పది రోజులు అమెరికాలో అరుణ్ జైట్లీ | Jaitley to embark on 10-day US visit from Tuesday | Sakshi
Sakshi News home page

పది రోజులు అమెరికాలో అరుణ్ జైట్లీ

Jun 14 2015 5:37 PM | Updated on Apr 6 2019 9:38 PM

పది రోజులు అమెరికాలో అరుణ్ జైట్లీ - Sakshi

పది రోజులు అమెరికాలో అరుణ్ జైట్లీ

కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ మంగళవారం అమెరికా వెళ్లనున్నారు. పది రోజుల పాటు అక్కడ ప్రముఖ నగరాల్లో జైట్లీ పర్యటించనున్నారు

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ మంగళవారం అమెరికా వెళ్లనున్నారు. పది రోజుల పాటు అక్కడ ప్రముఖ నగరాల్లో జైట్లీ పర్యటించనున్నారు. ఆమెరికా ట్రెజరీ సెక్రటరీ జాకబ్ లూ, ఫారీన్ ఇన్ స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్(ఎఫ్ఐఐఎస్), పారిశ్రామిక వేత్తలతో సమావేశం కానున్నారు. అధికారవర్గాల సమాచారం మేరకు జూన్ 25నాటికి ముగిసే ఈ పర్యటనలో న్యూయార్క్, వాషింగ్టన్, శాన్ ఫ్రాన్సిస్కో నగరాలను సందర్శించి అక్కడ ఆర్థిక నిపుణలతో సమాలోచనలు జరుపుతారు.

వాషింగ్టన్లో ఆర్థికమంత్రుల సమావేశంలోపాల్గొనడంతోపాటు శాన్ ప్రాన్సిస్కోలో అమెరికా-ఇండియా వ్యాపారవేత్తల మండలితో రౌండ్ సమావేశంలో పాల్గొంటారు. దీంతోపాటు న్యూయార్క్ స్టాక్ ఎక్సేంజి అధికారులతో కూడా జైట్లీ భేటీ అవనున్నారు. ఎఫ్ డీఐల వ్యవహారాలు కూడా జైట్లీ చర్చించనున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement