విద్యార్థినిపై టీచర్ అత్యాచారం | Minor girl allegedly raped by teacher in Arunachal Pradesh | Sakshi
Sakshi News home page

విద్యార్థినిపై టీచర్ అత్యాచారం

Sep 9 2015 4:05 PM | Updated on Jul 28 2018 8:53 PM

విద్యార్థినిపై టీచర్ అత్యాచారం - Sakshi

విద్యార్థినిపై టీచర్ అత్యాచారం

విద్యాబుద్ధులు నేర్పి ఆదర్శంగా ఉండాల్సిన ఉపాధ్యాయుడు దారితప్పి కీచకుడిగా మారాడు.

ఈటానగర్: విద్యాబుద్ధులు నేర్పి ఆదర్శంగా ఉండాల్సిన ఉపాధ్యాయుడు దారితప్పి కీచకుడిగా మారాడు. ఏడేళ్ల విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడి చిత్రహింసలు పెట్టాడు. ఈ విషయం తెలుసుకున్న బాధితురాలి తల్లిదండ్రులు, స్థానికులు స్కూల్పై దాడి చేసి టీచర్ను చితకబాదారు. అరుణాచల్ ప్రదేశ్లోని ఉప్పర్ సియాంగ్ జిల్లాలో ఈ ఘటన వెలుగుచూసింది.

బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. గాయపడిన టీచర్ను పోలీసులు ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని కాపాడేందుకు ప్రయత్నించిన స్కూల్ ప్రిన్సిపాల్ను పోలీసులు అరెస్ట్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement