మంచిర్యాల ప్రభుత‍్వ ఆస‍్పత్రిలో మంగళవారం ఉదయం సమీన(22) అనే బాలింత మృతి చెందింది.
ప్రభుత‍్వ ఆస‍్పత్రిలో బాలింత మృతి, ఆందోళన
Jun 20 2017 2:16 PM | Updated on Oct 9 2018 5:27 PM
మంచిర్యాల: మంచిర్యాల ప్రభుత‍్వ ఆస‍్పత్రిలో మంగళవారం ఉదయం సమీన(22) అనే బాలింత మృతి చెందింది. ఆసిఫాబాద్ ప్రభుత‍్వ ఆసుపత్రిలో సోమవారం రాత్రి సమీన మగబిడ‍్డను ప్రసవించింది. ప్రసవించిన తర్వాత సమీన ఆరోగ‍్యం విషమంగా ఉండటంతో అక‍్కడి వైద్యులు మంచిర్యాల ఏరియా ఆస‍్పత్రికి రెఫర్ చేశారు.
మంగళవారం ఉదయం మంచిర్యాల ఆస‍్పత్రిలో చేరిన ఆమె శ‍్వాస తీసుకోవడం కష‍్టం కావడంతో ఆక్సిజన్ పెట్టారు. అక‍్కడి సిబ‍్బంది కాసేపటికి ఆక్సిజన్ తోలగించడంతో సమీన ఊపిరి ఆడక మృతి చెందింది. దాంతో మృతురాలి కుటుంబసభ‍్యులు ఆస‍్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు.
Advertisement
Advertisement