తెలంగాణ విద్యాసంస్థల్లో ‘గ్రీన్‌ డే’ | Today 'Green Day' in Educational Institutions | Sakshi
Sakshi News home page

తెలంగాణ విద్యాసంస్థల్లో ‘గ్రీన్‌ డే’

Jul 15 2017 9:30 AM | Updated on Sep 5 2017 4:06 PM

తెలంగాణ విద్యాసంస్థల్లో ‘గ్రీన్‌ డే’

తెలంగాణ విద్యాసంస్థల్లో ‘గ్రీన్‌ డే’

తెలంగాణ వ్యాప్తంగా అన్ని విద్యాసంస్థల్లో శనివారం గ్రీన్‌ డే పాటించనున్నారు.

హైదరాబాద్‌: తెలంగాణ వ్యాప్తంగా అన్ని విద్యాసంస్థల్లో శనివారం గ్రీన్‌ డే పాటించనున్నారు. ఈ మేరకు రాజ్‌భవన్‌లోని ప్రభుత్వ పాఠశాలలో గవర్నర్‌ నరసింహన్‌ దంపతులు, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మొక్కలు నాటనున్నారు. గ్రామాలు, పట్టణాలలో ఉదయం 9 గంటల నుంచి హరితహారంపై ర్యాలీలు జరగనున్నాయి.
 
10 గంటలకు మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభమవుతుంది. 11 గంటలకు పర్యావరణం, మొక్కల పెంపకంపై అవగాహన సదస్సులు జరుగుతాయి. అన్ని విద్యా సంస్థల్లో 50 లక్షల మొక్కలు నాటాలని విద్యాశాఖ లక్ష్యంగా పెట్టుకుంది.

Advertisement
 
Advertisement
Advertisement