సింగపూర్ అల్లర్ల కేసులో మరో భారతీయుడికి జైలుశిక్ష | Second Indian jailed in Singapore riot case | Sakshi
Sakshi News home page

సింగపూర్ అల్లర్ల కేసులో మరో భారతీయుడికి జైలుశిక్ష

May 15 2014 7:19 PM | Updated on May 29 2019 3:19 PM

గత డిసెంబర్ లో జరిగిన సింగపూర్ అల్లర్ల కేసుకు సంబంధించి మరో భారతీయుడికి శిక్ష పడింది.

సింగపూర్: గత డిసెంబర్ లో సింగపూర్ లో చోటు చేసుకున్నఅల్లర్ల కేసుకు సంబంధించి మరో భారతీయుడికి శిక్ష పడింది. సింగపూర్ లో  అరుముగం కార్తీక్ కాంట్రాక్టర్ కార్మికుడు ప్రైవేటు ఆస్తులపై దాడి చేసినట్లు కోర్టులో ఒప్పుకోవడంతో అతనికి 33 నెలల జైలు శిక్ష పడింది. అంతే కాకుండా మూడు పోలీసు వాహనాలపై దాడికి పాల్పడినట్లు కూడా పేర్కొన్నాడు.  దీంతో రామలింగకు జైలు శిక్ష విధిస్తున్నట్లు కోర్టు పేర్కొంది. ఇదే కేసులో గత వారం రామలింగం శక్తివేల్ కు 30 నెలల శిక్ష పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై మొత్తం  25 మందిపై ఛార్జీషీటు దాఖలవ్వగా ఆరుగురికి 15 వారాల నుంచి 18 నెలల శిక్ష విధించారు. మరో 17 మందిపై దాఖలైన ఛార్జీషీటు ప్రస్తుతం కోర్టులో పెండింగ్ లో ఉంది.

 

గత డిసెంబర్ 8 వ తేదీన ఓ ప్రైవేట్ బస్సు భారతీయ కాంట్రాక్టర్ కార్మికున్ని ఢీకొట్టి మరణానికి కారణమవ్వడంతో అక్కడ వివాదం చోటు చేసుకుంది. 400 మందిపైగా బస్సును ధ్వంసం చేయడమే కాకుండా పోలీస్ రక్షణ వాహనాలపై దాడికి పాల్పడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement