ముంబైలో బాలికపై సామూహిక అత్యాచారం | Gang rape in mumbai | Sakshi
Sakshi News home page

ముంబైలో బాలికపై సామూహిక అత్యాచారం

Nov 28 2015 3:13 AM | Updated on Aug 21 2018 5:52 PM

ముంబైలో బాలికపై సామూహిక అత్యాచారం - Sakshi

ముంబైలో బాలికపై సామూహిక అత్యాచారం

పదో తరగతి చదువుతున్న 15 ఏళ్ల బాలికపై నలుగురు సహచరవిద్యార్థులు గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. ఈ దారుణం ఈ నెల 8న ముంబైలో జరిగింది.

వాట్సప్‌లో వీడియో.. నలుగురు బాలుర అరెస్టు
 
 సాక్షి, ముంబై: పదో తరగతి చదువుతున్న 15 ఏళ్ల బాలికపై నలుగురు సహచరవిద్యార్థులు గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. ఈ దారుణం ఈ నెల 8న ముంబైలో జరిగింది. అత్యాచారం చేసినప్పుడు తీసిన వీడియోను నిందితులు వాట్సప్ తదితర సామాజిక మాధ్యమాల్లో ఉంచడంతో బాలిక బంధువు గుర్తించింది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేశారు. మాలద్‌లో ఉన్న తన స్నేహితుడి ఇంటికి బాలిక చదువుకోవడానికి  వెళ్లింది. అక్కడ బాలిక స్నేహితుడు, అతని సహచరులు ముగ్గురు అత్యాచారం చేశారు.

విషయం బయట చెబితే వీడియోను సామాజిక మీడియాలో పెడతామని హెచ్చరించారు. తర్వాత వీడియోను నెట్‌లో పెట్టారు. వీడియోను చూసిన బాలిక బంధువు తల్లిదండ్రులకు చెప్పింది. వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితులను అరెస్ట్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement