ఇంటెక్స్ కొత్త 4జీ ఫోన్.. ధర ఆరువేలే! | Intex Cloud Q11 4G With Selfie Flash, VoLTE Launched at Rs. 6,190 | Sakshi
Sakshi News home page

ఇంటెక్స్ కొత్త 4జీ ఫోన్.. ధర ఆరువేలే!

Jan 25 2017 3:16 PM | Updated on Sep 5 2017 2:06 AM

ఇంటెక్స్ కొత్త 4జీ ఫోన్.. ధర ఆరువేలే!

ఇంటెక్స్ కొత్త 4జీ ఫోన్.. ధర ఆరువేలే!

దేశీయ స్మార్ట్ఫోన్ మార్కెట్లో దూసుకుపోతున్న ఇంటెక్స్ సరికొత్త 4జీ స్మార్ట్ఫోన్ బుధవారం విడుదల చేసింది.

దేశీయ స్మార్ట్ఫోన్ మార్కెట్లో దూసుకుపోతున్న ఇంటెక్స్ సరికొత్త 4జీ స్మార్ట్ఫోన్ బుధవారం విడుదల చేసింది. క్లౌడ్ క్యూ11 స్మార్ట్ఫోన్ విజయంతో, క్లౌడ్ క్యూ11 4జీ పేరుతో ఈ ఫోన్ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీని ధర రూ.6,190గా కంపెనీ నిర్ణయించింది. ప్రత్యేకంగా అమెజాన్ ఇండియా ప్లాట్ఫామ్పై ఇది అందుబాటులో ఉండనుంది.  
 
క్లౌడ్ క్యూ11 4జీ స్మార్ట్ఫోన్ ఫీచర్లు...
ఆండ్రాయిడ్ 6.0 మార్ష్మాలో
5.5 అంగుళాల హెచ్డీ ఐపీఎస్ డిస్ప్లే
1.2 గిగాహెడ్జ్ క్వాడ్-కోర్ మీడియా టెక్ ఎంటీ6737వీ ప్రాసెసర్
1జీబీ ర్యామ్
8జీబీ ఇన్బిల్ట్ స్టోరేజ్
32జీబీ వరకు విస్తరణ మెమరీ
8ఎంపీ రియర్ ఆటోఫోకస్ కెమెరా విత్ డ్యూయల్ ఎల్ఈడీ ఫ్లాష్‌
5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్
2800 ఎంఏహెచ్ బ్యాటరీ
ఈ వారంలో మొదట్లోనే క్లౌడ్ స్టైల్ 4జీ స్మార్ట్ఫోన్ను కంపెనీ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దాని ధర రూ.5,799. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement