కిడ్నాపర్లు నన్ను బాగా చూసుకున్నారు | kidnappers taken care ofme, says snapdeel employee deepti | Sakshi
Sakshi News home page

కిడ్నాపర్లు నన్ను బాగా చూసుకున్నారు

Feb 13 2016 8:39 AM | Updated on Oct 22 2018 5:27 PM

కిడ్నాపర్లు నన్ను బాగా చూసుకున్నారు - Sakshi

కిడ్నాపర్లు నన్ను బాగా చూసుకున్నారు

కిడ్నాపర్లు తనను చాలా బాగా చూసుకున్నారని, సమయానికి భోజనం కూడా పెట్టారని.. అందువల్ల వాళ్లను ఏమీ చేయొద్దని స్నాప్ డీల్ ఉద్యోగిని దీప్తి సర్నా చెబుతోంది.

కిడ్నాపర్లు తనను చాలా బాగా చూసుకున్నారని, సమయానికి భోజనం కూడా పెట్టారని.. అందువల్ల వాళ్లను ఏమీ చేయొద్దని స్నాప్ డీల్ ఉద్యోగిని దీప్తి సర్నా చెబుతోంది. తన నుంచి గానీ, తన తండ్రి నుంచి గానీ డబ్బులు కూడా ఏమీ డిమాండ్ చేయలేదని.. అందుకే వాళ్ల మీద కేసులు కూడా ఏమీ పెట్టొద్దని అంటోంది. బుధవారం రాత్రి గుర్గావ్లోని స్నాప్ డీల్ సంస్థలో విధులు ముగించుకొని తిరిగివెళ్తుండగా ఘజియాబాద్లో దీప్తి అదృశ్యమైన సంగతి తెలిసిందే. 40 గంటల తర్వాత హర్యానాలోని పానిపట్ వద్ద ఆమెను పోలీసులు గుర్తించారు.

తన కూతురు తనకు శుక్రవారం ఉదయం 7 గంటల సమయంలో ఫోన్ చేసి, 'నాన్నా.. నేను క్షేమంగానే ఉన్నాను.. నన్ను పికప్ చేసుకోండి' అని చెప్పిందని ఆమె తండ్రి నరేంద్ర సర్నా చెప్పారు. బహుశా కిడ్నాప్ చేయడం వాళ్లకు ఇదే మొదటిసారి అయి ఉంటుందని అందుకే భయపడి వదిలిపెట్టేసి ఉంటారని ఆయన అన్నారు. ఆమె కళ్లకు గంతలు కట్టి తెల్లవారుజామున 3-4 గంటల సమయంలో ఏదో రైల్వేస్టేషన్ వద్ద వదిలేశారిన తన కూతురు చెప్పిందన్నారు. అయితే దీప్తి ఫోన్, బ్యాగ్ మాత్రం మిస్సయ్యాయి. పోలీసులు ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేసుకుని, కిడ్నాపర్ల కోసం గాలిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement