రజనీకాంత్ రాజకీయ ప్రవేశం చేస్తారా? | Is Narendra Modi impact on Rajinikanth to join in politics? | Sakshi
Sakshi News home page

రజనీకాంత్ రాజకీయ ప్రవేశం చేస్తారా?

Sep 20 2013 2:49 PM | Updated on Mar 29 2019 9:18 PM

రజనీకాంత్ రాజకీయ ప్రవేశం చేస్తారా? - Sakshi

రజనీకాంత్ రాజకీయ ప్రవేశం చేస్తారా?

దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశంపై చాలానే వార్తలు గతంలో వచ్చాయి.

దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశంపై చాలానే వార్తలు గతంలో వచ్చాయి. తాజాగా తమిళనాడులో రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నారంటూ రూమర్లు షికారు చేస్తున్నాయి. అయితే  రాజకీయ రంగ ప్రవేశంపై రజనీకాంత్ ఎలాంటి ఖండన ఇవ్వకపోవడంతో రూమర్లకు మరింత బలం చేకూరుతోంది. అయితే ఈసారి రాజకీయాల్లో ప్రవేశించడానికి బీజేపీ ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ స్పూర్తి అని వార్తలు వెలువడుతున్నాయి. అంతేకాకుండా నరేంద్ర మోడితో రజనీకాంత్ సన్నిహిత సంబంధాలు ఉండటమే రాజకీయ రంగ ప్రవేశ వార్తకు ప్రధాన కారణమని తెలుస్తోంది. 
 
సెప్టెంబర్ 26 తేదిన త్రిచీలో నరేంద్రమోడీ సభ జరుగనుండటంతో బీజేపీ తమిళనాడు రాష్ట్ర శాఖ అధ్యక్షుడు పొన్ రాధకృష్ణన్ ఇప్పటికే రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలంటూ విజ్క్షప్తి చేశారు. రజనీ రాజకీయ రంగ ప్రవేశంపై బీజేపీ వార్తలను లీక్ చేసిందని మరో వాదన వినిపిస్తోంది. ఇదిలా ఉండగా, రజనీకాంత్ నటించిన కొచ్చడయాన్ చిత్రం ఆయన పుట్టిన రోజు డిసెంబర్ 12 తేదిన విడుదల చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement