అఫ్గనిస్థాన్ లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఓ పోలీస్ అకాడమీపై ఆత్మాహుతి దాడికి పాల్పడి 20 మంది ప్రాణాలు బలిగొన్నారు.
కాబుల్: అఫ్గనిస్థాన్ లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఓ పోలీస్ అకాడమీపై ఆత్మాహుతి దాడికి పాల్పడి 20 మంది ప్రాణాలు బలిగొన్నారు. మరో 30మంది వరకు గాయాలపాలయ్యారు. శుక్రవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. ఒకే రోజు బాంబు దాడి జరగడం ఇది రెండో సారి.
కాబూల్లో పోలీస్ రిక్రూట్ మెంట్ జరుగుతున్న సమయంలో వరుసలో నిల్చున్న ఓ ఉగ్రవాది.. తన ఒంటినిండ బాంబులు ధరించుకొని వచ్చాడు. అది గమనించని పోలీసుల సాధారణ పనుల్లో నిమగ్నమై ఉండగా.. అతడు అకాడమీ గేటు సమీపంలోకి రాగానే తనను తాను పేల్చుకున్నాడు. దీంతో అక్కడి వాతావరణం భీతావాహంగా తయారయింది. రిక్రూట్ మెంట్ వద్దకు వచ్చినవారితోపాటు కొందరు పోలీసులు ప్రాణాలు విడిచారు.