గేమ్‌తో కుస్తీ.. నిద్రకు స్వస్తి | Wrestling with the sleep to end the game | Sakshi
Sakshi News home page

గేమ్‌తో కుస్తీ.. నిద్రకు స్వస్తి

Sep 22 2014 1:55 AM | Updated on Sep 2 2017 1:44 PM

గేమ్‌తో కుస్తీ.. నిద్రకు స్వస్తి

గేమ్‌తో కుస్తీ.. నిద్రకు స్వస్తి

ఇటీవలి కాలంలో బాగా ప్రాచుర్యం పొందిన ఆట క్యాండీ క్రష్ సాగా.

క్యాండీక్రష్ సాగా మత్తులో యువత
పిల్లలతో పాటు పెద్దలూ బానిసలే

 
ఇటీవలి కాలంలో బాగా ప్రాచుర్యం పొందిన ఆట క్యాండీ క్రష్ సాగా. ఈ పేరుతోనూ ఓ ఆట ఉందా అనుకుంటున్నారా? ఉంది. అయితే శారీరక శ్రమ ఉండే ఆట కాదిది. ఏ ఒలింపిక్స్‌లోనూ ఆడరు దీనిని. గల్లీల్లోనూ పోటీలు ఉండవు. కేవలం సమయాన్ని వృథా చేసే గేమ్ ఇది. స్మార్ట్‌ఫోన్‌లు, కంప్యూటర్లలో గంటల తరబడి ఈ ఆట ఆడుతున్నారు. దీని మత్తులో యువతీ యువకులు మునిగి తేలుతున్నారు. కొందరైతే రాత్రింబవళ్లు ఈ ఆట ధ్యాసలోనే గడుపుతున్నారు. నిద్రకూ దూరమవుతున్నారు. కళాశాల విద్యార్థులు కొందరు తరగతులకు డుమ్మాకొట్టి మరీ గంటల కొద్దీ ఈ ఆట ఆడుతున్నట్లు తెలుస్తోంది. పెద్దవాళ్లు కూడా ఈ ఆటకు బానిసలవుతున్నారు.
 
 మద్నూర్ :
కొన్నాళ్ల నుంచి స్మార్ట్ ఫోన్ల వినియోగం విపరీతంగా పెరిగింది. యువత ఫోన్ తీసుకు న్న మొదటి రోజే ఫేస్‌బుక్‌ను ఇన్‌స్టాల్ చేసు కుంటున్నారు. ఈ మధ్య కాలంలో క్యాండీక్రష్ సాగా అనే ఆట ప్రాచుర్యంలోకి వచ్చింది. ఫేస్‌బుక్ సిద్ధమైన వెంటనే క్యాండిక్రష్ సాగా ప్రత్యక్షమవుతోంది. దానిపై అవగహన లేకపోయినా స్నేహితుల ద్వారా మెస్సేజ్ ల ప్రవాహం మొదలవుతుంది. ఇదేంటో తెలుసుకోవాలనే కుతూహలంలో ఒకసారి దాన్ని ఇన్‌స్టాల్ చేస్తే.. ఇక అంతే సంగతులు. తొలుత సరదాగా అనిపించే ఈ గేమ్.. ఆ తర్వాత వ్యసనంలా మారుతుంది.

పనులను పక్కనబెట్టి..

పట్టణంలో ఓ హోటల్‌లో వెయిటర్‌గా పనిచేస్తున్న వ్యక్తి తన పని మరచిపోయి క్యాండీక్రష్ సాగా గేమ్ ఆడుతున్నాడు. కిరాణ దుకాణంలో జీతం ఉంటున్న వ్యక్తి నుంచి యజమాని వరకు అందరూ ఈ గేమ్‌లో మునిగి తేలుతున్నారు. ఈ గేమ్ కోసం పనులను సైతం పక్కన పెట్టేస్తున్నారు. కొందరు విద్యార్థులు కళాశాలలకూ వెళ్లకుండా ఆటాడుతున్నారంటే పరిస్థితి అర్థమవుతుంది. ఈ గేమ్‌కు బానిసలైనవారిలో విద్యార్థులే కాదు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, వ్యాపారులూ ఉండడం గమనార్హం. ఈ గేమ్ ఆడేవారి గేమ్ లెవల్ తదితర వివరాలు ఎప్పటికప్పుడు ఫేస్‌బుక్‌లో అందరికీ తెలుస్తూనే ఉంటాయి. దీంతో ఇదో అంటువ్యాధిలా మారి అందరినీ ఇబ్బంది పెడుతుంది.
 
కాలాన్ని కరిగిస్తూ..

 
ఈ గేమ్ కారణంగా విలువైన సమయాన్ని నష్టపోతున్నారు. విద్యార్థులపై ఈ గేమ్ ప్రభావం ఎక్కువగానే ఉంది. ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్నవారిలో అత్యధిక మంది ఈ గేమ్‌లో నిమగ్నమయ్యారని తెలుస్తోంది. మామూలుగా ఉన్న గేమ్‌లకు ఓ రీచ్ పాయింట్ ఉంటుంది. కానీ ఈ గేమ్ అన్‌లిమిటెడ్. 15 లెవల్ పూర్తి అయితే ఓ స్టేజ్ పూర్తి అవుతుంది. ఇలాంటి స్టేజీలు వెయ్యికి పైగా ఉన్నాయి. ఆ లెక్కన దీన్ని పూర్తి చేయాలంటే నెలల సమయం పడుతుంది. మధ్యలో లైఫ్‌లు లేనప్పుడు ఫ్రెండ్ రిక్వెస్టులు పెట్టి మరీ లైఫ్‌లు పొందుతున్నారు. గేమ్ సంగతి ఎలా ఉన్నా నెట్ బ్యాలెన్స్ మాత్రం భారీగా కరిగిపోతోంది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement