రాయ్ దేశం విడిచి వెళ్లడం కుదరదు: సుప్రీం | Subrata Roy can't leave the country, says SC | Sakshi
Sakshi News home page

రాయ్ దేశం విడిచి వెళ్లడం కుదరదు: సుప్రీం

Jan 29 2014 1:57 AM | Updated on Sep 2 2018 5:20 PM

రాయ్ దేశం విడిచి వెళ్లడం కుదరదు: సుప్రీం - Sakshi

రాయ్ దేశం విడిచి వెళ్లడం కుదరదు: సుప్రీం

ఇన్వెస్టర్లకు తిరిగిచ్చేశావుని చెబుతున్న రూ.22,885 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో సహారాగ్రూప్ తొలుత చెప్పాల్సిందేనని సుప్రీంకోర్టు మంగళవారం స్పష్టం చేసింది.

న్యూఢిల్లీ: ఇన్వెస్టర్లకు తిరిగిచ్చేశావుని చెబుతున్న రూ.22,885 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయో సహారాగ్రూప్ తొలుత చెప్పాల్సిందేనని సుప్రీంకోర్టు మంగళవారం స్పష్టం చేసింది. అప్పటివరకూ గ్రూప్ చీఫ్ సుబ్రతా రాయ్ దేశం విడిచి వెళ్లలేరని పేర్కొంది.  ఈ మేరకు ఇంతక్రితం (జనవరి 9) ఇచ్చిన ఆదేశాలను సడలించాలని కోరుతూ గ్రూప్ దాఖలు చేసిన పిటిషన్‌ను ద్విసభ్య ధర్మాసనం తోసిపుచ్చింది.

 ఆ డబ్బు ఎక్కడినుంచి వచ్చిందో  చెప్పకపోతే ఈ విషయం దర్యాప్తునకు తాము తదుపరి ఆదేశాలను జారీ చేస్తామని కూడా న్యాయమూర్తులు స్పష్టం చేశారు.  కేసు  విచారణను ధర్మాసనం ఫిబ్రవరి 11కు సుప్రీంకోర్టు వాయిదా వేసింది. అప్పటికల్లా అన్ని అంశాలనూ  సెబీకి సమర్పించాలని స్పష్టం చేసింది.
 

Advertisement
 
Advertisement
Advertisement