అందిస్తున్నామని పేర్కొంది. భోజన సదుపాయాన్ని కూడా నిలిపేశామని తెలిపింది. ఐర్లాండ్ కు చెందిన ర్యానైర్ ఎయిర్ లైన్స్ పరిమిత సంఖ్యలో విమానాలను నడుపుతోంది. అన్ని రకాల భోజన సదుపాయాలను ముందస్తుగా బుక్ చేసుకునే అవకాశం పాసింజర్లకు ఇస్తోంది. ఇలా చేసుకున్న వారికి ముందుగా ప్యాక్ చేసిన భోజనాన్ని అందజేస్తుంది. వీటిలో ఆల్కహాల్, హాట్ డ్రింక్స్ ఉండవు.

అమెరికాకు చెందిన డెల్టా ఎయిర్ లైన్స్, దేశంలో తిరిగే విమానాల్లో ఆల్కహాల్ ను నిషేధించింది. అంతర్జాతీయ విమానాల్లో మాత్రం బీరు, వైన్ తదితరాలను సర్వ్ చేస్తోంది. అమెరికన్ ఎయిర్ లైన్స్ ప్రయాణ సమయాన్ని బట్టి ఫుడ్, డ్రింక్స్ మెనూలో మార్పులు తెచ్చింది. సుదూర ప్రాంతాలకు ఫస్ట్ క్లాస్ లో ప్రయాణించే పాసింజర్లకు మాత్రమే ఆల్కహాల్ ను అందజేస్తోంది.

హాంకాంగ్ కు చెందిన క్యాథీ పసిఫిక్ ఎయిర్ లైన్స్ అన్ని సర్సీసుల్లోనూ మద్యం అందుబాటులో ఉంచింది. వర్జిన్ ఆస్ట్రేలియా పాసింజర్లు అందరికీ మంచినీళ్లు, స్నాక్స్ అందిస్తోంది. కానీ, ఆహారం, డ్రింక్స్ అమ్మకాలను నిలిపేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement