ఆప్టెక్ బిగ్ ర్యాలీ | Aptech's Preschool Foray Adds More Steam To Big Rally | Sakshi
Sakshi News home page

ఆప్టెక్ బిగ్ ర్యాలీ

Sep 8 2016 2:58 PM | Updated on Oct 4 2018 5:44 PM

ఎడ్యుకేషన్ ట్రైనింగ్ ప్రొవైడర్ ఆప్టెక్ ప్రీ స్కూల్ రంగంలో అడుగుపెడుతున్నామన్న ప్రకటన కంపెనీకి మరింత బూష్ట్ ఇచ్చింది. ఈ కొత్త వెంచర్ కోసం అంతర్జాతీయ మోంటానా ప్రీస్కూల్ తో భారీ ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలిపింది.

ఎడ్యుకేషన్ ట్రైనింగ్ ప్రొవైడర్ ఆప్టెక్  ప్రీ స్కూల్  రంగంలో అడుగుపెడుతున్నామన్న ప్రకటన కంపెనీకి మరింత బూష్ట్ ఇచ్చింది.   ఈ  కొత్త వెంచర్ కోసం అంతర్జాతీయ  మోంటానా  ప్రీస్కూల్ తో భారీ ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలిపింది. ట్రేడ్ పండితుడు  రాకేష్ ఝున్ ఝన్ వాలా  ఇటీవల భారీ వాటా కొనుగోలుతో  జోరుగా ఉన్న ఆప్టెక్ మార్కెట్ బలహీనంగా ఉన్నప్పటికీ, ఈ  పొత్తు వార్తల నేపథ్యంలో మార్కెట్ లో ఆప్ టెక్ షేరు దూసుకు పోయింది. ఈ డీల్ ప్రకారం  ఆప్టెక్ రాబోయే  రెండు సంవత్సరాలలో భారతదేశం లో 1,000 ప్రీస్కూల్స్ ఏర్పాటు చేసేందుకు  యోచిస్తున్నట్టు  ప్రకటించింది.

ఎడ్యుకేషన్ రంగంలో వేగమైన అభివృద్ధి ఉందని ఆప్టెక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనుజ్ కేకర్ చెప్పారు.  ప్రస్తుతం భారతదేశంలో ప్రీస్కూల్ విద్య  మార్కెట్ రూ16,000 కోట్లుగా ఉందని  తెలిపారు. దీంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లతో  ఐటీ శిక్షణా దిగ్గజం ఆప్టెక్‌  షేరు 10 శాతం లాభపడింది.  52 వారాల గరిష్టంతో అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. ఆప్టెక్ 10,000 కిపైగా బ్యాంకింగ్ మరియు ఆర్థిక నిపుణులకు శిక్షణ ఇచ్చేందుకు జీయోజిత్  బీఎన్సీ పరిబాస్ తో కుదిరిన ఒప్పందాన్ని  జూలై లో ప్రకటించింది.  దీంతోపాటుగా ఎన్ఎస్ఇ డేటా ప్రకారం ఆగస్ట్లో  ఆప్టెక్ లో ప్రధాన  ప్రమోటర్లగా ఉన్న ఇన్వెస్టర్‌ రాకేష్‌ ఝున్‌ఝున్‌వాలా కుటుంబం మరింత వాటాను కొనుగోలు చేశారు సంగతి తెలిసిందే. దీంతో ఆప్టెక్ షేర్లు గత మూడు నెలల్లో శాతం 150 శాతం లాభపడిందని నిపుణులు   తెలిపారు.
కాగా గత జూన్ త్రైమాసికంలో ఆప్టెక్ లిమిటెడ్ రూ 0.46 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇది రూ.2.84 కోట్లు. అయితే ఆదాయంలో మాత్రం  వృద్ధిని  సాధించి రూ 58 కోట్లుగా నమోదుచేసింది.   గత ఏడాది ఇదే త్రైమాసికంలో 50 కోట్లుగా ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement