నాయిని గారూ.. మమ్మల్ని ఆదుకోండి | Home Minister is the place for the families of the martyrs of the request | Sakshi
Sakshi News home page

నాయిని గారూ.. మమ్మల్ని ఆదుకోండి

Aug 18 2015 1:07 AM | Updated on Jul 25 2018 2:52 PM

నాయిని గారూ.. మమ్మల్ని ఆదుకోండి - Sakshi

నాయిని గారూ.. మమ్మల్ని ఆదుకోండి

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు కోల్పోయిన అమరుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని ....

హోంమంత్రికి అమరవీరుల కుటుంబాల వేదిక వినతి

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు కోల్పోయిన అమరుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని ‘అమరవీరుల కుటుం బాల వేదిక’ సోమవారం సచివాలయంలో హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డిని కలసి ఒక వినతిపత్రం అందజేసింది.

సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలైన ‘విద్యార్హతల ప్రకారం ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగ అవకాశం, ఒక ఇల్లు, మూడెకరాల భూమి, ప్రత్యేక ఆరోగ్య కార్డు, తల్లిదండ్రులకు పింఛన్, ఆయా కుటుంబాలు నివసించే గ్రామాలలో అమరవీరుల స్తూపం నిర్మాణం’ వంటి వాటిని త్వరితగతిన చేపట్టాలని విన్నవించింది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement