ప్రజలపై భారం మోపడంలో రెండు రాష్ట్రాలు సమానంగా ఉన్నాయని తెలంగాణ వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి శివకుమార్ విమర్శించారు.
హైదరాబాద్: ప్రజలపై భారం మోపడంలో రెండు రాష్ట్రాలు సమానంగా ఉన్నాయని తెలంగాణ వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి శివకుమార్
విమర్శించారు. తెలంగాణలో విద్యుత్ చార్జీల పెంపును వ్యతిరేకిస్తున్నామని శివకుమార్ అన్నారు. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు
తగ్గుతున్న రాష్ట్రంలో చార్జీలు పెంచడం దారుణమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే పెంచిన విద్యుత్ చార్జీలను
ఉపసంహరించుకోవాలని శివకుమార్ డిమాండ్ చేశారు.