
‘ఫేస్‌బుక్’ ప్రేమ ఇలా వికటించింది...
ఫేస్‌బుక్ ద్వారా పరిచయం చేసుకుని పెళ్లి చేసుకుంటానని ఓ యువతిని నమ్మించి మొహం చాటేసిన యువకుడిని చైతన్యపురి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
చైతన్యపురి: ఫేస్‌బుక్ ద్వారా పరిచయం చేసుకుని పెళ్లి చేసుకుంటానని ఓ యువతిని నమ్మించి మొహం చాటేసిన యువకుడిని చైతన్యపురి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఎస్‌ఐ కోటయ్య తెలిపిన వివరాల ప్రకారం... కృష్ణా జిల్లా వత్సవాయి మండలం కంభంపాడుకు చెందిన సూర్యదేవర రమేష్ (24) బీటెక్ పూర్తిచేసి చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజీవ్‌గాంధీనగర్‌లో ఉంటున్నాడు. ఫేస్‌బుక్ ద్వారా గుంటూరు జిల్లా అమర్తలూరు మండలం కూచిపూడి గ్రామానికి చెందిన వెనిగల్ల పూజిత( 19) పరిచయం అయింది. వీరి ఫేస్‌బుక్ పరిచయం ప్రేమకు దారి తీసింది. దీంతో రమేష్ పెళ్లి చేసుకుంటానని హైదరాబాద్‌కు రమ్మని ఆ యువతిని నమ్మించాడు.
గత నెల 25న సికింద్రాబాద్ ట్రయిన్‌లో వచ్చిన పూజితను రాజీవ్‌గాంధీనగర్‌లోని తన గదికి తీసుకొచ్చి మూడురోజులు ఉంచుకున్నాడు. ఇంట్లో పెద్ద వాళ్లకు చెప్పి వివాహం చేసుకుంటానని నమ్మించి ఆమెను తిరిగి ఇంటికి పంపించి వేశాడు. అప్పటి నుంచి ఎన్ని సార్లు ఫోన్ చేసినా స్పందనలేక పోవటంతో జరిగిన సంఘటనను తల్లిదండ్రులకు చెప్పింది. వారు నగరానికి వచ్చి రమేష్‌ను నిలదీయగా వివాహం చేసుకోనని చెప్పాడు. దీంతో పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసి గురువారం రమేష్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు త రలించినట్టు ఎస్‌ఐ తెలిపారు.