జడ్పీ స్థాయీ సంఘాల ఎన్నిక పూర్తి | Zilla parishad standing committees election completed | Sakshi
Sakshi News home page

జడ్పీ స్థాయీ సంఘాల ఎన్నిక పూర్తి

Oct 22 2014 2:52 AM | Updated on Sep 2 2017 3:13 PM

జిల్లా పరిషత్‌లోని ఐదు స్థాయీ సంఘాలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జడ్పీ చైర్‌పర్సన్ గడిపల్లి కవిత అధ్యక్షతన మంగళవారం ఏర్పాటైన సమావేశంలో ఈ ఎన్నిక జరిగింది.

ఖమ్మం జడ్పీసెంటర్: జిల్లా పరిషత్‌లోని ఐదు స్థాయీ సంఘాలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జడ్పీ చైర్‌పర్సన్ గడిపల్లి కవిత అధ్యక్షతన మంగళవారం ఏర్పాటైన సమావేశంలో ఈ ఎన్నిక జరిగింది. గత సమావేశంలో ఆర్థిక, పనుల కమిటీలను పూర్తి స్ధాయిలో ఎన్నుకోగా మిగతా ఐదు కమిటీల్లో కొందరు సభ్యులు సంతకాలు చేయకపోవడంతో మళ్లీ సమావేశం నిర్వహించారు.

ఈ మిగిలిన పోయిన ఐదు కమిటీల సభ్యులను ఎన్నుకున్నారు. వ్యవసాయం, సాంఘిక సంక్షేమం, మహిళా సంక్షేమ కమిటీల్లో చైర్‌పర్సన్ కోఆప్షన్ మెంబర్‌గా ఉంటారు. అశ్వాపురం జడ్పీటీసీ తోకల లత సమావేశానికి హాజరుకాకపోవడంతో ఇద్దరు జడ్పీటీసీ సభ్యులు ఆమె పేరును ప్రతిపాదించి, బలపరచడంతో ఆమె మహిళా సంక్షేమ కమిటీకి ఎన్నికయ్యారు. దీనితో జడ్పీ స్థాయీ సంఘాల ఎన్నిక పూర్తయింది.

1. ప్రణాళిక, ఆర్థిక కమిటీ
 అధ్యక్షురాలిగా చైర్‌పర్సన్ గడిపల్లి కవిత, సభ్యులుగా తల్లాడ, దమ్మపేట, కల్లూరు, కామేపల్లి, మణుగూరు, చండ్రుగొండ జడ్పీటీసీలు మూకర ప్రసాద్, దొడ్డాకుల సరోజిని, జె.లీలవతి, మేకల మల్లిబాబుయాదవ్, పాల్వంచ దుర్గ, కృష్ణారెడ్డితో పాటు మహబూబాబాద్ ఎంపీ సీతారాంనాయక్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ ఎన్నికయ్యారు.

2. గ్రామీణాభివృద్ధి కమిటీ
 అధ్యక్షురాలిగా చైర్‌పర్సన్ కవిత, సభ్యులుగా జడ్పీటీసీలు ఎ. సత్యనారాయణమూర్తి (దుమ్ముగూడెం), అంకత మల్లికార్జున్ (అశ్వారావుపేట), చండ్ర అరుణ (ఇల్లెందు), జాడి జానమ్మ (పినపాక), గౌని ఐలయ్య (బయ్యారం), ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, అశ్వారావుపేట, ఖమ్మం ఎమ్మెల్యేలు తాటి వెంకటేశ్వర్లు, పువ్వాడ అజయ్‌కుమార్ ఎన్నికయ్యారు.

3. వ్యవసాయ కమిటీ
ఈ కమిటీ అధ్యక్షులుగా వైస్ చైర్మన్ బరపటి వాసు, సభ్యులుగా జడ్పీటీసీలు సోమిడి ధనలక్ష్మి (వాజేడు), వి.రామచంద్రనాయక్ (కూసుమంచి), గుగులోత్ బాషా (వేంసూరు), గోగ్గిల లక్ష్మి (గుండాల), జియావుద్దీన్ (కోఆప్షన్ సభ్యులు), ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, పాలేరు ఎమ్మెల్యే రామిరెడ్డి వెంకటరెడ్డి ఎన్నికయ్యారు.

4. విద్య, వైద్య సేవల కమిటీ
అధ్యక్షులుగా చైర్‌పర్సన్ కవిత, సభ్యులుగా లక్కినేని సురేందర్ (టేకులపల్లి), గిడ్లం పరంజ్యోతిరావు ( కొత్తగూడెం), కూరపాటి తిరీషా (చింతకాని), అంకశాల శ్రీనివాస్ (ఎర్రుపాలెం), మౌలాన (కోఆప్షన్ సభ్యులు), కొత్తగూడెం, మధిర ఎమ్మెల్యేలు జలగం వెంకట్రావ్, మల్లు భట్టివిక్రమార్క ఎన్నికయ్యారు.

5. మహిళా సంక్షేమ సంఘం
అధ్యక్షురాలిగా జడ్పీటీసీ తోటమళ్ల హరిత (చర్ల), సభ్యులుగా అనిత (నేలకొండపల్లి), మూడు ప్రియాంక (మధిర), తోకల లత (అశ్వాపురం), విజయ (తిరుమలాయపాలెం), పినపాక, భద్రాచలం ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, సున్నం రాజయ్య ఎన్నికయ్యారు.

6. సాంఘిక సంక్షేమ కమిటీ
అధ్యక్షురాలిగా సత్తుపల్లి జడ్పీటీసీ హసావత్ లక్ష్మి, సభ్యులుగా శ్యామల (ఏన్కూరు), తేజావత్ సోమ్మా (కొణిజర్ల), వాంకుడోతు రజిత (పెనుబల్లి), బి. అంజి (ముల్కలపల్లి), ఏఎస్ వెంకటేశ్వర్లు (జూలూరుపాడు), నాగేశ్వరరావు (ముదిగొండ) వైరా, సత్తుపల్లి ఎమ్మెల్యేలు బాణోత్ మదన్‌లాల్, సండ్ర వెంకటవీరయ్య ఎన్నికయ్యారు.

7. పనుల స్థాయీ కమిటీ
అధ్యక్షురాలిగా చైర్‌పర్సన్ కవిత, సభ్యులుగా జడ్పీటీసీలు ఉన్నం వీరేందర్ (కారేపల్లి), ధరావత్ భారతి (ఖమ్మం రూరల్), వీరూనాయక్ (రఘునాథపాలెం), బాణోత్ కొండ (బోనకల్లు), బొర్రా ఉమాదేవి (వైరా), ఎద్దు మాధవి (గార్ల), ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య ఎన్నికయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement