కాంగ్రెస్ అధిష్టానం సొంత పార్టీ ఎంపీలనే మోసగించి రాష్ట్ర విభజన ప్రకటన చేసిందని అనంతపురం ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి దుయ్యబట్టారు.
సొంత ఎంపీలనే మోసం చేసిన కాంగ్రెస్: ఎంపీ అనంత
Oct 16 2013 2:19 AM | Updated on Mar 18 2019 9:02 PM
కాంగ్రెస్ అధిష్టానం సొంత పార్టీ ఎంపీలనే మోసగించి రాష్ట్ర విభజన ప్రకటన చేసిందని అనంతపురం ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి దుయ్యబట్టారు. సీమాంధ్ర ప్రజల అకాంక్షలకు అనుగుణంగా తాను చేసిన రాజీనామాపై వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. మంగళవారం ఆయన అనంతపురంలో విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్, నదీ జలాల పంపిణీపై ఎటువంటి స్పష్టతా ఇవ్వకుండానే రాష్ట్ర విభజనకు పూనుకోవడం శోచనీయమన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని సీమాంధ్ర ప్రాంత ఎంపీలంతా కలసి నచ్చజెప్పడానికి ప్రయత్నించినా వినిపించుకునే నాథులే కరువయ్యారన్నారు. తమ వాదనను వినిపించేందుకు సోనియాగాంధీ అపాయింట్‌మెంట్ కోసం ఎన్ని సార్లు ప్రయత్నించినా లాభం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజనపై అధిష్టానం కూడా పూటకో ప్రకటన చేస్తూ అందర్నీ గందరగోళంలో పడేస్తోందని విమర్శించారు.
Advertisement
Advertisement