కాసినికి 20 ఏళ్లు

కాసినికి 20 ఏళ్లు

 • శని గ్రహ కక్ష్య చేరుకున్న మొదటి ఉపగ్రహం

 • 1995లో ప్రయోగించిన నాసా

 • ఉపగ్రహ కాలపరిమితి పూర్తయిందన్న నాసా

 • ప్రమాదాలకు తావు లేకుండా ఉపగ్రహ విధ్వంసం • వాషింగ్టన్‌ : శనిగ్రహం చుట్టూ అల్లుకున్ని చిక్కుముళ్లను, అక్కడి వాతావరణ, జీవావరణ పరిస్థితులను తెలుసుకునేందుకు నాసా ప్రయోగించిన ‘కాసినీ’  ఉపగ్రహానికి సెప్టెంబర్‌ 15తో 20 ఏళ్లు నిండనున్నాయి. శనిగ్రహ ఆనవాళ్లను తెలుసుకునేందుకు నాసా అంతరిక్ష పరిశోధన కేంద్రం కాసినీ ఉపగ్రహాన్ని రూపొందించింది. దీనిని 1997 సెప్టెబర్‌ 15న శనిగ్రహ కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. అప్పటి నుంచి ఇప్పటివరకూ కాసినీ.. శనిగ్రహానికి చెందిన ఎన్నో అపురూపమైన చిత్రాలను, ఇతర సమాచారాన్ని అందించింది. ఈ ఉపగ్రహ కాలపరిమితి పూర్తికావడంతో.. కాసినీని నాశనం చేసేందుకు నాసా సిద్ధమవుతోంది.


  విలువైన సమాచారం

  శనిగ్రహ కక్ష్యలోకి చేరుకున్న మొట్టమొదటి మానవ నిర్మిత ఉపగ్రహంగా కాసిని చరిత్రలో నిలిచిపోతుంది. ఈ ఉపగ్రహం శనితో పాటు, ఆయన చుట్టూ తిరిగే ఉపగ్రహాల సమాచారాన్ని రియల్‌ టైమ్‌లో అందించింది. ఇప్పటివరకూ శనికి సంబంధించిన వేలాది ఫొటోలను, ఇతర విలువైన సమాచారాన్ని నాసాకు చేరవేసింది. కాసినీ ఉపగ్రహం సెప్టెంబర్‌ 14న  భూమికి పంపే ఫొటోనే.. చివరిది కానుంది.


  ఇంధనం అయిపోతే..!

  కాసిని ఉపగ్రహాన్ని నాసా కేంద్రం నుంచి రేడియో సిగ్నల్స్‌ ఆధారంగా నియం‍త్రిస్తారు. భూమి నుంచి ఈ సంకేతాలు.. కాసినిని చేరుకోవడానికి సుమారుగా 68 నుంచి 84 నిమిషాల సమయం పడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కాసిని శాటిలైట్‌ ప్రోగ్రామ్‌ మేనేజర్‌ డాక్టర్‌ ఎర్ల్‌ మేజీ మాట్లాడుతూ.. ఉపగ్రహంలో ఇంధనం పూర్తయితే.. దానిని నియంత్రించడం అసాధ్యమని చెబుతున్నారు. అదే సమయం‍లో కాసినీ క్రాష్‌ ల్యాండ్‌ అయితే పరిస్థితులు భీతావహంగా ఉంటాయని.. అందువల్లే మన నియం‍త్రణలో ఉం‍డగానే ధ్వంసం చేయాలని ఆయన అంటున్నారు.


  ఇతర గ్రహాలను, చంద్రుడిని ఢీ కొడితే..!

  ఇంధనం పూర్తయ్యాక కాసినీ శాటిలైట్‌ తన ఇష్టానుసారం వినువీధిలో తిరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఉపగ్రహం చంద్రుడిని, లేదంటే ఇతర శాటిలైట్లను, గ్రహాలను ఢీ కొట్టే అవకాశం ఉంది. ఇదే జరిగితే అంతరిక్షంలో విపరీత మార్పులు జరుగుతాయి. కాసినీ ఉపగ్రహం ప్రస్తుతం శని గ్రహ కక్ష్యలోని 22వ రింగ్‌లో పరిభ్రమిస్తోంది.  కాసినీ హైలెట్స్‌

  - 1997 అక్టోబర్‌15న కాసినీని అంతరిక్షంలోకి ప్రయోగించారు.

  - ఏడేళ్ల పాటు అంతరిక్షంలో ప్రయాణించిన కాసినీ 2004 జూలై1న శని గ్రహ కక్ష్య చేరుకుంది.

  - 2005 జనవరి 14న కాసినీ తొలి సమాచారాన్ని భూమికి అందించింది.

  - ఈ ఉపగ్రహాన్ని జెట్‌ ప్రపొల్సన్‌ లేబొరేటరీ రూపొందించిందగా.. యూరోపియన్‌ స్పేస్‌ రీసెర్చ్‌ అండ్‌టెక్నాలజీ సెంటర్‌ అభివృద్ధి చేసింది.

  - శని గ్రహ కక్ష్యలోని రింగ్స్‌ గురించిన విలువైన సమాచారాన్నిభూమికి చేరవేసింది.

  - శని గ్రహం మీదున్న భౌగోళిక, వాతావరణ పరిస్థితులకు సంబంధించిన ఛాయాచిత్రాలను అందించింది.

   

Read latest Top Stories News and Telugu News | Follow us on FaceBook, Twitter

Tags: 
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top