అబిడ్స్ సీఐ వేధింపులకు పాల్పడుతున్నారని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కు మహిళా కానిస్టేబుల్ ఫిర్యాదు చేశారు
అబిడ్స్ సీఐపై మహిళా కానిస్టేబుల్ ఫిర్యాదు
Oct 2 2014 8:07 PM | Updated on Aug 13 2018 2:57 PM
హైదరాబాద్: అబిడ్స్ సీఐ వేధింపులకు పాల్పడుతున్నారని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కు మహిళా కానిస్టేబుల్ ఫిర్యాదు చేశారు. డ్యూటి విషయంలో తనను వేధింపులకు గురి చేస్తున్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.
మహిళా కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ జరపాలంటూ ఉన్నతాధికారులకు కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. అయితే తాను ఎలాంటి వేధింపులకు పాల్పడలేదని సీఐ వివరణ ఇచ్చినట్టు తెలుస్తోంది.
Advertisement
Advertisement