బీజేపీలో జేవీపీ విలీనం | A faction of Jharkhand Vikas Morcha merges with BJP | Sakshi
Sakshi News home page

బీజేపీలో జేవీపీ విలీనం

Aug 21 2014 2:34 PM | Updated on Sep 2 2017 12:14 PM

జార్ఖండ్ వికాస్ మోర్చా (జేవీపీ-ప్రజాతాంత్రిక్)లోని ఒక వర్గం బుధవారం లాంఛనంగా బీజేపీలో విలీనమైంది.

రాంచి: జార్ఖండ్ వికాస్ మోర్చా (జేవీపీ-ప్రజాతాంత్రిక్)లోని ఒక వర్గం బుధవారం లాంఛనంగా బీజేపీలో విలీనమైంది. కేపీ శర్మ అధ్యక్షతలోని జేవీపీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు- సర్మేశ్ సింగ్, చంద్రికా మహతా, జై ప్రకాశ్  భోక్తా, నిర్భయ్ సహవాది, పూల్‌చంద్ మండల్ బీజేపీలో చేరారు.

రాంచీలోని పార్టీ కార్యాలయంవద్ద జరిగిన కార్యక్రమంలో సీనియర్ బీజేపీ నేత అర్జున్ ముండా, పార్టీ ప్రధాన కార్యదర్శి భూపేంద్ర యాదవ్, జార్ఖండ్ శాఖ అధ్యక్షుడు రవీంద్ర రాయ్ వారిని పార్టీలోకి స్వాగతించారు. జేవీపీ-ప్రజాతాంత్రిక్ అధ్యక్షుడు బాబూలాల్ మారాండీ కూడా బీజేపీలో చేరాలని అర్జున్ ముండా విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement