మీడియా సమావేశాలు పెట్టి ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీని, ముద్రగడ పద్మనాభాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించాలని...
సాక్షి, హైదరాబాద్: మీడియా సమావేశాలు పెట్టి ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీని, ముద్రగడ పద్మనాభాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించాలని, అభాండాలు వేయాలని టీడీపీకి చెందిన కాపు నాయకులకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. యన ఆదివారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల కాపు నాయకులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. తునిలో అవాంఛనీయ సంఘటనలకు వైఎస్సార్‌సీపీ, ముద్రగడ పద్మనాభమే బాధ్యులని, ఉద్దేశపూర్వకంగా చేయించారంటూ వారిపై బురద చల్లాలని పేర్కొన్నారు.
ఈ సంఘటనలను అనుకూలంగా మలచుకోవాలని, ప్రతిపక్షాన్ని దెబ్బతీసేందుకు వినియోగించుకోవాలని సూచించారు. ‘‘కాపులను బీసీలో చేర్చుతూ జీఓ జారీచేయడం ఒక్కరోజు పని. అయితే దీనిపై ఎవరైనా కోర్టుకెళితే అది నిలవదు. గతంలో జారీ అయిన ఎస్సీల వర్గీకరణ, మైనారిటీలకు రిజర్వేషన్ల జీఓలను కోర్టులు ఆపివేశాయి. అలా కాకుండా చట్టబద్ధమైన చర్యలతో జీఓ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నాను. కాపుల సంక్షేమం కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ.100 కోట్లు విడుదల చేశాను’’ అని చంద్రబాబు చెప్పుకొచ్చారు.