బ్లడ్‌ శాంపిల్స్‌ ఇచ్చేందుకు నిరాకరించిన నవదీప్‌ | hyderabad drugs case: sit questioned navadeep | Sakshi
Sakshi News home page

బ్లడ్‌ శాంపిల్స్‌ ఇచ్చేందుకు నిరాకరించిన నవదీప్‌

Jul 24 2017 10:35 PM | Updated on Nov 6 2018 4:42 PM

బ్లడ్‌ శాంపిల్స్‌ ఇచ్చేందుకు నిరాకరించిన నవదీప్‌ - Sakshi

బ్లడ్‌ శాంపిల్స్‌ ఇచ్చేందుకు నిరాకరించిన నవదీప్‌

డ్రగ్స్‌ కేసుకు సంబంధించి టాలీవుడ్‌ నటుడు నవదీప్‌ విచారణ ముగిసింది.

హైదరాబాద్: డ్రగ్స్‌ కేసుకు సంబంధించి టాలీవుడ్‌ నటుడు నవదీప్‌ విచారణ ముగిసింది.

సోమవారం ఉదయం ఆబ్కారీ కార్యాలయానికి వచ్చిన ఆయనను సిట్‌ అధికారులు 11 గంటలపాటు ప్రశ్నించారు. కేసుకు సంబంధించిన అనేక వివరాలను రాబట్టినట్లు సమాచారం.


శాంపిల్స్‌ ఇచ్చేందుకు నిరాకరణ: విచారణ సందర్భంగా నవదీప్‌ డ్రగ్స్‌ వినియోగించాడా లేదా అనేది తెలుసుకునేందుకుగా ఆయన రక్తనమూనాలు సేకరించాలని అధికారులు భావించారు. ఇందుకోసం ఉస్మానియా వైద్యులను పిలిపించేందుకు సిద్ధమయ్యారు. కానీ బ్లడ్‌ శాంపిల్స్‌ ఇచ్చేందుకు నవదీప్‌ నిరాకరించడం గమనార్హం.

విచారణ అనంతరం నవదీప్‌ కొద్దిసేపు మీడియాతో మాట్లాడారు. ‘డ్రగ్స్‌ గురించి నాకు తెలిసింది చెప్పా. అవసరమైతే మళ్లీ కాల్‌ చేస్తామన్నారు. విచారణకోసం ఎప్పుడు పిలిచినా వస్తా..’అని నవదీప్‌ అన్నారు. రాత్రి 10 గంటలకు ఆయన ఆబ్కారీ ఆఫీసు నుంచి ఇంటికి వెళ్లిపోయారు.రేపు ఆర్ట్‌ డైరెక్టర్‌ చిన్నాను సిట్‌ ప్రశ్నించనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement