థానెలో వికలాంగురాలిపై సామూహిక అత్యాచారం | Girl gangraped in Thane | Sakshi
Sakshi News home page

థానెలో వికలాంగురాలిపై సామూహిక అత్యాచారం

Sep 16 2013 11:40 AM | Updated on Oct 8 2018 5:45 PM

ఎన్ని కఠిన చట్టాలు రూపొందించినా, దోషులకు మరణ శిక్షలు విధిస్తున్నా.. దేశంలో మహిళలపై ఆగడాలు జరుగుతూనే ఉన్నాయి. మహారాష్ట్రలో 19 ఏళ్ల వికలాంగురాలిని సామూహిక అత్యాచారం చేశారు.

ఎన్ని కఠిన చట్టాలు రూపొందించినా, దోషులకు మరణ శిక్షలు విధిస్తున్నా.. దేశంలో మహిళలపై ఆగడాలు జరుగుతూనే ఉన్నాయి. మహారాష్ట్రలో 19 ఏళ్ల వికలాంగురాలిని సామూహిక అత్యాచారం చేశారు. థానె జిల్లా భివండిలో ముగ్గురు దుండగులు ఈ దుశ్చర్యకు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసినట్టు చెప్పారు.

ఆరు వారాల క్రితం ఈ అమ్మాయిని బలవంతంగా నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేసినట్టు నర్పోలి పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ డి.వి.జాంగ్లె తెలిపారు. నిందితుల వయసు 27-35 ఏళ్ల మధ్య ఉంటుంది. వీరిని సోమవారం రిమాండ్కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement