ఎస్‌ఐ పాడుపని.. షాకింగ్‌ ట్విస్ట్‌ ఇచ్చిన కాలేజీ అమ్మాయి | Si Cheated Young Woman With Name Of Love In Karnataka | Sakshi
Sakshi News home page

ఎస్‌ఐ పాడుపని.. షాకింగ్‌ ట్విస్ట్‌ ఇచ్చిన కాలేజీ అమ్మాయి

Feb 19 2023 9:01 AM | Updated on Feb 19 2023 9:01 AM

Si Cheated Young Woman With Name Of Love In Karnataka - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

తనపై ఎస్‌ఐ లైంగిక దాడి చేసినట్లు కాలేజీ విద్యార్థిని బెళగావి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

సాక్షి, కర్ణాటక: తనపై ఎస్‌ఐ లైంగిక దాడి చేసినట్లు కాలేజీ విద్యార్థిని బెళగావి పోలీసులకు ఫిర్యాదు చేసింది. నగర పోలీసు కమిషనర్‌ కార్యాలయంలో వైర్లెస్‌ విభాగంలో ఎస్‌ఐగా పని చేస్తున్న లాల్‌సాబ్‌ తనను ప్రేమ, పెళ్లి పేరుతో మభ్యపెట్టి దైహికంగా వాడుకొని మోసం చేశాడని విద్యార్థిని ఫిర్యాదు చేయగా లాల్‌సాబ్‌పై కేసు నమోదు చేశారు.

ఈ నెల 10న మరో యువతిని అతడు పెళ్లాడినట్లు బాధితురాలు తెలిపింది.  ఫేస్‌బుక్‌ ద్వారా 2020 జూన్‌లో పరిచయం అయిన లాల్‌సాబ్‌ ప్రేమ పేరుతో వంచించాడని, తనకు న్యాయం చేయాలని బాధితురాలు డిమాండ్‌ చేసింది.
చదవండి: రెండేళ్ల క్రితం పెళ్లి.. భర్తతో ఇష్టం లేక.. ప్రియుడిని మర్చిపోలేక..  

Advertisement
 
Advertisement
Advertisement