కరీంనగర్ పట్టణం సమీపంలోని మానకొండూరు చెరువులో నిమజ్జనానికి వెళుతున్న ఓ వినాయకుడి విగ్రహం ఒరిగి అక్కడున్న వారిపై పడడంతో ఇద్దరికి గాయాలయ్యాయి.
మానకొండూరు (కరీంనగర్ జిల్లా) : కరీంనగర్ పట్టణం సమీపంలోని మానకొండూరు చెరువులో నిమజ్జనానికి వెళుతున్న ఓ వినాయకుడి విగ్రహం ఒరిగి అక్కడున్న వారిపై పడడంతో ఇద్దరికి గాయాలయ్యాయి. ఆదివారం ఉదయం ఈ ఘటన జరిగింది. కరీంనగర్ పట్టణానికి చెందిన తిరుమల సాయి, పులి శివ అనే యువకులకు గాయాలు కాగా, వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.
కాగా మరోవైపు మానకొండూరు చెరువుకు నిమజ్జనం కోసం పెద్ద సంఖ్యలో వినాయక విగ్రహాలు తరలివస్తున్నాయి. ఆదివారం ఉదయానికే 600 విగ్రహాలను నిమజ్జనం చేశారు. మధ్యాహ్నం వరకూ ఈ కార్యక్రమం కొనసాగనుంది.