ఆ వయసులో ఫస్ట్ సైట్ లవ్వా? | Age increases belief in love at first sight | Sakshi
Sakshi News home page

ఆ వయసులో ఫస్ట్ సైట్ లవ్వా?

Jul 25 2014 1:22 PM | Updated on Apr 4 2019 5:12 PM

ఆ వయసులో ఫస్ట్ సైట్ లవ్వా? - Sakshi

ఆ వయసులో ఫస్ట్ సైట్ లవ్వా?

మీరు తొలి చూపులోనే ప్రేమలో పడాలనుకుంటున్నారా. అయితే మీకు 35 ఏళ్ల వయసు వచ్చే వరకు ఆగాల్సిందే.

మీరు తొలి చూపులోనే ప్రేమలో పడాలనుకుంటున్నారా. అయితే మీకు 35 ఏళ్ల వయసు వచ్చే వరకు ఆగాల్సిందే. ఇదేం మెలిక అంటారా. యువత కంటే మధ్య వయస్కులే ముందు చూపులోనే లవ్ లో పడిపోతారని అమెరికా అధ్యయనవేత్తలు అంటున్నారు. ఏదో ఆషామాషీగా వారి విషయం చెప్పడం లేదు. ఎంతో మంది అభిప్రాయాలు తీసుకుని దీన్ని రూడీ చేశారు.

తొలిచూపులోనే ప్రేమ పుడుతుందా అని అమెరికా డేటింగ్ వెబ్సైట్ డేటింగ్ఎడ్వైజ్ డాట్కామ్ సర్వే నిర్వహించింది. నిజమైన ప్రేమ తొలిచూపులోనే పుడుతుందని అత్యధికంగా 46 శాతం మంది అభిప్రాయపడ్డారు. వీరంతా 35 నుంచి 44 ఏళ్ల వయసున్న స్త్రీపురుషులు కావడం విశేషం. మహిళలు(53 శాతం) కంటే పురుషులు(63 శాతం) తొలిచూపు ప్రేమపై విశ్వాసం వ్యక్తం చేయడం విశేషం. ప్రతి ఐదుగురిలో ముగ్గురు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

బంధాల గాఢతను అంచనా వేయడంలో మధ్యవయస్కులకు అనుభవం ఉండడం కారణంగానే వారు 'ఫస్ట్ సైట్ లవ్'పై నమ్మకముంచుతున్నారని డేటింగ్ఎడ్వైజ్ డాట్కామ్ మహిళా డేటింగ్ ఎక్స్ఫర్ట్ రాచెల్ డాక్ పేర్కొన్నారు. ప్రేమ అంటే ఏమిటి అనే దానిపై 35 ఏళ్లలోపు వారికి స్పష్టత ఉంటుందని ఆమె విశ్లేషించారు. అయితే ప్రతి ఐదుగురిలో ఇద్దరు మాత్రం తొలిచూపు ప్రేమను కొట్టిపారేశారు. కాబట్టి 'ఫస్ట్ సైట్ లవ్'కు కాస్త ఆగాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement