ములాయం బర్త్ డే పార్టీకి లాలూ డుమ్మా | Mulayam Singh Cuts Cake in Drought Ravaged Uttar Pradesh, Lalu Yadav Absent | Sakshi
Sakshi News home page

ములాయం బర్త్ డే పార్టీకి లాలూ డుమ్మా

Nov 22 2015 5:44 PM | Updated on Jul 30 2018 8:10 PM

ములాయం బర్త్ డే పార్టీకి లాలూ డుమ్మా - Sakshi

ములాయం బర్త్ డే పార్టీకి లాలూ డుమ్మా

సమాజ్ వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ తన 76వ పుట్టినరోజు వేడుకలను స్వగ్రామంలో జరుపుకున్నారు.

సాయ్ ఫాయ్: సమాజ్ వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ తన 76వ పుట్టినరోజు వేడుకలను స్వగ్రామంలో జరుపుకున్నారు. ఉత్తరప్రదేశ్ సాయ్ ఫాయ్ లో ఆదివారం అట్టహాసంగా జన్మదిన వేడుకలు చేసుకున్నారు. గత రాత్రి  ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ బృందంతో సంగీత కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున సమాజ్ వాది పార్టీ కార్యకర్తలు హాజరయ్యారు. భారీ స్థాయిలో బాణాసంచా కాల్చారు. నాలుగు అంచెల భారీ కేకును ములాయం కట్ చేశారు.

ములాయం బర్త్ డే వేడుకలకు కోట్లాది రూపాయలు ఖర్చు చేయడంపై విమర్శలు వస్తున్నాయి. రాష్ట్ర  ప్రభుత్వ నిధులను ఖర్చు చేశారన్న ఆరోపణలను సమాజ్ వాది పార్టీ తోసిపుచ్చింది. ములాయంకు అత్యంత సన్నిహితుడైన ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఈ వేడుకలకు హాజరుకాలేదు. బిహార్ లో నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకారానికి ములాయం వెళ్లకపోవడంతో లాలూ ఇక్కడకు రాలేదన్న గుసగుసలు విన్పించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement