ఐపీవో బాటలో ట్విట్టర్ | Twitter IPO will be hot but with risks | Sakshi
Sakshi News home page

ఐపీవో బాటలో ట్విట్టర్

Sep 14 2013 2:31 AM | Updated on Jul 26 2018 5:21 PM

ఐపీవో బాటలో ట్విట్టర్ - Sakshi

ఐపీవో బాటలో ట్విట్టర్

సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ట్విట్టర్ పబ్లిక్ ఇష్యూని చేపట్టనుంది.

వాషింగ్టన్: సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ట్విట్టర్ పబ్లిక్ ఇష్యూని చేపట్టనుంది. ఇందుకు అనుమతించమంటూ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్(ఎస్‌ఈసీ)కు ఈ అమెరికన్ టెక్నాలజీ సంస్థ దరఖాస్తు చేసుకుంది. 2006లో ఆవిర్భవించిన ట్విట్టర్ విలువను వాల్‌స్ట్రీట్ జర్నల్  10 బిలియన్ డాలర్లుగా అంచనా వేసింది. ప్రముఖ వ్యక్తులు(సెలబ్రిటీలు), రాజకీయ వేత్తలు, క్రీడాకారులు, జర్నలిస్టులు తదితరులు తమ వ్యాఖ్యానాలు, అభిప్రాయాల వంటివి వెల్లడించేందుకు అత్యధిక స్థాయిలో ఈ సైట్‌ను వినియోగిస్తున్న సంగతి తెలిసిందే. వెరసి ట్విట్టర్ వేగంగా వృద్ధి చెందుతూ అత్యంత ప్రభావవంతమైన సోషల్ మీడియా సర్వీస్‌గా నిలుస్తోంది. ట్విట్టర్ వినియోగదారుల సంఖ్య 20 కోట్లుకాగా,  ఈ ఏడాది ప్రకటనల ద్వారా 58.28 కోట్ల డాలర్ల ఆదాయాన్ని ఆర్జించగలదని, వచ్చే ఏడాదిలో ఇది 100 కోట్ల డాలర్లకు చేరగలదని విశ్లేషక సంస్థ ఈమార్కెటర్ అంచనా వేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement