యూపీఏ పలాయనం చిత్తగించింది: సబ్బం హరి | government went back intentionally, comments Sabbam Hari | Sakshi
Sakshi News home page

యూపీఏ పలాయనం చిత్తగించింది: సబ్బం హరి

Dec 11 2013 12:30 PM | Updated on Mar 18 2019 9:02 PM

యూపీఏ పలాయనం చిత్తగించింది: సబ్బం హరి - Sakshi

యూపీఏ పలాయనం చిత్తగించింది: సబ్బం హరి

యూపీఏ సర్కార్ పలాయనం చిత్తగించిందని కాంగ్రెస్ ఎంపీ సబ్బం హరి వ్యాఖ్యానించారు.

న్యూఢిల్లీ : అవిశ్వాస తీర్మానంపై యూపీఏ సర్కార్ పలాయనం చిత్తగించిందని కాంగ్రెస్ ఎంపీ సబ్బం హరి వ్యాఖ్యానించారు. లోక్సభ వాయిదా అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అవిశ్వాస తీర్మానానికి సభలో తమకు మద్దతు ఉందని తెలిసే... ప్రతిపక్షాలతో కలిసి కాంగ్రెస్ కుట్ర పన్నుతోందన్నారు. సభ సజావుగా జరిగేందుకు కాంగ్రెస్ సహకరించటం లేదని సబ్బం హరి అన్నారు. అవిశ్వాస తీర్మానంపై చర్చకు తమకు స్పష్టమైన మద్దతు ఉందని.. అది తెలిసే చర్చ జరగకుండా ఉండేందుకు సభలో గందరగోళం సృష్టిస్తోందని ఆయన విమర్శించారు.

 అంతే కాకుండా అవిశ్వా తీర్మానంపై చర్చ జరగకుండా పార్లమెంట్ సమావేశాలను కేంద్ర ప్రభుత్వం ప్రొరోగ్ చేయాలనుకుంటున్నట్లు సబ్బం హరి ఆరోపించారు. తమను సస్పెండ్ చేసినా వెనకాడేది లేదని...తాము ఎవరికీ అమ్ముడు పోలేదన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే పోరాడుతున్నట్లు ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ తమను సస్పెండ్ చేసేందుకు సర్వాధికారాలు ఉన్నాయన్నారు. తెలంగాణ ప్రాంత నేతలు చేసిన వ్యాఖ్యలపై సబ్బం హరి మాట్లాడేందుకు నిరాకరించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement