జెట్ ఎయిర్‌వేస్‌ వాలెంటైన్స్‌ డే ఆఫర్‌ | jet Airways Offers All-Inclusive Rs. 999 Fare In Valentine's Day Sale | Sakshi
Sakshi News home page

జెట్ ఎయిర్‌వేస్‌ వాలెంటైన్స్‌ డే ఆఫర్‌

Feb 14 2017 2:15 PM | Updated on Sep 5 2017 3:43 AM

జెట్ ఎయిర్‌వేస్‌ వాలెంటైన్స్‌ డే ఆఫర్‌

జెట్ ఎయిర్‌వేస్‌ వాలెంటైన్స్‌ డే ఆఫర్‌

వాలెంటైన్స్‌ డే సందర్భంగా జెట్ ఎయిర్వేస్ నాలుగు రోజుల అమ్మకాలకు తెరతీసింది.

ముంబై: అంచనాలకు తగ్గట్టుగానే మరో ఎయిర్‌  వేస్‌  కూడా  తగ్గింపు ధరలను ప్రకటించింది. వాలెంటైన్స్‌ డే సందర్భంగా  జెట్ ఎయిర్వేస్ నాలుగు రోజుల అమ్మకాలకు తెరతీసింది.  అన్నీకలిపి దేశీయ రూట్లలోరూ.999 నుంచి ప్రారంభమయ్యే డిస్కౌంట్‌ ధరలను మంగళవారం ప్రకటించింది. వాలెంటైన్స్ డే వేడుకలు లక్ష్యంగా భాగంగా ఫిబ్రవరి 17 లోపు బుక్‌ చేసుకున్న ఈ ప్రత్యేక ఆఫర్‌ టికెట్లతో దేశీయ  నెట్‌ వర్క్‌ ద్వారా  మార్చి 17, 2017 దాకా ప్రయాణించేందుకు అవకాశం ఉందని జెట్‌ ఎయిర్‌ వేస్‌ ఒక పత్రికా  ప్రకటనలో తెలిపింది.

అలాగే ఇవాళ రేపు(ఫిబ్రవరి 14, 15తేదీలు)  తమ ఎయిర్‌ లెన్స్‌ ద్వారా ప్రయాణించే ప్రయాణికులకు మరో లక్కీ ఆఫర్‌ కూడా ప్రకటించింది.  సెలెక్టెడ్‌ జెట్‌ విమానాల్లో ప్రయాణించే లక్కీ ప్రయాణికులకు  వెంటనే చేసుకునే  తదుపరి బుకింగ్లో ప్రత్యేక తగ్గింపు ధరను అందించనున్నట్టు  తెలిపింది.  తామిచ్చే ప్రోమోకోడ్‌ ద్వారా  నిబంధనల ప్రకారం తదుపరి రిటర్న్‌ జర్నీలో రూ.500తగ్గింపు అందించనున్నట్టు తెలిపింది.  సందర్భానికి తగినట్టుగా  అద్భుతమైన ప్రమోషన్లు , ప్యాకేజీలను  అందుబాటులోకి తీసుకొచ్చినట్టు  చీఫ్‌ కమర్షియల్‌ ఆఫీసర్‌ జయరాజ్ షణ్ముగం  తెలిపారు.  ఈ సందర్భంగా వాలెంటైన్స్‌ డే   శుభాకాంక్షలు తెలిపారు.

కాగా  వాలెంటైన్స్ డే సందర్భంగా మరో విమానయాన సంస్థ విస్తారా  రూ.899నుంచి ప్రారంభమయ్యే డిస్కౌంట్‌ ధరలను వెల్లడించింది. దీంతోపాటు బిజినెస్ క్లాస్, ఎకానమీ, మియం ఎకానమీ స్పెషల్‌ డిస్కౌంట్‌ను  ప్రకటించిన సంగతి తెలిసిందే.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement