అవును వాళ్లిద్దరు బంధువులు కాబోతున్నారు! | Lalu, Mulayam all set to establish family ties | Sakshi
Sakshi News home page

అవును వాళ్లిద్దరు బంధువులు కాబోతున్నారు!

Dec 7 2014 5:28 AM | Updated on Sep 2 2017 5:44 PM

మూలాయం సింగ్ యాదవ్-లాలూ ప్రసాద్ యాదవ్

మూలాయం సింగ్ యాదవ్-లాలూ ప్రసాద్ యాదవ్

రాజకీయంగా ఒకటైన రాష్ట్రీయ జనతా దళ్ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్, సమాజ్‌వాదీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్లు ఇప్పుడు కుటుంబ పరంగా కూడా బంధువులు కాబోతున్నారు.

లక్నో: రాజకీయంగా ఒకటైన రాష్ట్రీయ జనతా దళ్ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్, సమాజ్‌వాదీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్లు  ఇప్పుడు కుటుంబ పరంగా కూడా బంధువులు కాబోతున్నారు.  లాలూ ప్రసాద్  చిన్న కూతురు రాజ్‌లక్ష్మిని, ములాయం సింగ్ మనవడు, ఎంపి తేజ్‌ప్రతాప్‌సింగ్‌కు ఇచ్చి పెళ్లి చేసేందుకు రంగం సిద్ధమైంది. బీహార్ మాజీ ముఖ్యమంత్రులైన లాలూ, రాబ్రీ దంపతులు తమ పిల్లలు తేజస్వి, మిసాలతో కలిసి రేపు తమ కుమార్తె    ఎంగేజ్‌మెంట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు లక్నో వస్తున్నారు.

ములాయం ఇంట్లో జరిగే ఈ వేడుక 'షగున్' కార్యక్రమంతో మొదలవుతుంది.  ములాయం తరపు నుంచి ఆయన కుమారుడు, యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్‌యాదవ్, ఎస్పీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంగోపాల్ యాదవ్ తదితరులు పాల్గొంటున్నారు. డిసెంబర్ 16న ఢిల్లీలో వివాహం జరుగుతుంది.
**

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement