బీసీలకు మేనేజ్‌మెంట్ కోటాలోనూ రిజర్వేషన్! | Reservations for BCs in management quota | Sakshi
Sakshi News home page

బీసీలకు మేనేజ్‌మెంట్ కోటాలోనూ రిజర్వేషన్!

Jan 9 2014 1:42 AM | Updated on Sep 4 2018 5:07 PM

వృత్తివిద్యా కోర్సులు చదివే బీసీ విద్యార్థులకు మేనేజ్‌మెంట్ కోటాలో కూడా రిజర్వేషన్లు అమలు చేయాలని బీసీ సంక్షేమంపై ఏర్పాటు చేసిన శాసనసభా కమిటీ సిఫార్సు చేసింది.

ప్రభుత్వానికి బీసీ సంక్షేమ శాసనసభా కమిటీ సిఫారసు
 సాక్షి, హైదరాబాద్: వృత్తివిద్యా కోర్సులు చదివే బీసీ విద్యార్థులకు మేనేజ్‌మెంట్ కోటాలో కూడా రిజర్వేషన్లు అమలు చేయాలని బీసీ సంక్షేమంపై ఏర్పాటు చేసిన శాసనసభా కమిటీ సిఫార్సు చేసింది.
 
 మెరిట్ ప్రాతిపదికన ఈ రిజర్వేషన్లను అమలు చేయాలని సూచించింది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ గుండుమల్ల తిప్పేస్వామి అధ్యక్షతన మరో 18 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో 2012 మే 19న కమిటీ ఏర్పాటైంది. పలు జిల్లాల్లో పర్యటించి బీసీలకు అమలవుతున్న సంక్షేమ పథకాల అమలు తీరు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు, బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలను అధ్యయనం చేసింది. బీసీల సంక్షేమం కోసం 53 సిఫార్సులు చేసింది.
 
 కమిటీ సిఫార్సులు చేసిన సిఫార్సులివీ..
 ఠ చేనేత కార్మికుల సమస్యల పరిష్కారానికి సీనియర్ అధికారులతో ఓ కమిటీని ఏర్పాటు చేయాలి. ఆప్కోకు బకాయిలు చెల్లించాలి. వయోపరిమితి లేకుండా బీఈడీ చదువుతున్న బీసీ విద్యార్థులందరికీ స్కాలర్‌షిప్‌లివ్వాలి. దామోదరం సంజీవయ్య న్యాయ విశ్వవిద్యాలయాన్ని జాతీయ వర్సిటీగా ప్రకటించాలి.  బీసీ కార్పొరేషన్ ద్వారా అందించే రుణాలపై విస్తృత అవగాహన కల్పించాలి.
 
 
 బోగస్ ఎన్‌రోల్‌మెంట్ పేరిట బీసీ విద్యార్థులకు హాస్టళ్లలో అడ్మిషన్లు నిరాకరించకూడదు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలతో సమానంగా ఫెలోషిప్ ఇవ్వాలి బీసీ-ఈ గ్రూపును ఓబీసీ జాబితాలో చేర్చాలి. చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసి పాఠ్యపుస్తకాలలో ఆమె జీవితచరిత్రను చేర్చాలి.  తెలంగాణలోని ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చాలి.  ప్రతి జిల్లాలో జ్యోతిబాపూలే భవనాలు ఏర్పాటు చేయాలి. ఠ మత్స్యకారులకు కేరళ రాష్ట్ర తరహాలో ప్యాకేజీ అమలు చేయాలి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement