గర్భం దాల్చలేదని భార్యను కడతేర్చిన భర్త | Man kills wife for not conceiving | Sakshi
Sakshi News home page

గర్భం దాల్చలేదని భార్యను కడతేర్చిన భర్త

Dec 1 2013 7:50 PM | Updated on Jul 27 2018 2:21 PM

పెళ్లై పదిహేనేళ్లు దాటిన ఇప్పటివరకు గర్భం దాల్చలేదనే కారణంతో భార్యను ఓ గిరిజన యువకుడు హతమార్చాడు.

ఠాణే:  పెళ్లై పదిహేనేళ్లు దాటిన ఇప్పటివరకు గర్భం దాల్చలేదనే కారణంతో భార్యను ఓ గిరిజన యువకుడు హతమార్చాడు. ఠాణే జిల్లాలోని దహనూ తాలూకాలోని ఓ గుడిసెలో ఉంటున్న భరత్ లడక్ భారవి, భార్య సంగీత మధ్య ఈ విషయం గురించి తరచూ గొడవ జరిగేదని దహనూ పోలీసు స్టేషన్ సబ్ ఇన్‌స్పెక్టర్ పీజీ పాటిల్ తెలిపారు. శుక్రవారం రాత్రి కూడా గొడవ జరిగిందని, కోపోద్రిక్తుడైన భరత్, సంగీతపై గొడ్డలితో దాడి చేశాడన్నారు.

 

ముఖం, కడుపు, ఇతర శరీర అవయవాలను క్రూరంగా నరకడంతో తీవ్ర రక్తస్రావమై మరణించిందని తెలిపారు. దీనిపై కేసు నమోదుచేసి నిందితుడు భరత్ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని వెల్లడించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement