
గంభీర్ బాటలో నందాల్
క్రికెటర్ గౌతమ్ గంభీర్ బాటలోనే హాకీ మాజీ ఆటగాడు అజిత్‌పాల్ నందాల్ నడిచాడు.
రొహతక్: సుక్మాలో మావోయిస్టుల దాడిలో హతమైన సీర్పీఎఫ్ జవాన్ల పిల్లల చదువు ఖర్చులు భరించేందుకు క్రికెటర్ గౌతమ్ గంభీర్ ముందుకురాగా అతడి బాటలోనే హాకీ మాజీ ఆటగాడు అజిత్‌పాల్ నందాల్ నడిచాడు. హర్యానాలో 21 మంది విద్యార్థినులను అతడు దత్తత తీసుకున్నాడు. తన సొంత గ్రామం బొహర్‌లో ప్రభుత్వ పాఠశాలలో 6 నుంచి 12వ తరగతి చదువుతున్న 21 మంది విద్యార్థినుల బాగోగులు చూసుకునేందుకు ముందుకు వచ్చాడు. వారి చదువుకయ్యే ఖర్చు భరించడంతో పాటు క్రీడల్లో రాణించేందుకు అండగా నిలవనున్నాడు.
12 తరగతి పరీక్షలు పూర్తయ్యే వరకు వీరికి ఆర్థికంగా చేయూత అందిస్తానని నందాల్ ప్రకటించాడు. పేదరికంతో చదువు కొనసాగిస్తున్న వీరు క్రీడల్లోనూ రాణించేందుకు అవసరమైన శిక్షణ ఉచితంగా ఇస్తానని పేర్కొన్నాడు. బాలికలను ప్రోత్సహిస్తే అద్భుతాలు సాధిస్తారని దత్తత కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రొహతక్ ఎస్పీ పంకజ్ నైన్ అన్నారు. జిల్లా పోలీసులు ఇప్పటికే బొహర్ గ్రామాన్ని దత్తత తీసుకున్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు.