టీచర్పై విద్యార్థి కత్తితో దాడి | A 14-year-old Asian boy in the UK stabbed his teacher | Sakshi
Sakshi News home page

టీచర్పై విద్యార్థి కత్తితో దాడి

Jun 11 2015 7:29 PM | Updated on Sep 3 2017 3:35 AM

టీచర్పై విద్యార్థి కత్తితో దాడి

టీచర్పై విద్యార్థి కత్తితో దాడి

పద్నాలుగేళ్ల విద్యార్థి ఉపాధ్యాయుడిని కత్తితో పొడిచిన ఘటన లండన్ లోని ఓ పాఠశాలలో చోటుచేసుకుంది. పరారీలో ఉన్న ఆ విద్యార్థిని పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా గాలింపులు జరుపుతున్నారు.

లండన్: పద్నాలుగేళ్ల విద్యార్థి ఉపాధ్యాయుడిని కత్తితో పొడిచిన ఘటన లండన్ లోని ఓ పాఠశాలలో చోటుచేసుకుంది. పరారీలో ఉన్న ఆ విద్యార్థిని పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా గాలింపులు జరుపుతున్నారు. ప్రస్తుతం కత్తిపోట్లకు గురైన ఆ ఉపాధ్యాయుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. బ్రాడ్ పోర్డ్లోని డైక్సాన్స్ కింగ్స్ అకాడమీలో చదువుతున్న పద్నాలుగేళ్ల ఆసియా విద్యార్థి ఉన్నట్లుండి గురువారం ఉదయం ఓ 50 ఏళ్ల ఉపాధ్యాయుడిపై కత్తితో దాడి చేశాడు.

బ్రాడ్ పోర్డ్ నగరంలో పాకిస్థాన్కు చెందినవాళ్లే ఎక్కువగా ఉంటారు అయితే, దాడి చేసిన విద్యార్థి ఏ దేశస్తుడు అనే విషయం మాత్రం స్పష్టం కాలేదు. బ్రిటన్ లో కత్తితో దాడి చేయడాన్ని మిగితా కేసుల కంటే తీవ్రంగా పరిగణిస్తారు. అసలు ఆ విద్యార్థి టీచర్ పై కత్తితో దాడి చేయడానికి కారణాలు ఏమిటనే విషయంపై విచారణ జరుపుతున్నామని సైమన్ అట్కిన్ సన్ అనే పోలీసు అధికారి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement