తెలంగాణలో గ్రామజ్యోతి పథకం


హైదరాబాద్: తెలంగాణలో గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా వచ్చే నెల 15 నుంచి గ్రామజ్యోతి పథకం అమలు చేయనున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ ఈ విషయాన్ని వెల్లడించారు. వచ్చే ఐదేళ్లలో గ్రామీణ ప్రాంతాల్లో 25 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామని కేసీఆర్ చెప్పారు.జనాభాను బట్టి ఒక్కో గ్రామానికి 2 కోట్ల నుంచి 6 కోట్ల రూపాయలు కేటాయించనున్నట్టు తెలిపారు. ప్రణాళిక ప్రకారం గ్రామ పంచాయతీల్లో మౌళిక సదుపాయాల కల్పనకు గ్రామజ్యోతి పథకం ప్రవేశపెడుతున్నట్టు కేసీఆర్ చెప్పారు. ఈ పథకం అమలు కోసం మంత్రి కేటీఆర్ అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఈ కమిటీలో మంత్రులు ఈటల రాజేందర్, తుమ్మల నాగేశ్వర్ రావు, పోచారం శ్రీనివాసరెడ్డి, హరీష్ రావు, జోగు రామన్న సభ్యులుగా ఉంటారని కేసీఆర్ వెల్లడించారు.

Read latest Top News News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top