breaking news
deepti kidnapped
-
దీప్తి ఎలా అదృశ్యమైందంటే..
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో స్నాప్ డీల్ ఉద్యోగిని దీప్తి సర్నాకు ఎలాంటి హానీ తలపెట్టకుండా, డబ్బు రూపంలో డిమాండ్లు చేయకుండా కిడ్నాపర్లు ఆమెను క్షేమంగా వదిలిపెట్టడంతో కథ సుఖాంతమైంది. ఓ మహిళతో కలసి ఇద్దరు దుండగులు ఆమెను కిడ్నాప్ చేశారు. కాగా ఆమెను ఎందుకు కిడ్నాప్ చేశారన్నది పోలీసుల విచారణలో తేలాల్సివుంది. దీప్తి తండ్రి మాత్రం.. ఈ వార్తను మీడియా ఎక్కువగా ఫోకస్ చేయడం, పోలీసులు వెంటనే రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టడంతో కిడ్నాపర్లు భయపడి తన కుమార్తెను క్షేమంగా విడిచిపెట్టారని చెబుతున్నారు. దీప్తి కిడ్నాప్ ఉదంతంలో ఎప్పుడు ఏం జరిగిందంటే.. బుధవారం రాత్రి గుర్గావ్లోని స్నాప్ డీల్ సంస్థలో విధులు ముగించుకొని తిరిగివెళ్తుండగా ఘజియాబాద్‌లో దీప్తి అదృశ్యమైంది దీప్తి షేర్ ఆటోలో వెళ్తుండగా అది చెడిపోవడంతో మరో ఆటోలోకి మారింది. ఈ ఆటోలో ఇద్దరు మగవాళ్లు, ఓ మహిళ ఉన్నారు ఆటోను దారి మళ్లించడంతో దీప్తి ఆటో డ్రైవర్‌ను ప్రశ్నించింది. వెంటనే ఆటోలో ఉన్న మహిళ కత్తి చూపించి దీప్తిని బెదిరించింది అదే సమయంలో దీప్తి ఫోన్ చేసి తన తండ్రికి విషయం చెప్పింది. ఆటో ఆపాల్సిందిగా దీప్తి వేసిన కేకలు ఫోన్లో తండ్రికి వినిపించాయి. కాసేపటికి ఫోన్ స్విచాఫ్ అయ్యింది దీప్తి తండ్రి ఫిర్యాదు మేరకు 200 మంది పోలీసులు రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టారు కిడ్నాపర్లు రాజ్ నగర్ ఏరియాలో గుర్తుతెలియని ప్రాంతంలో దీప్తిని బంధించారు కిడ్నాపర్లు దీప్తికి ఎలాంటి హానీ తలపెట్టకుండా, భోజనం పెట్టారు (ఈ విషయం దీప్తి పోలీసులకు చెప్పింది) ఆ మరుసటి రోజు ఉదయం కిడ్నాపర్లు రైల్వే స్టేషన్ సమీపంలో దీప్తిని వదిలిపెట్టారు దీప్తి ఓ ప్రయాణికుడి ఫోన్ తీసుకుని తన తండ్రికి సమాచారం అందించింది -
కిడ్నాపర్లు నన్ను బాగా చూసుకున్నారు
కిడ్నాపర్లు తనను చాలా బాగా చూసుకున్నారని, సమయానికి భోజనం కూడా పెట్టారని.. అందువల్ల వాళ్లను ఏమీ చేయొద్దని స్నాప్ డీల్ ఉద్యోగిని దీప్తి సర్నా చెబుతోంది. తన నుంచి గానీ, తన తండ్రి నుంచి గానీ డబ్బులు కూడా ఏమీ డిమాండ్ చేయలేదని.. అందుకే వాళ్ల మీద కేసులు కూడా ఏమీ పెట్టొద్దని అంటోంది. బుధవారం రాత్రి గుర్గావ్లోని స్నాప్ డీల్ సంస్థలో విధులు ముగించుకొని తిరిగివెళ్తుండగా ఘజియాబాద్‌లో దీప్తి అదృశ్యమైన సంగతి తెలిసిందే. 40 గంటల తర్వాత హర్యానాలోని పానిపట్ వద్ద ఆమెను పోలీసులు గుర్తించారు. తన కూతురు తనకు శుక్రవారం ఉదయం 7 గంటల సమయంలో ఫోన్ చేసి, 'నాన్నా.. నేను క్షేమంగానే ఉన్నాను.. నన్ను పికప్ చేసుకోండి' అని చెప్పిందని ఆమె తండ్రి నరేంద్ర సర్నా చెప్పారు. బహుశా కిడ్నాప్ చేయడం వాళ్లకు ఇదే మొదటిసారి అయి ఉంటుందని అందుకే భయపడి వదిలిపెట్టేసి ఉంటారని ఆయన అన్నారు. ఆమె కళ్లకు గంతలు కట్టి తెల్లవారుజామున 3-4 గంటల సమయంలో ఏదో రైల్వేస్టేషన్ వద్ద వదిలేశారిన తన కూతురు చెప్పిందన్నారు. అయితే దీప్తి ఫోన్, బ్యాగ్ మాత్రం మిస్సయ్యాయి. పోలీసులు ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేసుకుని, కిడ్నాపర్ల కోసం గాలిస్తున్నారు.