జీవితంపై విరక్తి చెంది ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
బంజారాహిల్స్ (హైదరాబాద్) : జీవితంపై విరక్తి చెంది ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బంజారాహిల్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఫిలింనగర్‌లో నివసించే వై. భానుతేజ(25) హైటెక్ సిటీ సమీపంలోని సన్‌షైన్ ఆస్పత్రిలో సూపర్‌వైజర్‌గా పని చేస్తున్నాడు. కాగా గత కొంత కాలం నుంచి నిరాశ నిస్పృహలతో ఉంటున్నాడు.
జీవితంపై విరక్తి పుడుతున్నదంటూ పలుమార్లు కుటుంబ సభ్యులతోను, స్నేహితులతోనూ అంటుండేవాడు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం రాత్రి తన గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తండ్రి వై.ప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.